Civil War
-
సిరియాలో మళ్లీ... అంతర్యుద్ధం!
సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో తాజాగా తిరుగుబాటుదార్ల పరమైంది. ప్రభుత్వ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికిపైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగడం తాలూకు మూలాలు ఉక్రెయిన్–రష్యా, ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఉన్నాయి.2011లో ‘అరబ్ వసంతం’ పేరిట అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్ దేశాల ప్రజలకూ స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చలాయిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్ ఉక్కుపాదంతో అణచేయడంతో జనం ఆయుధాలు చేతపట్టారు. సైన్యంలో అసద్‌ను వ్యతిరేకించే వర్గం కూడా వారితో చేతులు కలిపింది. అంతా కలిసి తిరుగుబాటుదార్లుగా మారారు. దేశమంతటా వేర్వేరు తిరుగుబాటు దళాలు ఏర్పడ్డాయి. వీటి సిద్ధాంతాలు వేరైనా అసద్‌ను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉమ్మడి లక్ష్యం. అసద్ అంటే గిట్టని తుర్కియే, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదార్లకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. దాంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్‌కు మద్దతుగా సిరియా మిత్రదేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా అసద్ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధమే జరిగింది. ఉగ్ర సంస్థలకు చేదు అనుభవం సిరియా పరిణామాలను అల్‌ఖైదా, ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదార్లకు సాయం చేసే నెపంతో సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి ఈ జిహాదీల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) సాయంతో విరుచుకుపడటంతో అల్‌ఖైదా, ఐసిస్ తోకముడిచి దేశం వీడాయి. కాల్పుల విరమణతో ఆగిన ఉద్రిక్తతలు సిరియాలో పలు ప్రావిన్స్‌లను తిరుగుబాటుదార్లు ఆక్రమించడం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వా«దీనం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. 2020లో ఇద్లిబ్ ప్రావిన్స్ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులూ ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటినుంచీ కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదార్ల అ«దీనంలోనే ఉండిపోయింది.నాయకత్వం ఎవరిది? సిరియాలో తిరుగుబాటుదార్లతో ఏర్పాటైన ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’కు హయత్ తా హ్రీర్ అల్–షామ్ సంస్థ నాయకత్వం వహి స్తోంది. ఇది గతంలో అల్–నుస్రా ఫ్రంట్ పేరు తో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్ ప్రావిన్స్‌లో అధికారం చెలాయి స్తోంది. తుర్కియే, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూప్‌లు తాహ్రీర్ అల్–షామ్‌కు అండగా నిలుస్తున్నాయి. ఇప్పుడే ఎందుకీ అలజడి? అసద్ మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హెజ్బొల్లా గ్రూప్‌కూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటినుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వమూ బలహీనపడింది. ఈ పరిస్థితిని వాడకుంటూ తిరుగుబాటుదార్లు క్రియాశీలకంగా మారారు. ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’ పేరిట కొత్త కూటమి కట్టారు. పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. ఇది అసద్‌కు భారీ ఎదురుదెబ్బే. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్లిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలు పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అసద్ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా? లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కుతుందా అన్నది మాత్రం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సిరియాలో భీకర డ్రోన్ దాడి
బీరుట్: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్ దాడి సంభవించింది. హొమ్స్ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు. సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. Drone attack killed over 100 in a graduation ceremony at Syrian Military Academy, Syria. Several Syrian regime generals and officers who attended the ceremony are killed or injured. Middle East is heating up. https://t.co/p099AtAdu1 pic.twitter.com/NK2xAWCaqo — Shadow of Ezra (@ShadowofEzra) October 5, 2023 -
సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై భారత్‌లో వెల్లువెత్తిన ఉత్సాహం... సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ను వ్యూహాత్మకంగా విస్మరించడానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిష్క్రియాత్మకత వల్లే ఈశాన్య ప్రాంతంలో ఇంత పతనం సంభవించింది. మయన్మార్‌లో 28 నెలల నాటి అంతర్యుద్ధం పాక్షికంగా మణిపుర్ మంటలను పెంచి పోషించింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4,000 ఆయుధాల చోరీ జరిగింది. మయన్మార్ నుండి వచ్చిన శరణార్థుల వెల్లువతో పాటు, కుకీలు లేని ఇంఫాల్ లోయ, మైతేయిలు లేని కుకీ–నివాస కొండ ప్రాంతాలు అనే జాతి ప్రక్షాళన మణిపుర్‌ను నిలువునా విభజించింది. కుకీలు, మైతేయిల జాతి ప్రక్షాళన ధోరణి మణిపుర్‌ను నిట్టనిలువున చీల్చింది. తీవ్రమైన ఈ విభజనే, విద్రోహం(ఇన్సర్జెన్సీ) మళ్లీ చెలరేగుతుందన్న భయా లను రేకెత్తించింది. రాష్ట్ర ఆయుధాగారాల నుండి కొల్లగొట్టిన ఆయు ధాలు అందుబాటులో ఉండటమే ఈ భయాలకు కారణం. గత నెలలో అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ ఇలా చెప్పారు: ‘‘పరిస్థితి అసాధారణంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.’’ ఇంఫాల్‌లోని నాలుగు జిల్లాల్లో గల 39 పోలీస్ స్టేషన్లలోని 16 స్టేషన్లలో సాధారణ స్థితి ఏర్పడినట్లు చూపడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మార్చి 25న ఉపసంహరించుకున్న తర్వాత పరి స్థితి ఇలా ఉంది. ఈ చర్యను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. ‘‘విద్రోహాన్ని గణనీయంగా తగ్గించేశాం. దాదాపుగా లేదు’’ అని మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే చెప్పారు. ఈ పరిస్థితి ఉత్తరం వైపు సైన్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి, అలాగే ఈశాన్య ప్రాంతంలో సైనిక చర్యల బాధ్యతను అస్సాం రైఫిల్స్‌కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ ఆచర ణకు భిన్నం. ఒక్క 1965, 1971 యుద్ధాల సమయంలో మాత్రమే ఇలా చేశారు. మయన్మార్‌లో మిలిటరీ జుంటాకూ, దానిని వ్యతిరేకిస్తున్న శక్తుల (నేషనల్ యూనిటీ గవర్నమెంట్–ఎన్‌యూజీ, ఇంకా ప్రతిఘటన)కూ మధ్య అంతర్యుద్ధం దాని మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. నాగాలాండ్, మిజోరాం, మణిపుర్‌లకు సమీపంలోని సగాయింగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రం ప్రధాన పోరాట వేదికలుగా ఉంటున్నాయి. సైనిక జుంటా ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయినందున, అది నాపాం బాంబులను ప్రయోగించడం, గ్రామాలను దోచుకోవడం, తగలబెట్టడంతోపాటు వైమానిక బాంబులను ఆశ్రయిస్తోంది. పర్య వసానంగా, దాదాపు 60,000 మంది చిన్, కుకి, జోమి శరణార్థులు మిజోరం, మణిçపుర్లకు పారిపోయారు. వీరిలో కొందరు ఎన్యూ జీకి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మయన్మార్‌తో 1,600 కి.మీ. పొడవైన అంతగా గస్తీ ఉండని సరిహద్దుతోపాటు, ఇరువైపులా 16 కి.మీ. మేర స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తున్న పాలన కారణంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, బంగారం, విలువైన రాళ్లు మణిపూర్ లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ గుర్తుందిగా? మాదకద్రవ్యాల అక్రమ రవాణా మణిపుర్‌కు కొత్తేమీ కాదు. భద్రతా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 ఫిబ్ర వరిలో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌తో దొరికిన సైనిక కల్నల్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 15న ‘గోవా క్రానికల్’లో ప్రచురితమైన కథనంలో, మణిపుర్‌లోని జఠిలమైన మాదకద్రవ్యాల వ్యాపార నెట్వర్క్ వివరా లను ఇచ్చారు. 2021 నుంచి మణిపుర్లో గసగసాల సాగు 33 శాతం పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది. ఇది కుకీలకు నగదు పండించే పంట అని మైతేయిలు ఆరోపిస్తున్నారు. కానీ గోవా క్రానికల్ కథనం ప్రకారం, ముస్లిం పంగల్లతో సహా ప్రతి సమాజానికీ ఈ పంటలో వాటా ఉంది. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని మయన్మార్ వివాదం తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం)తో వాణిజ్యం, పరస్పర చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన విధానం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక మైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగ్నేయాసియాతో ఉన్నాయి. మయన్మార్ అంతర్గత భద్రతా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన కారణంగా అవి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి,’’ అని చెప్పారు. మిజోరం మార్గంలో తిరుగుబాటు సోకిన రాఖైన్ రాష్ట్రం గుండా వెళుతున్న దాదాపు రెండు దశాబ్దాల నాటి మల్టీమోడల్ కలాదాన్ ప్రాజెక్టును అరాకాన్ సైన్యం (మయన్మార్) కాలానుగుణంగా నిరోధిస్తూ వచ్చింది. మణిపుర్‌లోని మోరేతో థాయ్‌లాండ్‌లోని మయీ సాట్‌తో కలిపే భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టును సగాయింగ్(మయన్మార్) ప్రాంతంలో జరిగిన పోరాటాల కారణంగా నిలిపివేశారు. ఈ నెలలోనే జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ మయన్మార్ విదేశాంగ మంత్రి థాన్ స్వేతో సమావేశమయ్యారు. భారతదేశం, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో జరిగిన పోరాటాలు, వైమానిక దాడులు కలిగిస్తున్న ప్రమాదకరమైన ప్రభావాల గురించి థాన్ స్వేకి వివరించారు. ‘ఎన్‌యూజీ’కి చెందిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పీడీఎఫ్) సగాయింగ్ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తోంది. అంతర్యుద్ధ ప్రతి ష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ‘అన్ని ఫలాలను జుంటా బుట్టలో’ ఉంచే విధానాన్ని ఢిల్లీ సమీక్షించుకోవాలి. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి చిన్ నేషనల్ ఫ్రంట్, అరకాన్ సైన్యాన్ని భారత ఏజెన్సీలు సిద్ధం చేయాలి. ప్రజాస్వామ్య శక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం, ఆయుధాల సరఫరాతో సహా ఎన్‌యూజీ/పీడీఎఫ్‌తో సమాచార మార్గాలను ఏర్పాటు చేయడం ఆచరణీయమైన ఎంపికలు. ఇది సమస్యను నిరోధించవలసిన చర్యను ఆలస్యంగా చేపట్టడం లాంటిదే అయినప్పటికీ, భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలకంగా ఉన్న మణిపుర్ సమస్యకు తక్షణ చికిత్స అవసరం. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపుర్‌ను రక్తసిక్తం చేయడానికి అనుమతించాయి, కొత్త తిరుగుబాట్లకు బీజాలు నాటడానికి అనుమతించాయి. అంతకుమించి సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాల నిష్పా క్షికతకు సవాలు విసిరే అవాంఛనీయమైన దుఃస్థితిలో ఉంచాయి. ఒక సీఆర్పీఎఫ్ భద్రతా సలహాదారు మణిపుర్ సీఎం బీరెన్‌సింగ్‌కు మార్గనిర్దేశం చేస్తుండగా, భద్రతా దళాల ప్రత్యేక రక్షణ చట్టం పరిధిలోకి రాని ప్రాంతాల్లో పౌర అధికారులకు సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాలు సాయం చేస్తున్నాయి. కుకీల పట్ల పక్షపాతం చూపుతున్నాయని ఆరోపిస్తూ అస్సాం రైఫిల్స్‌పై మణిపుర్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం, అస్సాం రైఫిల్స్‌ను తొలగించాలని మైతేయిలు డిమాండ్ చేయడం, మరోవైపున నిషేధిత ఉగ్ర వాద గ్రూపులను సైన్యం, అస్సాం రైఫిల్స్ విడుదల చేయడంపై లేవ నెత్తుతున్న ప్రశ్నలు మణిపుర్ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రధాన పని లూటీకి గురైన ఆయుధాలను తిరిగి పొందడమే. వివిధ ప్రదేశాలలో ఆయుధ డిపా జిట్ పెట్టెలను ఉంచినప్పటికీ, మెజారిటీ ప్రజలు వాటి పక్కన సెల్ఫీలు తీసుకుంటున్నారు. మణిçపుర్, ఈశాన్య ప్రాంతాలపై జరుగు తున్న సెమినార్లలో పరిస్థితిని వివరించడానికి వాడుతున్న మాటలు: ‘అరాచకం’, ‘మరో కంబోడియా’, ‘సమాజాల మధ్య పూర్తి అప నమ్మకం’. ఆశ్చర్యకరంగా, ప్రధానమంత్రి లాగే, ఆర్మీ చీఫ్ గానీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గానీ మణిపుర్‌ను ఇంతవరకూ సందర్శించలేదు. జరుగుతున్న తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేసే విషయంలో ప్రభుత్వం తన రాజకీయ సంకల్ప లేమిని ప్రస్ఫుటంగా చూపిందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈశాన్యం నుండి 25 మంది లోక్‌సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందినవారే. మణిపుర్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయ పరిష్కారం సాధించాలంటే, ముందుగా చేయాల్సిన విధులు: హింసను అరికట్టడం, రాష్ట్రపతి పాలన విధించడం. -వ్యాసకర్త సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Imran Khan: తోషఖానా టు బందీఖానా! ఇమ్రాన్ అరెస్టయితే అంతర్యుద్ధమా?
పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తోషఖానా కేసులో తనపైనున్న నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఇమ్రాన్ తనంతట తాను లొంగకపోతే మార్చి 18లోగా అరెస్ట్ చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సెషన్స్ న్యాయమూర్తి జఫర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేయాలని ఆదేశించామని మళ్లీ వారెంట్ల రద్దు పిటిషన్ ఎందుకు వేశారని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. దీంతో ఇమ్రాన్ ఎదుట ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. శనివారం నాడు ఆయన అరెస్ట్ కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి 10 రోజుల క్రితం పోలీసులు ప్రయత్నించినప్పట్నుంచి పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. పోలీసులు ఇమ్రాన్ నివాసానికి వెళ్లిన ప్రతీసారి ఆయన ఇంట్లో లేకపోవడం, కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగడం సర్వసాధారణంగా మారింది. ఏమిటీ తోషఖానా కేసు..? తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. 1974లో ఇది ఏర్పాటైంది. ప్రభుత్వ అధికారులకొచ్చే కానుకల్ని ఇందులోనే ఉంచుతారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవిని చేపట్టాక తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. అంతేకాదు తనకు వచ్చిన కానుకల్ని ఎంతో కొంత ధర ఇచ్చి తోషఖానా నుంచి తీసుకొని వాటిని తిరిగి అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా 101 కానుకలు వచ్చాయి. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన వాటికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ముకున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు లేదు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఏమంటోంది? ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ అయిన రెండు నెలల తర్వాత పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఆ కానుకల్ని అమ్ముకోవడం చట్ట వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎంతో కొంత ధర చెల్లించి ఆయన ఆ కానుకల్ని తన సొంతం చేసుకున్నారని చెప్పింది. అయితే ఆయన అనైతికంగా ఈ పని చేస్తూ తప్పు దారి పట్టించే ప్రకటనలు చేశారంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది. 37 కేసులు ఇమ్రాన్‌ఖాన్‌పై తోషఖానాతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 37 కేసులు నమోదయ్యాయి. ► పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) ప్రధాన ఎన్నికల అధికారి సికందర్ సుల్తాన్ రజాకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌తో పాటు పీటీఐ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఒక కేసు నమోదైంది ► ఎన్నికల కమిషన్ అయిదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అనర్హత వేటు వేసినప్పుడు ఈసీపీ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించడంపై కేసు దాఖలైంది ► పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్ఛ్ంజ్ యాక్ట్ నియమాలను ఉల్లంఘిస్తూ విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలపై కేసు ► పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు కేసు ► పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేత మొహ్సిన్ షానావజా రంజా ఇమ్రాన్ ఆదేశాల మేరకే తనను పోలీసులు కొట్టి చంపడానికి వచ్చారంటూ హత్యా యత్నం కేసు పెట్టారు అరెస్టయితే అంతర్యుద్ధం తప్పదా..? ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయితే పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను అరెస్ట్ అయితే ఏం చెయ్యాలన్న దానిపైనా ఇమ్రాన్ పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. దానిని సరైన సమయంలో బయటపెడతానని ఆయన చెబుతున్నారు. తమ నేతపై చెయ్యి వేస్తే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆత్మాహుతి దాడులకి దిగుతామని ఇప్పటికే పార్టీ నాయకులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి పీటీఐ కార్యకర్తల సవాల్ ఎదుర్కోవడం కూడా క్లిష్టంగా మారింది. మరోవైపు పంజాబ్ ర్యాలీలో ఇమ్రాన్‌పై దాడి జరిగిన దగ్గర్నుంచి ఆయనను హత్య చేస్తారన్న ఆందోళనలూ ఉన్నాయి. తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన ఇప్పటివరకు కోర్టు ఎదుట కూడా హాజరు కాలేదు. ప్రభుత్వ పెద్దలే తనను హత్య చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారంటూ ఇమ్రాన్ తనకు అనుమానం ఉన్న వారందరి పేర్లు వెల్లడిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తనని జైలుకు పంపినా, చంపేసినా ప్రభుత్వంపై పోరాటం ఆపవద్దంటూ అనుచరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తే.. కొన్ని చివరి వరకు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇక టైటిల్ ఫేవరెట్స్ అయిన అర్జెంటీనా, జర్మనీలకు సౌదీ అరేబియా, జపాన్‌లు షాకివ్వడం అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇక బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ గోల్స్ వర్షం కురిపించింది. ఏకండా 7-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. నికో విలియమ్స్(స్పెయిన్) ఇదిలా ఉంటే స్పెయిన్ జట్టుకు ఆడుతున్న నికో విలియమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతని గతం ఎంతో సంఘర్షణతో కూడుకున్నది. నికోల్ విలియమ్స్ కుటుంబం ఘనాకు చెందినవాళ్లు. అయితే అతను పుట్టకముందే లిబేరియన్ అంతర్యుద్ధం కారణంగా కుటుంబం మొత్తం స్పెయిన్‌కు వలస వెళ్లింది. నికోల్ తండ్రి అంతర్యుద్ధానికి బయపడి కాలి నడకతోనే స్పెయిన్‌కు చేరుకున్నాడు. అప్పటికే నికోల్ విలియమ్స్‌కు ఒక అన్న ఉన్నాడు. అతనే ఇనాకి విలియమ్స్. అతను కూడా ఫుట్‌బాలర్‌గా కొనసాగుతున్నాడు. ఇక్కడ విచిత్రమేంటంటే.. తమ్ముడు నికో విలియమ్స్ స్పెయిన్‌కు ఆడుతుంటే.. అన్న ఇనాకి విలియమ్స్ మాత్రం తన స్వంత దేశమైన ఘనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఒక్క క్లబ్‌కే(అథ్లెటిక్ బిలాబో) ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా మారిన తర్వాత ఇనాకి విలియమ్స్ ఘనాకు వెళ్లిపోయాడు. అతని కుటుంబం మాత్రం స్పెయిన్‌లోనే ఉంది. కుటుంబంతోనే ఉన్న నికో విలియమ్స్ ఫుట్‌బాల్ ఆడుతూ ఆ తర్వాత స్పెయిన్ జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఇక తొలి ఫిఫా వరల్డ్‌కప్ ఆడుతున్న నికో విలియమ్స్.. తన అన్న ఇనాకి విలియమ్స్‌పై స్పందించాడు. ఇనాకి విలియమ్స్(ఘనా) ''ఇద్దరం వేరే జట్టుకు ఆడుతుండొచ్చు.. కానీ మా బంధం మాత్రం ఎప్పుడు ఒకటే. అన్న నాకు నిరంతరం ఆటలో మెళుకువలు చెబుతూనే ఉంటాడు. అతనిచ్చే ధైర్యమే నన్ను మంచి ఫుట్‌బాలర్‌ను చేసింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇద్దరం ఎదురుపడతామే లేదో తెలియదు కానీ అన్నకు ప్రత్యర్థిగా ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఫిఫాలో వస్తే బాగుండు'' అని చెప్పుకొచ్చాడు. ఇక స్పెయిన్-కోస్టారికా మ్యాచ్ ముగిసిన తర్వాత నికో విలియమ్సన్, ఇనాకి విలియమ్సన్‌లు ఒకరినొకరు హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. కాగా ఇనాకి విలియమ్స్ ఘనాకు ఆడుతుండగా.. గురువారం పోర్చుగల్‌తో ఘనా అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: FIFA WC: ఇదెక్కడి ఆచారమో ఏంటో.. ఆకట్టుకున్న జపాన్ జట్టు -
కుల, మత విద్వేషాలను నియంత్రించకపోతే అంతర్యుద్ధమే
చెన్నై: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే పౌర యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు కన్యాకుమారిలో మీడియాతో మాట్లాడారు గహ్లేత్. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీనే చేపట్టాలని, తనతో పాటు అనేక మంది పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని గహ్లోత్ అన్నారు. పార్టీ బలోపేతానికి ఇది ఎంతో అవసరం అన్నారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, రాహుల్ గాంధీ వాటిని పరిష్కరించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మధ్య సోదరభావం, ప్రేమ ఉండాలని, కానీ అందుకు విరుద్ధంగా విద్వేషం, హింస సృష్టిస్తున్నారని గహ్లోత్ విమర్శించారు. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విభజన రేఖ గీస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వీటిపై ఏ రోజూ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇది దేశానికి ఎంత మాత్రమూ మంచిదికాదన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనని రాహుల్ గాంధీ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే గాంధీ కుటుంబసభ్యుల తరఫున ఆశోక్ గహ్లేత్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారు. మరోవైపు గాంధీ కుటుంబసభ్యులే పార్టీ పగ్గాలను చేపట్టాలని వారి విధేయులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమోద్ తివారీ, వీ హనుమంతు రావు సహా మరికొంత మంది నేతలు ఈ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశఆరు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. 19న ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు -
పాకిస్తాన్లో అంతర్యుద్ధం?
కరాచీ: ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుండగా మరోపక్క ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఆర్మీకి, పాక్ పోలీసులకు మధ్య గొడవలు పెరిగి కాల్పులకు దారితీశాయి. ఇంటర్నేషనల్ హెరాల్డ్ తన తాజా ట్వీట్లో పాక్‌లో సివిల్ వార్ ఆరంభమైందని వ్యాఖ్యానించింది. కరాచీలో సింధ్ పోలీసులకు, పాక్ ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పది మంది పోలీసులు మరణించినట్లు ఇంటర్నేషనల్ హెరాల్డ్ నివేదించింది. సింధ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్ అహ్మద్ మహర్‌ను ఆర్మీ నిర్బంధించడంతో గొడవ మొదలైందని సమాచారం. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు మహ్మద్ సఫ్దార్ను అరెస్టు వ్యవహారంలో మహర్‌ను నిర్బంధించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనలపై పాక్ ప్రధాని, ప్రభుత్వం స్పందించలేదు. సఫ్దార్ అరెస్ట్ కోసం.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇటీవల ఏర్పాటు చేసిన పీడీఎం వేదికపై నవాజ్ షరీఫ్ కూతురు మరియం, ఆమె భర్త సఫ్దార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీకి నచ్చని ‘ఓటుకు విలువ ఇవ్వండి’ అని సఫ్దార్ నినాదాలు చేశారని, దీంతో కేసు నమోదైందని తెలిసింది. ఈ కేసులోనే సఫ్దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే సఫ్దార్ను అరెస్ట్‌చేసేలా పోలీసులకు ఉత్వర్వులు ఇవ్వాలని సింధ్ పోలీస్ ఐజీపీ మహర్‌పై సైన్యం ఒత్తిడి చేసిందని, అందుకోసం ఆయనను సైన్యం నిర్బంధించిందని సింధ్ మాజీ గవర్నర్ మహ్మద్ జుబేర్ ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి అయిన మహర్ నిర్బంధం విషయం తెల్సి ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారని సమాచారం. ఈ సందర్భంగా సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగాయని, పది మంది పోలీసులు మరణించారని తెలుస్తోంది. సైన్యం కాల్పులకు నిరసనగా ఏఐజీ ఇమ్రాన్‌సహా సీనియర్ పోలీసు అధికారులు విధులను బహిష్కరించి సెలవు తీసుకున్నారు. అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మహర్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. 10 రోజులదాకా సెలవు కోసం దరఖాస్తు చేసుకోరాదని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ గొడవకు కారణమైన అంశాలపై విచారణ జరపాలని ఆర్మీ చీఫ్ జనరల్ కమార్‌జావెద్ బజ్వా ఆదేశించారు. నిరసనల్లో భారత జెండా ఇటీవల పాక్‌లో జరిగిన భారీ నిరసనల్లో భారత జాతీయజెండాలు చేతబూనారని బుధవారం ట్విట్టర్లో కొంతమంది పోస్ట్‌లు పెట్టారు. వేలాది మంది జనం గుమికూడిన ఈ ఫొటోల్లో కొందరి చేతిలో మువ్వన్నెల జెండాలున్నాయి. పాక్‌కు చెందిన పాకిస్తాన్ అవామీ తెహ్రీక్ పార్టీ జెండాలో అవే రంగులుంటాయని, అవి ఆ జెండాలని కొందరు స్పందించారు. పాక్‌లో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆహార కొరత వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ గద్దె దిగాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆందోళనలను అణిచివేస్తోంది. -
యెమెన్ రక్తసిక్తం
దుబాయ్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ మరోసారి రక్తమోడింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా జరిగిన డ్రోన్ క్షిపణి దాడిలో 80 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు హుతి తిరుగుబాటుదారులే కారణమని అనుమానిస్తున్నారు. మరిబ్ ప్రావిన్సు సైనిక శిబిరంలోని మసీదులో శనివారం సైనికులంతా ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. ఘటనలో 83 మంది సైనికులు చనిపోగా 148 మంది గాయపడ్డారని ఆస్పత్రి వర్గాల సమాచారం. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, నిహ్మ్ ప్రాంతంలో జరిపిన సైనిక చర్యలో పెద్ద సంఖ్యలో హుతిలను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా హుతి తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకారం అందిస్తోంది. తాజా ఘటనపై హుతి తిరుగుబాటు నేతలు స్పందించలేదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కీలకమైన హొడైడా నౌకాశ్రయం చుట్టుపక్కల ప్రాంతం నుంచి వైదొలిగేందుకు ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత ఏడాది కాలంగా హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఒప్పందంలోని అంశాల అమలు నత్తనడకన సాగుతుండటంతో శాంతిస్థాపనపై నీలినీడలు అలుముకున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దేశంలో వేలాది మంది చనిపోగా లక్షలాదిగా జనం నిరాశ్రయులయ్యారు. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. -
లిబియాలో సంక్షోభం
ట్రిపోలి: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన లిబియాలో సాయుధ ఘర్షణ చెలరేగింది. లిబియా కమాండర్ ఖలీఫా హఫ్తార్‌కు చెందిన తిరుగుబాటు దళాలు రాజధాని ట్రిపోలివైపు బయలుదేరాయి. అంతర్జాతీయ సమాజం గుర్తింపుపొందిన జీఎన్ఏ ప్రభుత్వ దళాలు వారిని రాజధానికి 50 కి.మీ దూరంలో నిలువరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జీఎన్ఏ దళాలు హఫ్తార్ బలగాలపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. హఫ్తార్ దళాలు వెంటనే హింసను విడనాడి వెనక్కు వెళ్లాలని ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్స్, జర్మనీ సూచించాయి. 2011లో లిబియా పాలకుడు గడాఫీని అమెరికా హతమార్చడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. -
తాలిబన్ల చెరలో 58 మంది సైనికులు
హీరత్: అఫ్గానిస్తాన్ అంతర్యుద్ధంలో భద్రతా బలగాలపై తాలిబన్లదే పైచేయిగా మారుతోంది. అఫ్గాన్–తుర్కిమెనిస్థాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పోరులో తాలిబన్లు సుమారు 58 మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు. పదుల సంఖ్యలో సైనికులు భయంతో తుర్కిమెనిస్తాన్ భూభాగంలోకి పారిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బద్ఘిస్ ప్రావిన్స్‌లోని బలమార్ఘాబ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని రక్షణ శాఖ తెలిపింది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంది. సరిహద్దు ఆవలికి వెళ్లిన సైనికులు తిరిగి వచ్చి విధుల్లో చేరారని తెలిపింది. అయితే, 72 మంది సైనికులు తమకు చిక్కినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అంతర్యుద్ధాన్ని ముగించేందుకుగాను అమెరికా ఒక వైపు తాలిబన్లతో చర్చలు కొనసాగిస్తుండగానే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. -
సీబీఐ డ్రామా మోదీ వైఫల్యానికి సంకేతమే..
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. సీబీఐపై ప్రధాని మోదీకి పట్టు లేకపోవడంతోనే దర్యాప్తు ఏజెన్సీలో డ్రామాకు తెరలేచిందని ఆరోపించారు. అంతర్యుద్ధంతో వీధినపడ్డ సీబీఐని చక్కదిద్దేందుకు సుప్రీం కోర్టు చొరవ చూపిందని వ్యాఖ్యానించారు. రాఫెల్ ఒప్పందంపై విచారణకు అవరోధం కల్పించాలనే చౌకబారు రాజకీయ ప్రయోజనాలతో కేంద్రం సీబీఐలో చిచ్చుకు పూనుకుందని విమర్శించారు. సీబీఐలో కేంద్రం జోక్యం చివరకు దర్యాప్తు ఏజెన్సీలో ఏవగింపు కలిగించే పరిణామాలకు దారితీసిందని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో నలుగురు సుప్రీం న్యాయమూర్తులు సర్వోన్నత న్యాయస్ధానంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బాహాటంగా ముందుకొచ్చిన తరహాలోనే సీబీఐలో అంతర్యుద్ధం సైతం దేశ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.మరోవైపు రాఫెల్ ఒప్పందంతో మోదీ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రాఫెల్ డీల్‌పై విచారణకు విఘాతం కలిగించేందుకే సీబీఐలో విభేదాలను కేంద్రం ప్రోత్సహించిందని ఆరోపించారు. -
ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!
‘‘అక్కా... నేను, నా కుటుంబం సముద్రాన్ని దాటేశాం. ఇక నిన్ను చూడటమే తరువాయి’ అనే నా తమ్ముడి మాటల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ ఎన్ని రోజులైనా నిరీక్షణకు తెరపడటం లేదు. సరిగ్గా అదే సమయంలో ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఆ ఒక్క ఫొటో... నేనింక ఎవరికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. నా ఆశలన్నీ అడియాసలు చేస్తూ నన్ను వెక్కిరించింది. నీలం రంగు ప్యాంటు... ఎర్ర షర్టు... నేను వాడికి బహుమానంగా ఇచ్చిందే కదా ఆ డ్రెస్సు... అంటే ఆ ఫొటో వాడిదే... ముద్దులొలికే నా మేనల్లుడు అలన్ కుర్దీదే...’ అంటూ సిరియా ఆడపడుచు టిమ్ కుర్దీ ‘ద బాయ్ ఆన్ ద బీచ్’ అనే పుస్తకం పేరిట సిరియాలో జరుగుతున్న నరమేధం గురించి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా మూడేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. అటువంటి ఫొటోలు, మనసును కదిలించే ఎన్నెన్నో దృశ్యాలు ఆధిపత్య పోరును ఏమాత్రం ఆపలేకపోయాయి. పైపెచ్చు ఇటువంటివి అక్కడ సాధా‘రణమే’లే అని సరిపెట్టుకునే మానసిక స్థితికి మనల్ని తీసుకొచ్చాయి. ఈ భావన పెరిగిపోకూడదనే... ‘ద బాయ్ ఆన్ ద బీచ్’ పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చారు అలన్ కుర్దీ మేనత్త టిమ్ కుర్దీ. జీరో టాలరెన్స్ పేరిట అమెరికా అనుసరిస్తున్న విధానాలు శరణార్థుల పాలిట శాపంగా మారిన నేటి తరుణంలో.. తలదాచుకునేందుకు కాస్త చోటైనా దొరికితే చాలంటూ వలస వెళ్లే క్రమంలో... శరణార్థులు ఎదుర్కొనే ఇబ్బందులు, వాళ్లు పడుతున్న అగచాట్ల గురించి... టిమ్ రాసిన అక్షరాలు ప్రతీ ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తాయి. తప్పే కానీ తప్పలేదు... శరణార్థులకు కూడా జీవించే హక్కు ఉంటుందనే విషయాన్ని ప్రపంచం మర్చిపోకూడదనే తాను ఈ పుస్తకాన్ని రాశానన్న టిమ్... ‘పెళ్లి చేసుకుని కెనడా వచ్చాను. కానీ నా మనసు మాత్రం సిరియాలోనే ఉండిపోయింది. నా వాళ్లంతా అక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటే అన్నం కూడా సహించేది కాదు. ఈ కారణంగానే నా కెరీర్‌ను కూడా నిర్లక్ష్యం చేశాను. వాళ్ల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అని నిరంతరం ఆలోచించేదాన్ని. ఆ క్రమంలోనే నా తోబుట్టువులను శరణార్థులుగా కెనడాకు తీసుకు రావాలని భావించాను. అది సాధ్యపడుతుందని అనిపించలేదు. అందుకే సముద్ర ప్రయాణం ద్వారా వాళ్లంతా యూరప్ చేరుకునేందుకు 5 వేల డాలర్లు స్మగ్లర్లకు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. ఆ సమయంలో అదే సరైన మార్గంగా తోచింది. కానీ దయలేని దేవుడు.. అలన్, రేహానా, గలీబ్లను తన దగ్గరికి తీసుకువెళ్లాడంటూ’ తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం గురించి చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు అబ్దుల్లా(అలన్ కుర్దీ తండ్రి) బతికి ఉన్నా శవాలతో సమానమంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. రెండు భాషల్లో... తన ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయాలనే సంకల్పంతోనే ‘ద బాయ్ ఆన్ ద బీచ్’ పుస్తకంలోని ప్రతీ చాప్టర్‌ను అరబిక్‌తో పాటు ఇంగ్లీషు భాషలో కూడా అచ్చువేయించారు టిమ్ కుర్దీ. అరబిక్ భాషలోని సామెతలు, జాతీయాలు ఉపయోగిస్తూ మనసుకు హత్తుకునే విధంగా అక్షరాలను తీర్చిదిద్దారు. అలన్ ఙ్ఞాపకంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకమైనా.. కరుడుగట్టిన నేతల పాషాణ హృదయాల్ని కాస్తైనా కరిగించాలని నిండు మనసుతో ఆకాంక్షిద్దాం. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
సిరియాపై క్షిపణుల వర్షం
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న సిరియాలో బాంబులమోత మోగింది. మొన్నటి వరకూ రసాయనిక ఆయుధాలతో రష్యా, సిరియా అధ్యక్షుడు అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలు వందలాది అమాయకులు, చిన్నారుల్ని పొట్టనపెట్టుకుంటే ఈ సారి అమెరికా సంకీర్ణ బలగాలు వైమానిక దాడులకు దిగాయి. సిరియా రాజధాని డమాస్కస్‌పై సంకీర్ణ దళాలు క్షిపణుల మోత మోగించాయి. రసాయనిక దాడులకు ప్రతీకారంగా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. గట్టి జవాబిచ్చేందుకే: ట్రంప్ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు సంయుక్తంగా జరిపిన ఈ వైమానిక దాడుల్ని సిరియా బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. అమెరికా, దాని మిత్రదేశాలు 100కి పైగా క్షిపణుల్ని ప్రయోగించాయని, వాటిలో కొన్నింటిని సిరియా వైమానిక బలగాలు తిప్పికొట్టాయని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిరియా సైనిక కేంద్రాలు, సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేశారని వెల్లడించింది. ‘గురితప్పకుండా దాడులు చేశాం. మిషన్ పరిపూర్ణమైంది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. రసాయనిక ఆయుధాల తయారీ, వాడకంపై గట్టి సమాధానమిచ్చేందుకే ఈ దాడులు జరిపామన్నారు. ఫ్రాన్స్, బ్రిటన్‌తో కలిసి దాడులు చేస్తామని శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డమాస్కస్‌పై తొమహక్ క్షిపణుల వర్షం మధ్యధరా సముద్రం మీదుగా యుద్ధనౌకల నుంచి తొమహక్ క్రూయిజ్ క్షిపణులు, బీ–1 బాంబర్ విమానాలతో జేఏఎస్‌ఎస్‌ఎం–ఈఆర్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు పెంటగాన్(అమెరికా) వర్గాలు పేర్కొన్నాయి. పెంటగాన్ ప్రతినిధి స్పందిస్తూ.. ‘క్షిపణులు లక్ష్యాల్ని ఛేదించాయి. రసాయనిక ఆయుధాల తయారీ ప్రాంతాలపై దాడులు చేశాం’ అని చెప్పారు. తూర్పు డమాస్కస్‌లోని రసాయన ఆయుధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలపై ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ దాడులు సిరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడం లేదా అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నవేనని బ్రిటన్ ప్రధాని థెరెసా మే చెప్పారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. మరోసారి రసాయనిక ఆయుధాలు వాడితే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు. భద్రతా మండలి అత్యవసర భేటీ సంకీర్ణ బలగాల దాడిని సిరియా మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్‌లు సైనిక నేరంగా, దుందుడుకు చర్యగా అభివర్ణించాయి. ‘దాడులకు ప్రతీకారంగా పర్యవసనాలు తప్పకుండా ఉంటాయి.’ అని రష్యా హెచ్చరించింది. కాగా రష్యా విజ్ఞప్తి మేరకు ఐరాస భద్రతా మండలి శనివారం అత్యవసరంగా సమావేశమైంది. 13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం తమ శాస్త్ర పరిశోధన కేంద్రంపై దాడి చేశారని, సిరియా వైమానిక బలగాలు 13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాయని, ముగ్గురే గాయపడ్డారని సిరియా ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. దాడులు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమేనంది. క్షిపణుల మోత ఆగగానే డమాస్కస్ వీధుల్లో విజయ సంకేతాల్ని చూపుతూ జెండాలతో వందలాది మంది సందడి చేశారు. ఈ దాడులు పోరాటం కొనసాగించాలన్న సిరియా ప్రజల సంకల్పాన్ని దృఢం చేశాయని, దేశంలోని ఉగ్రవాదుల్ని అణచివేస్తామని సిరియా అధ్యక్షుడు అసద్ పేర్కొన్నారు. -
చంద్రబాబును కోర్టుకీడుస్తా..
నక్కపల్లి (పాయకరావుపేట): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా రుణమాఫీ చేయకుంటే న్యాయ పోరాటం చేస్తానని పాయకరావుపేటకు చెందిన రైతు చిట్టూరి గోపీమఠాల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం నక్కపల్లికి చెందిన ఒక బ్యాంకు వారు తనకు ఫోన్ చేసి వ్యవసాయ రుణం పూర్తిగా మాఫీ కాలేదని, తక్షణం బకాయి చెల్లించకుంటే భూములను వేలం వేస్తామని హెచ్చరించారని చెప్పారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పట్లో చంద్రబాబునాయుడు ప్రకటించడం వల్లే రుణబకాయిలు చెల్లించలేదన్నారు. తాను ఆ బ్యాంకులో రూ.50 వేలు రుణం తీసుకున్నానన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు విడుదల చేసిన రుణవాయిదాలు వడ్డీకి సరిపోయాయన్నారు. మూడో విడత రుణమాఫీ సొమ్ము ఇంకా జమ కాలేదన్నారు. అసలు అలాగే ఉండిపోయిందన్నారు. చంద్రబాబు హామీ వల్లే రైతులంతా అసలు, వడ్డీ చెల్లించడం మానేశారన్నారు. మాఫీ ఆశతో రైతులంతా చంద్రబాబుకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు మోసం చేసి చేతులెత్తేశారన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ కోర్టును ఆశ్రయిస్తానన్నారు. రుణమాఫీ చేయకపోవడం నమ్మక ద్రోహమేనని, దీనిని న్యాయస్థానంలో సవాల్ చేస్తానన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి మంత్రుల రాజీనా మాల తర్వాత బ్యాంకర్ల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోందన్నారు. -
ముళ్ల ఒడి తల్లడిల్లుతోంది
ఢిల్లీలో రోజుకు 29 ఫైట్లు జరుగుతుంటాయి. అవి రాష్ట్రాలవి. ఢిల్లీలోనే 8 ఏళ్లుగా ఓ ఫైట్ జరుగుతోంది. అది ఓ తల్లిది! ఢిల్లీ నుంచి తన పల్లెకు చేరాలని ఆమె ఆరాటం. వెళ్లొచ్చుగా.. ఏముంది ఢిల్లీలో? ఢిల్లీలో ఆమె ప్రాణం ఉంది. ఆ ప్రాణం.. ఎనిమిదేళ్ల ఆమె కూతురిలో ఉంది. ఆ కూతురు.. ‘ఇల్లీగల్ అడాప్షన్’లో ఉంది! బతుకు చీకటిని తప్పించుకోడానికి చీకటి బతుకులోకి జారిపడి.. ఒడిలోని కూతుర్ని చేజార్చుకున్న ఈ ‘రెడ్‌లైట్’ బాధితురాలు ఎదుగుతున్న ఆ కూతుర్ని దక్కించుకునేందుకు... న్యాయపోరాటం చేస్తోంది. పిల్ల లేనిదే ఢిల్లీ కదలనంటోంది. ఢిల్లీలోని రెడ్‌లైట్ ఏరియా. ‘నువ్వు నాకు నచ్చావ్! పెళ్లి చేసుకుంటా.. ఈ కూపంలోంచి బయటకు తీసుకెళ్తా!’ చెప్పాడు అతను. ‘హు..’ పేలవంగా నవ్వింది ఆమె. ‘నిజం.. ఒట్టు ... నన్ను నమ్ము’ ఆమె తల మీద చెయ్యేసి చెప్పాడు నమ్మకంగా! ‘ఆడవాళ్లనే నమ్మలేను నీ మాటెలా నమ్మాలి’.. తల మీదనుంచి చేయి తీసేస్తూ అన్నది ఆమె నిర్లిప్తంగా. ‘కానీ నన్ను నమ్ము’ నమ్మించే ప్రయత్నం చేస్తూ అతను. ‘నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే బ్రోతల్ హౌజ్ వాళ్లకు డబ్బు కట్టాలి.. పైగా నన్ను నీ భార్యగా మీ ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటారా?’ అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఆమె. ‘వాళ్లు అడిగినంత డబ్బు కట్టే నిన్ను విడిపించుకు వెళ్తా.. ఇక మా ఇంట్లోవాళ్ల సంగతి అంటావా... ఇది నా పెళ్లి.. నా ఇష్టం’ అని సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె పేరు సారిక.. అతని పేరు రాకేశ్! (గోప్యత దృష్ట్యా ఇద్దరి పేర్లూ మార్చాం) ఆమెది ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం. అందరి అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని హాయిగా సంసారం చేయాలని కలలు కన్నది. అనుకున్నట్టే చక్కటి భర్త దొరికాడు. యేడాది తిరక్కుండానే పండంటి బిడ్డ పుట్టింది. ఏ చింతా లేకుండా సాగిపోతున్న కాపురం ఒక్కసారిగా కల్లోలంలో పడింది. సారిక ఎనిమిదినెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్తకు పాము కాటుకు చనిపోయాడు. అత్తింట, పుట్టింట ఆదరణ లేక.. అనాథయింది సారిక. చేతిలో బిడ్డతో ఆ నిండుచూలాలికి దిక్కు తోచలేదు. దమ్మిడీ ఆదాయం లేక ఆ పిల్లనెలా సాకేది? ఇంకో బిడ్డనెలా కనేది? అప్పుడు వచ్చింది పక్కింటామె. పొట్టకూటికోసం ఢిల్లీ వెళ్లి చుట్టపుచూపుగా సొంతూరుకి వచ్చిపోతూ ఉంటుంది. సారిక గురించి తెలిసి పరామర్శించడానికి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టింది. ఆప్యాయంగా పలకరించింది. ఆ కాసింత ప్రేమకే కదిలిపోయింది సారిక. ఆమె ఒళ్లో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్చింది. ‘పిచ్చిదానా...ఎందుకలా బాధపడ్తావ్? నేను లేనా?’ అని ఓదార్చింది. తనతోపాటు ఢిల్లీ వస్తే అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చింది. ఆశపడ్డ సారిక అంతలోనే అనుమానంతో పొట్ట మీద చేయి వేసుకుంది అనుమానంగా. సారిక ఆంతర్యం గ్రహించిన ఆమె ‘అక్కడ మంచి ఆసుపత్రిలో క్షేమంగా డెలివరీ చేయించే బాధ్యత నాది’ అంది సారిక చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ! గుండె నిండా ఊపిరిపీల్చుకుంది సారిక. కూతురు పుట్టిన నెలకు.. అలా పక్కింటామె భరోసా మీద నాలుగేళ్ల బిడ్డతో ఢిల్లీలో ఏపీ ఎక్స్‌ప్రెస్ దిగింది సారిక. పక్కింటామె ఇంట్లోనే బసచేసింది. ఇదిగో రేపే ఓ బట్టల దుకాణంలో సేల్స్ ఉమన్‌గా ఉద్యోగంలో పెట్టించబోతున్నా. అయిదువేల రూపాయల జీతం’ అని చెప్పింది. ఏరోజుకారోజే రేపు అంటూ పదిహేనురోజులు దాటవేసింది. ‘తర్వాత డెలివరీ కానివ్వు..’ అంది. ఆ మాట అన్న పదిహేను రోజులకి సారికకు పురుడొచ్చింది. కూతురు పుట్టింది. నెలయ్యాక నెమ్మదిగా తన అసలు రంగు బయటపెట్టింది పక్కింటామె. ‘నీకు ఏ బట్టల షాపులో ఉద్యోగం లేదు. నేను చెప్పిన చోట పనిచేయాలి. నెలకు అయిదు వేలు నాకే ఇవ్వాలి ఎందుకంటే నీ పిల్లల్లిదర్నీ నేను చేసుకోవాలి కాబట్టి’ అంటూ ఆమెను తీసుకెళ్లి ఓ బ్రోతల్హౌజ్లో పెట్టింది. సారిక పెద్ద కూతురిని గుర్గావ్లో ఉన్న ఓ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది. రెండో కూతురిని సారిక తన ఇష్టం మీదే దత్తత ఇస్తున్నట్టు దత్తత కాగితాల మీద బలవంతంగా సంతకాలు చేయించుకుంది. అలా సారిక బలవంతంగా వ్యభిచార కూపంలోకి వచ్చిపడింది. వారానికి ఒకసారి గుర్గావ్ వెళ్లి పెద్దకూతురిని చూసొస్తూ ఉండేది సారిక. కానీ ఢిల్లీలోని జీబీ రోడ్లో ఉన్న చిన్న కూతురి దగ్గరకే మొదట్లో రానిచ్చినా తర్వాత ఆ పిల్లను చూడనివ్వడం మానేశారు. సారిక బలవంతంగా వస్తే.. తమ మాట వినకపోతే పిల్లలిద్దర్నీ కూడా వ్యభిచారంలోకి దింపుతామని బెదిరించేవారు. ఆ భయానికి చిన్న కూతురు దగ్గరకి వెళ్లడమే మానేసింది. ఆ సమయంలోనే పరిచయమయ్యాడు రాకేశ్. ముందు విటుడుగా.. తర్వాత ప్రేమికుడిగా! అనుకున్నట్టే పెళ్లైంది రాకేశ్ తాను సారికకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఉంటున్న బ్రోతల్హౌజ్ యజమానికి లక్షరూపాయలు చెల్లించి సారికను విడిపించాడు. పెళ్లీ చేసుకున్నాడు. అప్పుడు చెప్పింది తన లక్ష్యాల గురించి రాకేశ్‌కి. అండగా ఉంటానని మాటిచ్చాడు. రాకేశ్ సహాయంతో పెద్ద కూతురిని తేలికగానే విడిపించుకుంది. తన బిడ్డ ఇక్కడుంటే ప్రమాదమని భావించి తీసుకెళ్లి తన సొంతూర్లో తమ్ముడు, మరదలి దగ్గర పెట్టింది. కూతురి అవసరాలకోసం నెలనెలకు తమ్ముడికి డబ్బులు పంపించి కూతురిని చదివించుకుంటోంది. రెండో బిడ్డ కోసం... ఢిల్లీలోని తానుంటున్న రెడ్‌లైట్ ఏరియా వదలాలనుకోలేదు సారిక. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి తాను దూరంగా వెళ్లిపోతే తనను ఈ నరకంలోకి నెట్టిన వాళ్ల కదలికలు తెలుసుకోలేదు. దాంతో రెండో బిడ్డ జాడా తెలియదు. అందుకే మొండిగా అదే ప్రాంతంలో ఇంకో బ్రోతల్ హౌజ్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. రాకేశ్‌తో ఇంకో కూతురూ పుట్టింది. ఓ వైపు ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే తన రెండో బిడ్డ జాడ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బిడ్డ ఆచూకీ కోసం కంప్లయింట్ ఇచ్చింది. తనను వ్యభిచారిగా మార్చిన స్త్రీ వచ్చింది. ‘ఆమె బిడ్డను ఆమెనే ఇష్టపూర్వకంగా దత్తతకు ఇచ్చింది’ అంటూ సారిక సంతకం చేసిన పత్రాలను పోలీసులకు చూపించింది. ‘ఈ సంతకం నీదేనా?’ అని అడిగారు పోలీస్ అధికారులు. పరీక్షగా చూసింది. అవును తనదే! కానీ బెదిరించి, భయపెట్టి పెట్టించిన సంతకం అది. ఆ విషయాన్నే పోలీసులకు మొరపెట్టుకుంది. ‘నువ్వు మైనర్‌వి, తెలియనిదానివి కాదు కదా.. భయపెట్టి సంతకం పెట్టించుకోవడానికి. నీ సంతకం ఉంది కాబట్టి ఏం చేయలేం’ అంటూ పెదవి విరిచారు. అవమానం, దుఃఖం, కోపం, నిస్సహాయత, తనమీద తనకే పుట్టిన జాలితో వెనుదిరిగింది సారిక. ఇంటికి వచ్చి గుండెపగిలేలా ఏడ్చింది. భార్య బాధ రాకేశ్ గుండెను పిండేసింది. సారిక న్యాయ పోరాటం బంధించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి కాగితాల మీద సంతకాలు చేయించడం నేరం. అలాంటివి చెల్లవు కూడా. దీనికే కాదు సారికను బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్లను ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ నేరాల కింద అరెస్ట్ చేయాలి. సారికది న్యాయ పోరాటం. ఆమె పోరాటానికి శక్తివాహిని మద్దతు ఎప్పటికీ ఉంటుంది. - రవికాంత్, శక్తివాహిని ప్రధానకార్యకర్త శక్తివాహిని సహాయంతో.. స్థానికంగా పనిచేస్తున్న శక్తివాహిని అనే ఎన్జీవోకు వెళ్లాడు రాకేశ్. ఆ సంస్థ అధికారి రవికాంత్‌ను కలిశాడు. సారిక పరిస్థితిని వివరించాడు. ఆమె కథ విన్ని రవికాంత్ ఆమె రెండో కూతురును విడిపించడంలో తనకు సహాయపడ్తామని మాటిచ్చాడు. ఆ మరుసటిరోజే సారికను తీసుకెళ్లి రవికాంత్‌కు పరిచయం చేశాడు రాకేశ్. శక్తివాహిని ఆమెకు ధైర్యమిచ్చింది. బిడ్డ కోసం ఢిల్లీ కోర్ట్‌లో పిటీషన్ వేయించింది. ఇప్పుడు ఆ పోరాటంలోనే ఉంది సారిక. ‘భర్త చనిపోయిన నా నిస్సహాయస్థితిని ఆసరాగా తీసుకొని నన్ను నమ్మించి ఢిల్లీ తీసుకొచ్చి.. ఈ కోపంలోకి నెట్టింది. నా రెండోబిడ్డనూ నెట్టాలని చూస్తోంది. అసలు హిందీరాని కొత్తలో నా చేత ఏవో హిందీపేపర్ల మీద సంతకం చేయించి ఇప్పుడు అవే దత్తత కాగితాలని, వాటి మీద నేను ఇష్టపూర్వకంగా సంతకం చేశానని చూపిస్తోంది. నా ఇద్దరు బిడ్డలనూ వ్యభిచారంలోకి నెడ్తామని బెదిరించి నా చేత బలవంతంగా సంతకాలు చేయించారు. ఈ పాపాలకు వాళ్లకు శిక్షపడేలా చేయందే నిద్రపోను. ఎన్నేళ్లయినా సరే పోరాడుతాను. నా బిడ్డను తెచ్చుకుంటాను. నెల పసిగుడ్డప్పుడు నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు దానికి ఎనిమిదేళ్లు. కోర్టు వాయిదాలకు వాళ్లతో కలిసి వస్తోంది. అసలు నన్ను గుర్తే పట్టడం లేదు. నేను నీ అమ్మను తల్లీ.. అని ఏడుస్తున్నా పిచ్చిదాన్ని.. పరాయిదాన్ని చూస్తున్నట్టు చూస్తోంది. అన్నిటికన్నా ఈ బాధను తట్టుకోలేకపోతున్నా..!’అంటోంది సారిక ఉబికొస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున్న ఆపుకుంటూ! ‘మా రెండో బిడ్డను తెచ్చుకోవడానికి మా ప్రాణాలను సైతం లెక్కచేయం. ఎంతదాకైనా పోరాడాతాం’ అంటున్నాడు రాకేశ్. -
పైన బాంబులు.. అండర్ గ్రౌండ్లో పాఠాలు
డెమాస్కస్: అది సిరియాలోని దారాయా అనే పట్టణం. నిత్యం బాంబు దాడులతో భయం కోరల్లో చిక్కుకున్న ప్రజలు. ఇప్పుడు అక్కడ పెద్దలు బతుకుదెరువుకోసం పాకులాడుతుండగా.. వారి బిడ్డలు మాత్రం తమ బతుకులు ఎందుకు ఇలా తయారయ్యాయని ఒక పెద్ద ప్రశ్నను మోస్తున్నారు. ప్రపంచం మొత్తానికి తమ వాస్తవ స్థితిగతులను తెలుసుకోవాలని నిర్ణయించుకొని దారాయా నగరంలోని చిన్నారులంతా ఆంగ్లం నేర్చుకునే పనిలో పడ్డారు. ప్రపంచం మొత్తానికి తెలిసిన భాష ఆంగ్లం కావడంతో ఆంగ్లాన్ని నేర్చుకునేందుకు కుస్తీపట్టడమే కాకుండా నేర్చుకున్న భాషతో తమ కష్టాలను వెల్లడిస్తున్నారు. వారి చేస్తున్న సాహసానికి ఓ సంస్థ కూడా తోడై ఒక డాక్యుమెంటరీగా ఓ వీడియోను కూడా రూపొందించింది. అందులో భాగంగా కొంతమంది పిల్లలు చెప్పిన అభిప్రాయాలు విడుదల చేసింది. అందులో ఉన్న అంశాలు ఏమిటంటే.. 'మేం ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ప్రాంతంలో మూడున్నరేళ్లుగా జీవిస్తున్నాం. పటణంలో జీవించినట్లుగానే అనిపిస్తుంది. కానీ, ఏదో ఒక సమయంలో తమకు నచ్చినవారినో.. నచ్చిన వస్తువునో కోల్పోతున్నాం. మా సమయం మొత్తం బాంబులు, విమాన దాడుల నుంచి తప్పించుకునేందుకు దాచుకోవడానికి సరిపోతుంది. ఎప్పుడు ఏ భవనంపై బాంబు పడుతుందో తెలియడం లేదు. అసలు మా దగ్గర సివిల్ వార్ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మాకు పాఠాలు చెప్పే స్కూళ్లను అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. అంటే మేమెంతో అపాయకరమైన స్థితిలో విద్యను అభ్యసిస్తున్నాం. మేం ఇప్పటికీ ఇంగ్లిష్ మాట్లాడలేకపోతున్నాం. కానీ మా టీచర్ సాయం చేస్తున్నారు' అని జహారా, హదాయా అనే పేర్లుగల తదితర పిల్లలు తమ వాస్తవ పరిస్థితులు వెల్లడించారు. -
స్వేచ్ఛ కోసం.. అమెరికా అంతర్యుద్ధం!
ప్రపంచదేశాల్లో అగ్రరాజ్యం ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం అమెరికా. అలాంటి దేశ చరిత్రలో కీలక పరిణామం 1861- 65 అంతర్యుద్ధం. అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధంతోనే అమెరికాలో బానిసత్వం పూర్తిగా అంతరించిపోయింది. ప్రతి మనిషికీ స్వేచ్ఛ ఉండాలనేదే ఈ యుద్ధ లక్ష్యం. ఈ పోరాటం జరగకపోతే అమెరికాలో బానిసత్వం ఇప్పటికీ అంతమయ్యేది కాదేమో..! అంతటి చారిత్రక నేపథ్యం, ప్రయోజనం ఉన్న యుద్ధం, దాని కథాకమామిషు ఏంటో చూద్దాం..! అమెరికాలో బానిసత్వం 1619లో మొదలైంది. అప్పుడు అమెరికా బ్రిటన్ పరిపాలనలో ఉండేది. ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిన బానిసల్ని పొగాకు పండించడానికి ఉపయోగించేవారు. 1860 నాటికి వీరి సంఖ్య 40 లక్షలకు చేరింది. అమెరికా దక్షిణ భాగంలోని జనాభాలో మూడో వంతు బానిసలే ఉండేవారు. దయనీయ పరిస్థితులు... బానిసలందర్నీ ఇరుకు గదుల్లో బంధించేవారు. వారికి సరైన ఆహారం, వసతులు కల్పించేవారు కాదు. ఒక్కో యజమాని దగ్గరా 50 మంది బానిసలు ఉండేవారు. బానిసలు చదువుకోవడంపై నిషేధం ఉండేది. బానిస స్త్రీలపై యజమానులు లైంగిక దాడులు చేసేవారు. ఎదురు తిరిగిన వారికి కఠినమైన శిక్షలుండేవి. బానిస వివాహాలకు చట్టబద్ధత లేదు. ఎక్కువ మంది పిల్లల్ని కనేలా వారిపై ఒత్తిడి తెచ్చేవారు. ఎంత ఎక్కువ మందిని కంటే యజమానికి అంత ఎక్కువ లాభం. ఇదీ నేపథ్యం... బానిసత్వాన్ని రద్దు చేయాలని 1830 నుంచే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1850 మెక్సికో ఒప్పందంలో బానిసల అంశాన్ని విస్మరించాక ఈ ఉద్యమం మరింత వేడెక్కింది. 1857లో అమెరికా సుప్రీం కోర్టు ఆఫ్రో-అమెరికన్లు అమెరికా దేశ పౌరులు కారని వివాదాస్పద తీర్పునిచ్చింది. 1859లో జాన్ బ్రౌన్ అనే ఉద్యమకారుడు వర్జీనియాలోని హార్పర్ రేవుపై దాడి చేయడంతో అతనికి మరణ శిక్ష విధించారు. ఉద్యమకారులు అతడ్ని జాతి కోసం మరణించిన వీరుడిగా గుర్తిస్తే, దక్షిణ ప్రాంతంవారు అతడిపై కిరాయి హంతకుడిగా ముద్ర వేశారు. రక్త చరిత్ర... 1861 అధ్యక్ష ఎన్నికలు పూర్తి కాగానే బానిసలు అధికంగా ఉన్న ఏడు దక్షిణ రాష్ట్రాలు సమాఖ్యగా ఏర్పడి తమని తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాయి. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న జేమ్స్ బుకానన్ దీన్ని చట్ట వ్యతిరేక చర్యగా ప్రకటించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అదే ఏడాది మార్చి 4న అబ్రహాంలింకన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ఈ చర్యని తిరుగుబాటుగా పరిగణించాడు. 75 వేల మంది సైనికులను 90 రోజుల పాటు తాత్కాలికంగా నియమించాలని ఆదేశాలు జారీ చేశాడు. మూడు నెలల్లో అంతర్యుద్ధాన్ని అణచివేయగలనని ఆయన భావించారు. ఇంతలో మరో నాలుగు రాష్ట్రాలు సమాఖ్యలో చేరాయి. పశ్చిమ తీరంలో జరిగిన యుద్ధంలో గెలుపొందటం అమెరికాకు పెద్ద ఊరట. కానీ తూర్పు వైపు వర్జీనియాలో జరిగిన యుద్ధంలో మాత్రం ఓడిపోయింది. సైన్యాన్ని మోహరించినప్పటికీ యుద్ధవ్యూహాల అమలులో వైఫల్యంపై లింకన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తూర్పు వైపు దాడుల్లో 23 వేల మంది సైనికులను అమెరికా కోల్పోయింది. 1862 జులై ఒకటిన 17 లక్షల మంది సైనికులు, తిరుగుబాటుదారుల మధ్య నాలుగు రోజుల తీవ్ర యుద్ధం అనంతరం వర్జీనియా అమెరికా సొంతమైంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 1865లో ముగిసింది. ఈ యుద్ధంలో ఇరుపక్షాల నుంచి దాదాపు 6,20,000 మంది మరణించారు. నాలుగు లక్షల మంది పైగా గాయపడ్డారు. యుద్ధ సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటాయి. కొత్త చరిత్ర... అమెరికా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తీర్మానం 1865, జనవరి 31న వెలువడింది. అమెరికా పరిధిలో బానిసత్వాన్ని రద్దు చేస్తూ 13వ రాజ్యాంగ సవరణను లింకన్ అధ్యక్షతలోని ప్రభుత్వం ఆమోదించింది. అంతకు ముందు 1864లో జరిగిన ఎన్నికల్లో లింకన్ ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు. 1868లో జరిగిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో పుట్టిన వారందరికీ సమాన హక్కులుంటాయని ప్రభుత్వం తీర్మానించింది. అలా శ్వేతజాతీయేతరులపై ఏర్పడిన ఆంక్షలు క్రమంగా తొలగిపోయాయి. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవి చేపట్టిన తొలి శ్వేతజాతీయేతరుడిగా చరిత్ర సృష్టించారు. -
సిరియా అంతర్యుద్ధంలో 4.7 లక్షల మంది మృతి
సిరియాలో అంతర్యుద్ధం కారణంగా గత ఐదేళ్లలో 4.7 లక్షల మంది మరణించారు. 4 లక్షల మంది సిరియన్లు దాడుల్లో చనిపోగా, మరో 70 వేల మంది స్వచ్ఛమైన తాగునీరు, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినట్టు గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఆ దేశ జనాభాలో 11 శాతం మందికిపైగా గాయపడినట్టు పేర్కొంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా సారథ్యంలోని సేనలు ప్రయత్నించడంతో పాటు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నాయి. కాగా రష్యా, ఇరాన్‌లు అసద్‌కు మద్దతుగా నిలిచాయి. అసద్‌ను వ్యతిరేకులను వ్యతిరేకిస్తున్నాయి. సిరియా బలగాలకు మద్దతుగా రష్యా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్యులు కూడా మృత్యువాత పడుతున్నారు. కాగా సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాలు అసద్‌కు మద్దతు ఇస్తున్నాయి. సైనిక దళాలు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న దాడుల వల్ల సిరియా తీవ్రంగా నష్టపోతోంది. లక్షలాదిమంది మరణించడంతో పాటు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లుతోంది. ఇక దాడుల్లో 19 లక్షల మంది గాయపడ్డారు. సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. -
న్యాయ పోరాటానికి సమాయత్తం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని జరీబు భూముల రైతులు మూకుమ్మడి న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో హైకోర్టులో పిటిషన్లు వేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి నిర్బంధంగా భూములు సేకరించారని వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని వాటిపై నిర్ణయాన్ని రెండు వారాల్లో వివరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టులో వివరించిన విషయం విధితమే. సీఆర్డీఏ నిబంధనలకు లోబడి భూ సమీకరణ చేశామని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో చేసిన వాదనలో వాస్తవం లేదని జరీబు రైతులంతా మూకుమ్మడిగా పిటిషన్లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నియోజకవర్గానికి చేరుకుని గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాజధాని గ్రామాల రైతుల న్యాయ పోరాటానికి ఆర్కే సహకరిస్తున్నారు. ఆందోళన చెందుతున్న రైతులకు ధైర్యం చెబుతూ సీఆర్డీఏ చట్టంపై అవగాహన కలిగిస్తున్నారు. అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతుల భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి రైతులు ఐక్యంగా న్యాయపోరాటానికి సిద్ధమైతే అందుకు పార్టీ పరంగా సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు. గ్రామాల వారీగా కలుస్తున్న రైతులను గ్రూపులుగా చేసి వారితో కోర్టులో పిటిషన్లు వేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఎక్కడా లోపాలు లేకుండా ఉండేందుకు భూ సమీకరణను మొదటి నుంచి తాము వ్యతిరేకించామని, అధికారులు, పాలకుల దందా వలనే తాము అంగీకారపత్రాలు ఇచ్చామంటూ రైతులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు రిజిస్టర్డ్ లేఖ పంపే ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది రైతులు సోమ, మంగళవారాల్లో పటిషన్లు వేయనున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం.. శనివారం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఆర్కే రైతులతో సమావేశం అయ్యారు. 9.2 ఫారాలతో పాటు 9.3 ఫారాలు ఇచ్చిన రైతులంతా కేవలం భయపడి మాత్రమే భూములు ఇచ్చారని వారందరికి న్యాయం జరిగేవరకు పోరాడతానన్నారు. తొలివిడత కోర్టును ఆశ్రయించిన 32 మంది రైతుల విషయంలో స్పష్టమైందన్నారు. మిగిలిన వారంతా కోర్టులో పిటిషన్ వేస్తే తొలి విడత కోర్టులో పిటిషన్ వేసిన రైతులకు వర్తించే న్యాయమే జరుగుతుందన్నారు. ఆదివారం బేతపూడి, నవులూరు, పెనుమాక, యర్రుపాలెం, ఉండవల్లి గ్రామాల్లో ఆర్కే పర్యటించనున్నారు. సోమవారం వరకు గ్రామాల్లో పర్యటించి న్యాయపరమైన పోరాటానికి రైతులను సిద్ధం చేస్తామని, మంగళవారం వారందరితో పిటిషన్లు వేయిస్తానని ఆర్కే సాక్షి ప్రతినిధికి వివరించారు. -
అంతర్యుద్ధం అంచున ఉక్రెయిన్
ఉక్రెయిన్ తాజా సంక్షోభానికి సూత్రధారి పుతిన్ కారు. కాగల కార్యం ‘గంధర్వులే’ చేస్తుండగా తన చేతులకు నెత్తురు పులుముకునే మూర్ఖుడు కాడాయన. అమెరికా నిలిపిన జాతీయోన్మాద ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రష్యన్లలో భద్రతారాహిత్యాన్ని సృష్టించింది. అవాస్తవిక అంచనాలు ఓటమికి సోపానాలు. అమెరికా మాజీ అధ్యక్షునిగా మారాక గానీ బరాక్ ఒబామాకు ఈ విషయం వంటబట్టక పోవచ్చు. ఆయన నడిపిన ఉక్రెయిన్ ‘విప్లవం’ అంతర్యుద్ధంగా మారుతూ నెత్తురోడటం ప్రారంభించింది. గత వారం రోజులుగా తూర్పున ఉన్న డొనెత్స్క్, ఖార్కివ్, లుహాన్స్కీ రాష్ట్రాల్లో రష్యా అనుకూల ఆందోళనకారులు స్వయం ప్రతిపత్తిని కోరుతూ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని ఆందోళన సాగిస్తున్నారు. ఆందోళనకారుల డిమాండ్లపై ఒక వంక చర్చలు జరుపుతూనే హఠాత్తుగా ‘విప్లవ’ ప్రభుత్వం తూర్పు రాష్ట్రాల్లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైనిక చర్యను ప్రకటించింది. మూడు రోజులు తూర్పు ఉక్రెయిన్‌పై జెట్ విమానాల రొద, వీధుల్లో యుద్ధ ట్యాంకుల కవాతులు సాగుతున్నాయి. సోమవారం నలుగురు రష్యా అనుకూల మిలీషియా సభ్యులను చంపి, క్రమటోర్స్క్ విమానా శ్రయాన్ని ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నాటకీయంగా బుధవారం ఉగ్రవాద వ్యతిరేక పోరు సేనల్లో తిరుగుబాటు ముసలం పుట్టింది. కనీసం క్రమటోర్స్క్, స్లోవియాన్స్క్ పట్టణాల్లో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులకు రష్యా జెండాలను కట్టి రష్యా అనుకూల వర్గానికి ఫిరాయించిన సైనికులు కవాతులు జరపడం కనిపించింది. దీంతో సైనిక చర్య పూర్తి స్థాయి అంతర్యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఈ చిచ్చును రాజేశారని, దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారని అమెరికా, అది ఉక్రెయిన్‌లో నిలిపిన అలెగ్జాండర్ తుర్చియనేవ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నాయి. పుతిన్ అంత పని చేయలేరని ఎవరూ అనరు. అంత పని చేసినా ‘విప్లవ’ ప్రభుత్వం కాదు కదా, అమెరికా దాని మిత్రులు కూడా ఏమీ చేయలేరని కూడా అందరికీ తెలుసు. అవసరమైతే అమెరికాతో యుద్ధానికి సిద్ధమేనని క్రిమియాలోనే పుతిన్ రుజువు చేశాడు. కానీ ఉక్రెయిన్ తాజా సంక్షోభానికి సూత్రధారి పుతిన్ కారు. కాగల కార్యం ‘గంధర్వులే’ చేస్తుండగా తన చేతులకు నెత్తురు పులుముకునే మూర్ఖుడు కాడాయన. క్రిమియాకు తూర్పు ఉక్రెయిన్‌కు పోలికే లేదు. సాంప్రదాయకంగా రష్యాతో అనుబంధం కలిగిన తూర్పు, దక్షిణ రాష్ట్రాల ప్రజలు ఈయూలో చేరడానికి వ్యతిరేకం. రష్యా నేతృత్వంలోని ఉమ్మడి కస్టమ్స్ యూనియన్‌లో చేరడం ద్వారా లబ్ధి పొందగలమని భావించే బాపతు. వారంతా ఈయూకు వ్యతిరేకంగా ఓటు చేసిన వారే. నేడు తిరుగుబాట పట్టిన ఆందోళనకారులు స్వాతంత్య్రాన్ని కోరడం లేదు. రష్యాలో భాగం కావాలనుకోవడం లేదు. స్వయం ప్రతిపత్తిని కోరుతున్నారు. ఆ డిమాండుగానీ, ఆందోళన గానీ పుట్టడానికి కారణం ‘విప్లవ’ ప్రభుత్వమే. జనాభాలో 60 శాతానికిపైగా మాట్లాడే రష్యన్ భాష గుర్తింపును తొలగించి, ఉక్రెయినీని ఏకైక అధికార భాషగా ప్రకటించారు. యానుకోవిచ్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన మైదాన్ సాయుధ నియో నాజీ ముఠాలు రష్యన్లను తుడిచి పెట్టాలని బహిరంగంగానే పిలుపునిస్తున్నాయి. మే 27న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ ప్రధాని ట్యామషెంకో సైతం రష్యన్లను తుడిచిపెట్టేయమని పిలుపునిస్తూ జరిపిన టెలిపోన్ సంభాషణ రచ్చకెక్కింది. తుర్చియనేవ్ ఆమెకు నమ్మిన బంటు. అమెరికా నిలిపిన జాతీయోన్మాద ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రష్యన్లలో భద్రతారాహిత్యాన్ని సృష్టించింది. ఆ యాదృచ్ఛిక స్వభావమే తూర్పు ప్రాంతంలోని తిరుగుబాటు తత్వంలో కనిపిస్తోంది. ఓడిపోయే కొద్దీ ఒడ్డే జూదగాడిలా అమెరికా ఈ రష్యా అనుకూల ఆందోళనల్లో ఓటమిని గెలుపుగా మార్చుకునే అవకాశాన్ని చూసినట్టుంది. సీఐఏ అధిపతి జాన్ బర్నార్ హడావిడిగా శనివారం కీవ్‌కు వెళ్లారు ఆయన ఎందుకు వెళ్లారో, ఎవరితో చర్చలు జరిపారో చెప్పడం లేదు. కానీ హఠాత్తుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పుట్టుకొచ్చింది. నిజానికి ఇదంతా పుతిన్‌కు చికాకు కలిగిస్తూ ఉండి ఉండాలి. తమకు బకాయి పడ్డ 16,000 కోట్ల డాలర్ల రుణం కక్కమని ఉక్రెయిన్‌కు తాఖీదు ఇచ్చారు. సహజ వాయువుపై సబ్సిడీని ఉపసంహరించారు. దీంతో ఉక్కిరిబిక్కిరై అదే కాళ్ల బేరానికి వస్తుందని ఎదురు చూస్తున్నారు. జార్జియాలో లాగా స్వయం నిర్ణయాధికార పోరాటాలు పుట్టుకొచ్చేలా చేయడానికి దీర్ఘకాలిక పథకాలు సిద్ధం చేసుకున్నారు. సీఐఏ బరాక్ ఒబామాతో మరో తీవ్రమైన తప్పు చేయించింది. దానికి మూల్యం ఉక్రెయిన్ చెల్లించుకోవాల్సి ఉంది. పి. గౌతమ్ -
సంపదే ఆ దేశానికి శాపం
ఆఫ్రికా ఖండంలో ఎప్పడు ఏం జరిగినా అది దానికి కీడుగానే పరిణమించాలని ‘రాసిపెట్టి’ ఉంది. అందుకే దక్షిణ సూడాన్ నేడు నెత్తురోడుతుంది. కాబట్టే ఆఫ్రికాలోనే అతి సుదీర్ఘమైన యాభయ్యేళ్ల అంతర్యుద్ధం తదుపరి 2011లో ఆవిర్భవించిన దక్షిణ సూడాన్ ముచ్చటగా మూడేళ్లయినా కాకముందే అంతర్యుద్ధం అంచులకు చేరింది. పుట్టిన నాడే అది తన ‘కాళ్ల మీద లేచి నిలబడలేని దేశం. కాలు కదిపి అడుగు వేయలేని దేశం’ అని విజ్ఞులు అన్నారు. అరైవె కి పైగా జాతుల తెగలతో కూడిన ప్రజలు ఉత్తర సూడాన్ పాలకుల వివక్షకు, అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా ‘సూడాన్ ప్రజా విముక్తి ఉద్యమం’ (ఎస్పీఎల్ఎమ్)గా ఐక్యమయ్యారు. వారిని ఒక జాతిగా ఐక్యం చేయాల్సిన దేశాధ్యక్షుడు సల్వా కిర్ ఆ బాధ్యతను స్వీకరించలేదు. న్యూర్ తెగకు చెందిన మచార్ అనుకూల సైనికాధికారులు ఆయనతో చేయి కలిపారు. డింకా తెగకు చెందిన సల్వా కీర్‌ను గద్దె దించేవరకు పోరాటం సాగుతుందని మచార్ సైతం హెచ్చరించారు. అమెరికా వంటి సంపన్న దేశాలు అక్కడి చమురు కోసం అంతర్యుద్ధంలో... పశువులనే అమూల్య సంపదగా ఎంచి బతికే పశుపాలక తెగల చేతులకు అత్యాధునిక మారణాయుధాలను అందించారే గానీ దక్షిణ సూడాన్ మనుగడకు, ప్రజాస్వామ్యానికి పూచీ పడలేదు. అందుకే ఇంచుమించు కోటి జనాభాలో 90 శాతంగా ఉండే డింకా, న్యూర్ తెగల వారు ఒకరి నొకరు తెగ నరక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈ మారణ హోమంలో సమిధలవుతున్న అమాయక పౌరులను శరణార్థి శిబిరాలకు తర లించే కృషిలో సైతం ప్రపంచ పెద్దల పత్తా లేదు. ఇరాక్, అఫ్ఘాన్ల వంటి యుద్ధాలకు లక్షల సైన్యాన్ని తరలించిన శక్తివంతులు తమ పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిం చడంలో తలమునకలవుతున్నారు. ప్రాణాలు తీయడమే ఎరిగిన వారికి ప్రాణాలర్పించైనా ప్రాణాలను నిలపడం తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి ‘అల్పమైన’ బాధ్యతలను నెరవేర్చడానికి మనలాంటి బడుగు దేశాల సైనికులున్నారు. ఇద్దరు జవాన్లను పోగొట్టుకున్న భారత శాంతి దళాలు తెగువ చూపకపోతే కొన్ని వేల నిండు ప్రాణాలు బలై పోయేవని ఐరాస పేర్కొంది. ఇంతవరకు కనీసం వెయ్యి మంది పౌరులు ఈ మారణకాండలో హతమై ఉంటారని, అంతర్గత నిర్వాసితుల సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అది భావిస్తోంది. సల్వాకిర్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షునిగా ఉన్న ఈయక్ మచార్ సైనిక కుట్రకు పాల్పడటంతో డిసెంబర్ 15 నుంచి దేశ జనాభాలో 90 శాతంగా ఉన్న రెండు ప్రధాన తె గలైన డింకా, న్యూర్ తెగల మధ్య అల్లర్లు చెలరేగాయని అధికారిక కథనం. అయితే ఈ అశాంతి, అస్థిరతలకు సల్వా కిర్ జూలైలో నాంది పలికారు. మచార్‌తో పాటూ ప్రభుత్వం లోని అందర్నీ పదవుల నుంచి తొలగించారు. ఫిబ్రవరిలో వంద మందికిపైగా సైనిక అధికారులను తొలగించే ప్రయత్నం కూడా చేశారు. దక్షిణ సూడాన్ ఐక్యతకు పునాది తెగల ఐక్యతే. దాన్ని పటిష్టం చేయగలిగితే అత్యంత వెనుకబడిన దేశం అభివృద్ధి చెందడానికి కావలసిన సకల వనరులు ఉన్నాయి. దేశం పొడవునా పారే నైలు నదీ జలా లతో పచ్చగా ఉండే దక్షిణ సూడాన్‌లో పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, క్రోమియమ్, జింక్, టంగస్టిన్, మైకా, వెండి, బంగారం, వజ్రాలు తదితర ఖనిజ సంపదలున్నాయి. దేశంలోని చమురు నిక్షేపాలపై చైనాకు అది సూడాన్‌లో భాగంగా ఉన్నప్పటి నుంచి ఆధిపత్యం ఉంది. అధికారం కోసం కుమ్ములాడుతున్న పక్షాలు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే దేశం జాతి మారణహోమంలోకి, మరో సుదీర్ఘ అంతర్యుద్ధంలోకి దిగజారిపోయే ప్రమాదం ఉంది. అమెరికా దాని మిత్ర దేశాలు, చైనా ప్రస్తుతం అక్కడి ఖనిజ సంపదలను చక్కబెట్టే పనిలో ఉన్నాయి. దక్షిణ సూడాన్ చమురును రవాణా చేసే పైపు లైన్ల వ్యవస్థ ఉత్తరాన ఉన్న సూడాన్‌లోనే ఉంది. ‘అబేయీ’ అనే కీలకమైన చమురు పట్టణం విషయంలో ఆ రెండు దేశాల మధ్య వివాదం, ఘర్షణలు రగులుతున్నాయి. దీంతో ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం మరిన్ని అత్యాధునిక ఆయుధాలను, సాయుధ సంపత్తిని సమకూర్చుకుంది. చైనా దానికి సరికొత్త ఆయుధ సరఫరాదారు. అందుకే పశు పోషక తెగల మధ్య పశు సంపదకోసం, పచ్చిక మైదానాల కోసం జరిగే సర్వసాధారణమైన సంఘర్షణలు శైశవ ప్రాయంలోని దేశాన్ని కుక్కలు చింపిన విస్తర్ని చేసే ముప్పు దిశకు దిగజారుతున్నాయి. ఒకప్పుడు బ్రిటన్ వలస పాలకులు సూడాన్‌ను మత ప్రాతిపదికపై దక్షిణ, ఉత్తర ప్రాంతాలుగా విభజించి, మతాల చిచ్చును రగిల్చి పాలించారు. చివరికి సూడాన్ రెండు ముక్కలు కావడానికి కారణమయ్యారు. నేటి అశాంతికి ప్రపంచ శక్తుల తెర వెనుక రాజకీయాలు కూడా తోడైతే పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. -పిళ్లా వెంకటేశ్వరరావు -
అంతర్యుద్ధంలో చిక్కుకున్నాం... కాపాడండి
దక్షిణ సూడాన్‌లో భారతీయుల ఆక్రందన బాధితుల్లో 100 మంది తెలుగువారు సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ దేశంలో రెండు తెగల మధ్య తాజాగా మొదలైన అంతర్యుద్ధం అక్కడ నివసిస్తున్న సుమారు 450 మంది భారతీయులను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. తమకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న వారంతా భారత ప్రభుత్వం తమను ఆదుకోవాలం టూ వేడుకుంటున్నారు. ప్రత్యేక విమానాల్లో తమను వెంటనే స్వదేశానికి తరలించాలని కోరుతున్నారు. అయితే దీనిపై అక్కడి మన రాయబార కార్యాలయం ఇప్పటివరకూ స్పందించలేదు. తమ దయనీయ స్థితిని ఓ బాధితుడు ‘సాక్షి’కి వివరించారు. ‘అంతర్యుద్ధం కారణంగా వారం నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. నేనున్న ప్రాంతంలో సుమారు 500 మంది మృతి చెందారు. ఎవరైనా ఆదుకుంటారేమోనని ఎదురుచూస్తున్నాం. ఇక్కడ ఉన్న భారత రాయభారి పర్మోద్ బజాజ్‌ను సాయం చేయాలని అర్థిం చాం. ఇంతవరకూ భారత ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరోవైపు అమెరికా, బ్రిటన్, చైనా, మలేసియా ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను పంపి వారి దేశస్తులను తీసుకెళ్లాయి. ఇక్కడ భారతీయులు 450 మంది ఉన్నారు. ఇందులో తెలుగువారు సుమారు 100 మందికిపైగా ఉన్నారు. మా వద్ద డబ్బులు కూడా లేవు’ అని సౌత్ సూడాన్ రాజధాని జూబా నుంచి నర్సరావుపేటకు చెందిన బోస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యేక విమానాల ద్వారా తమను వెంటనే తరలించాలని ఆయన కోరారు. గత రెండు రోజుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందడం లేదని ఆయన వాపోయారు. పత్రిక ద్వారా సమాచారం తెలియజేసి తమను ఆదుకోవాలని ఆయన విన్నవించారు. సూడాన్ నుంచి 2011లో రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌లో ప్రధానంగా రెండు తెగలు ఉన్నాయి. డింకా తెగకు చెందిన దేశాధ్యక్షుడు సల్వా కీర్... న్యూర్ తెగకు చెందిన ఉపాధ్యక్షుడు ఈయక్ మచార్‌ను పదవి నుంచి తొలగించడంతో గత ఆదివారం ఇరు తెగల ప్రజల మధ్య చెలరేగిన అల్లర్లు చివరకు అంతర్యుద్ధానికి దారితీశాయి. -
...లేదంటే మహా ఉద్యమమే
=తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ =నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదన విరమించుకోవాలి.. లేదంటే తెలంగాణ ఉద్యమం మహా ఉద్యమంగా మారుతుం దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేస్తే సివిల్‌వార్ తీసుకొస్తామం టూ ఏపీ ఎన్జీవోస్ నాయకుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ.. పోరాటం ఎలా చేయాలో ఈ ప్రాంత బిడ్డలకు తెలుసన్నారు. హైదరాబా ద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడి రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాటి బంద్‌లో ఉద్యోగులంతా పాల్గొంటున్నామని, అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షు డు కోల రాజేష్ కుమార్ మాట్లాడుతూ రాయల తెలంగాణను నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట వెయ్యి మంది ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న మోసాలను అడ్డుకుంటామన్నారు. మహాధర్నాలో ఉద్యోగులంతా పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమంలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు దాస్యానాయక్, టీఎన్జీవోస్ నాయకులు ఈగ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రాంకిషన్, సోమయ్య, ధరంసింగ్, శ్రీనివాస్, శ్యాంసుం దర్, సలీం, వేణు, రమేశ్, రత్నాకర్‌రెడ్డి, కిరణ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విభజన ఆగితే.. రియల్ వార్
తిరుమలగిరి, న్యూస్‌లైన్: ‘‘తెలంగాణ ఏర్పడితే సివిల్ వార్ వస్తదని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు అంటున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగితే రియల్ వార్ వస్తుంది’’ అని టీఆర్ఎస్ శాసనసభ ఉపనేత తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. టీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లకు శుక్రవారం తిరుమలగిరిలో సన్మానసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హరీష్‌రావు హాజరయ్యారు. సర్పంచులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని, దీనిపై ఎలాంటి కిరికిరి పెట్టినా ఒప్పుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ఎర్రబెల్లి, మోత్కుపల్లిలు చంద్రబాబు పెంపుడు కుక్కలన్నారు. వారు చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదువుతారని విమర్శించారు. తెలంగాణాలో టీడీపీ జీరో అయిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో సమైకాంధ్ర పల్లకిమోస్తున్న మోత్కుపల్లి నర్సింహులుగొంతు మూగబోయిందన్నారు. మో త్కుపల్లి హైదరాబాద్‌లో హీరో, తుంగతుర్తి నియోజకవర్గంలో జీరో అని విమర్శించారు. సీమాంధ్రలో ముఖ్యమంత్రి పదవికోసం కిరణ్‌బాబు, చంద్రబాబు, జగన్‌బాబు పోటీలు పడుతున్నారని ఆరోపించారు. ఎంతమంది బాబులు అడ్డంపడిన తెలంగాణా ప్రక్రియ ఆగదని హెచ్చరించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడి సీఎం లాలూప్రసాద్ యాదవ్ ఇప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి లాగానే వ్యవరించాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో టీ ఆర్ఎస్ ముందంజలో ఉంటుందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు తెలంగాణవాదులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీఎం తెలంగాణ వ్యతిరేకి : ఎంపీ వివేక్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని పెద్దపల్లి ఎంపీ జి. వివేక్ అన్నారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ ప్రాంతానికి పూర్తి అన్యాయం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాకు వేలాదికోట్ల రూపాయలు తీసుకెళ్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మందుల సామేలు, డాక్టర్స్ జేఏసీ చైర్మన్ బూర నర్సయ్యగౌడ్, వేముల వీరేశం, దుంపల క్రిష్ణారెడ్డి, పి. నర్సింహారెడ్డి, సత్యనారాయణ, రవీందర్రావు, సురేష్‌నాయక్, అరుణ పాల్గొన్నారు. -
జేడీఎస్ ఆఫీస్ కాంగ్రెస్‌దే
= హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు = 30 ఏళ్ల వివాదానికి తెర = ‘సుప్రీం’ను ఆశ్రయించే యోచనలో జేడీఎస్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సుదీర్ఘ న్యాయ పోరాటంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని జేడీఎస్ కార్యాలయం ఆ పార్టీకి చెందుతుందని హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పునిచ్చింది. దరిమిలా 30 ఏళ్ల వివాదానికి తెర పడింది. కోర్టు ఖర్చులను చెల్లించాలని, మూడు నెలల్లోగా కార్యాలయాలన్ని ఖాళీ చేసి కాంగ్రెస్‌కు అప్పగించాలని న్యాయమూర్తులు సూరి అప్పారావు, కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ భవన వివాదానికి సంబంధించి 2005లో స్థానిక సివిల్ కోర్టు కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ జేడీఎస్ హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడా చుక్కెదురైంది. కాగా హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. జేడీఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. నేపథ్యం 1954లో అప్పటి కాంగ్రెస్ నాయకులు సుబ్బన్న, రంగస్వామిలు ఈ స్థలాన్ని పార్టీకి దానంగా ఇచ్చారు. 1957లో అక్కడ పెద్ద భవంతిని నిర్మించారు. 1969లో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. తదనంతరం కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఓ)లుగా ఆవిర్భవించాయి. వీటిలో నిజమైన కాంగ్రెస్ ఏదనే వివాదం నెలకొంది. న్యాయ పోరాటం కూడా మొదలైంది. కాంగ్రెస్ (ఐ) నిజమైన కాంగ్రెస్ అని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. అప్పటికే భవనం కాంగ్రెస్ (ఓ) స్వాధీనంలో ఉండేది. తర్వాతి పరిణామాల్లో ఈ పార్టీ జనతా పార్టీలో విలీనమైంది. దరిమిలా కార్యాలయం కూడా ఆ పార్టీ పరమైంది. తదనంతరం జనతా పార్టీ, జనతా దళ్‌గా మారింది. ఈ పార్టీ కూడా రాష్ట్రంలో రెండుగా చీలిపోగా, జేడీఎస్, జేడీయూలు ఆవిర్భవించాయి. కార్యాలయం జేడీఎస్ ఆధీనంలోకి వెళ్లింది. ఈ భవనంలోనే పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది.