ఇక 12 ఏళ్ల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్​ .. ఎక్కడో తెలుసా? | Singapore Among First Countries To Start Vaccinating 12 18 Year Olds | Sakshi
Sakshi News home page

ఇక 12 ఏళ్ల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్​ .. ఎక్కడో తెలుసా?

Published Mon, May 31 2021 8:44 PM | Last Updated on Mon, May 31 2021 9:23 PM

Singapore Among First Countries To Start Vaccinating 12 18 Year Olds - Sakshi

సింగపూర్:​ ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. మొదటి దశలో కంటె సెకండ్​వేవ్​లో వైరస్​ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో, అనేక దేశాల్లోని ప్రజలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే, ఈ వైరస్​ను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్​ను తప్పకుండా వేయించుకోవాలని డబ్ల్యూహెచ్​వో ఇదివరకే సూచించింది. అదే విధంగా, వ్యాక్సిన్​ తీసుకొనే వయస్సును కూడా తగ్గించిన విషయం తెలిసిందే.

అయితే, తాజాగా, సింగపూర్​ దేశం కరోనా వ్యాక్సిన్​ను తీసుకునే వారి వయస్సును మరింత కుదించి వార్తల్లోకి నిలిచింది. ఈ దేశం రేపటి నుంచి (మంగళవారం) 12 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్​ను వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, అతి చిన్న వయసులోని వారికి వ్యాక్సిన్​ను వేస్తున్న తొలి దేశంగా నిలిచింది.  కాగా, సింగపూర్​ జాతీయ దినోత్సవమైన ఆగస్ట్​ 9 నాటికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ ను వేయించుకోవాలని ఆ దేశ ప్రధాని లీ సేన్​లూంగ్​ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు సింగపూర్​ జనాభాలో మూడవ వంతు అంటే.. 5.7 మిలియన్ల ప్రజలు మొదటి డోస్​ ​ను వేయించుకున్నారని తెలిపారు. ఈ వైరస్​ కట్టడికి నిబంధలను పాటించడం, టీకా వేసుకోవడంతో మాత్రమే ఎదుర్కొనగలమని అన్నారు. కొత్త కేసుల సంఖ్య తగ్గితే ఆంక్షల నుంచి క్రమంగా మినహాయింపులు ఇస్తామని తెలిపారు. రాబోయే మరో 2 నెలల్లో మరిన్ని కంపెనీలు కోవిడ్​ వ్యాక్సిన్​లను మరింత వేగంగా అందిస్తాయని పేర్కొన్నారు.

అదే విధంగా, కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం, వైరస్ బాధితులను ఐసోలేషన్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫైజర్​ బయోఎంటేక్​​, మోడరనా వ్యాక్సిన్​లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న జాన్సన్​ అండ్​ జాన్సన్​, ఆస్ట్రాజెనెకా, సినోఫార్మ్​ నుంచి కోవిడ్​ వ్యాక్సిన్​ల దిగుమతికి అనుమతిస్తున్నట్లు  సెన్​లూంగ్​ తెలిపారు.

సింగపూర్​ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్​ యే కుంగ్​ మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్​వో ఆమోదించిన తర్వాత చైనా కు చెందిన సినోవాక్​ బయోటేక్​ నుంచి దాదాపు రెండు లక్షల వ్యాక్సిన్​ డోసుల పంపిణికి అనుమతి ఇస్తామని తెలిపారు. కాగా, వ్యాపారానికి, సరుకు రవాణాకు కేంద్ర బిందువైన సింగపూర్​లో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని లీ సేన్​లూంగ్​ అన్నారు. అదే విధంగా, వైరస్​తో సహజీవనం అలవాటు చేసుకోవాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement