డెమాస్కస్: అది సిరియాలోని దారాయా అనే పట్టణం. నిత్యం బాంబు దాడులతో భయం కోరల్లో చిక్కుకున్న ప్రజలు. ఇప్పుడు అక్కడ పెద్దలు బతుకుదెరువుకోసం పాకులాడుతుండగా.. వారి బిడ్డలు మాత్రం తమ బతుకులు ఎందుకు ఇలా తయారయ్యాయని ఒక పెద్ద ప్రశ్నను మోస్తున్నారు. ప్రపంచం మొత్తానికి తమ వాస్తవ స్థితిగతులను తెలుసుకోవాలని నిర్ణయించుకొని దారాయా నగరంలోని చిన్నారులంతా ఆంగ్లం నేర్చుకునే పనిలో పడ్డారు.
ప్రపంచం మొత్తానికి తెలిసిన భాష ఆంగ్లం కావడంతో ఆంగ్లాన్ని నేర్చుకునేందుకు కుస్తీపట్టడమే కాకుండా నేర్చుకున్న భాషతో తమ కష్టాలను వెల్లడిస్తున్నారు. వారి చేస్తున్న సాహసానికి ఓ సంస్థ కూడా తోడై ఒక డాక్యుమెంటరీగా ఓ వీడియోను కూడా రూపొందించింది. అందులో భాగంగా కొంతమంది పిల్లలు చెప్పిన అభిప్రాయాలు విడుదల చేసింది. అందులో ఉన్న అంశాలు ఏమిటంటే..
'మేం ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ప్రాంతంలో మూడున్నరేళ్లుగా జీవిస్తున్నాం. పటణంలో జీవించినట్లుగానే అనిపిస్తుంది. కానీ, ఏదో ఒక సమయంలో తమకు నచ్చినవారినో.. నచ్చిన వస్తువునో కోల్పోతున్నాం. మా సమయం మొత్తం బాంబులు, విమాన దాడుల నుంచి తప్పించుకునేందుకు దాచుకోవడానికి సరిపోతుంది. ఎప్పుడు ఏ భవనంపై బాంబు పడుతుందో తెలియడం లేదు. అసలు మా దగ్గర సివిల్ వార్ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మాకు పాఠాలు చెప్పే స్కూళ్లను అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. అంటే మేమెంతో అపాయకరమైన స్థితిలో విద్యను అభ్యసిస్తున్నాం. మేం ఇప్పటికీ ఇంగ్లిష్ మాట్లాడలేకపోతున్నాం. కానీ మా టీచర్ సాయం చేస్తున్నారు' అని జహారా, హదాయా అనే పేర్లుగల తదితర పిల్లలు తమ వాస్తవ పరిస్థితులు వెల్లడించారు.
పైన బాంబులు.. అండర్ గ్రౌండ్లో పాఠాలు
Published Wed, Apr 27 2016 1:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement