సిరియాలో భీకర డ్రోన్‌ దాడి | Drone Strikes At Syrian Military Ceremony Kill People - Sakshi
Sakshi News home page

సిరియాలో భీకర డ్రోన్‌ దాడి.. 100 మందికిపైగా దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు

Published Fri, Oct 6 2023 5:35 AM | Last Updated on Fri, Oct 6 2023 11:37 AM

Drone strikes at Syrian military ceremony kill people - Sakshi

బీరుట్‌: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్‌ దాడి సంభవించింది. హొమ్స్‌ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు.

సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement