ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తే.. కొన్ని చివరి వరకు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇక టైటిల్ ఫేవరెట్స్ అయిన అర్జెంటీనా, జర్మనీలకు సౌదీ అరేబియా, జపాన్‌లు షాకివ్వడం అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇక బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ గోల్స్ వర్షం కురిపించింది. ఏకండా 7-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది.
నికో విలియమ్స్(స్పెయిన్)
ఇదిలా ఉంటే స్పెయిన్ జట్టుకు ఆడుతున్న నికో విలియమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతని గతం ఎంతో సంఘర్షణతో కూడుకున్నది. నికోల్ విలియమ్స్ కుటుంబం ఘనాకు చెందినవాళ్లు. అయితే అతను పుట్టకముందే లిబేరియన్ అంతర్యుద్ధం కారణంగా కుటుంబం మొత్తం స్పెయిన్‌కు వలస వెళ్లింది. నికోల్ తండ్రి అంతర్యుద్ధానికి బయపడి కాలి నడకతోనే స్పెయిన్‌కు చేరుకున్నాడు. అప్పటికే నికోల్ విలియమ్స్‌కు ఒక అన్న ఉన్నాడు. అతనే ఇనాకి విలియమ్స్. అతను కూడా ఫుట్‌బాలర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక్కడ విచిత్రమేంటంటే.. తమ్ముడు నికో విలియమ్స్ స్పెయిన్‌కు ఆడుతుంటే.. అన్న ఇనాకి విలియమ్స్ మాత్రం తన స్వంత దేశమైన ఘనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఒక్క క్లబ్‌కే(అథ్లెటిక్ బిలాబో) ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా మారిన తర్వాత ఇనాకి విలియమ్స్ ఘనాకు వెళ్లిపోయాడు. అతని కుటుంబం మాత్రం స్పెయిన్‌లోనే ఉంది. కుటుంబంతోనే ఉన్న నికో విలియమ్స్ ఫుట్‌బాల్ ఆడుతూ ఆ తర్వాత స్పెయిన్ జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఇక తొలి ఫిఫా వరల్డ్‌కప్ ఆడుతున్న నికో విలియమ్స్.. తన అన్న ఇనాకి విలియమ్స్‌పై స్పందించాడు.
ఇనాకి విలియమ్స్(ఘనా)
''ఇద్దరం వేరే జట్టుకు ఆడుతుండొచ్చు.. కానీ మా బంధం మాత్రం ఎప్పుడు ఒకటే. అన్న నాకు నిరంతరం ఆటలో మెళుకువలు చెబుతూనే ఉంటాడు. అతనిచ్చే ధైర్యమే నన్ను మంచి ఫుట్‌బాలర్‌ను చేసింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇద్దరం ఎదురుపడతామే లేదో తెలియదు కానీ అన్నకు ప్రత్యర్థిగా ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఫిఫాలో వస్తే బాగుండు'' అని చెప్పుకొచ్చాడు.
ఇక స్పెయిన్-కోస్టారికా మ్యాచ్ ముగిసిన తర్వాత నికో విలియమ్సన్, ఇనాకి విలియమ్సన్‌లు ఒకరినొకరు హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. కాగా ఇనాకి విలియమ్స్ ఘనాకు ఆడుతుండగా.. గురువారం పోర్చుగల్‌తో ఘనా అమితుమీ తేల్చుకోనుంది.
చదవండి: FIFA WC: ఇదెక్కడి ఆచారమో ఏంటో.. ఆకట్టుకున్న జపాన్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment