నేరడిగొండ: శిశువు ‘దత్తత’కు ప్రభుత్వం సులువైన మార్గం తీసుకొచి్చంది. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధత ప్రకారం పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పించింది. గతంలో చాలామంది అడ్డదారులు తొక్కి శిశువులను దత్తత తీసుకున్న ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఇకపై అలాంటి చర్యలకు దిగితే న్యాయపరంగా పోలీసు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దత్తత కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రక్రియను పూర్తిచేసి శిశువును దత్తత తీసుకునే వెసులుబాటు కల్పించింది.
శిశువుల విక్రయాలు
దత్తత పేరుతో గతంలో ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శిశువులను విక్రయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు ఆడపిల్లలపై వివక్షతో భ్రూణహత్యలు జరగడంతో పాటు చెత్తకుప్పల్లో పడేస్తున్న విషయం విధితమే. దీన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పూర్తిస్థాయిలో ఫలితం లేకుండా పోయింది. చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియ గతంలో చాలా సంక్లిష్టంగా ఉండేది. అనేక రకాల పత్రాలు పొందుపర్చాల్సి వచ్చేది. దీంతో చాలా మంది దంపతులు అడ్డదారుల్లో శిశువులను దత్తత తీసునేవారు. అలా కొనుగోలు చేసిన వారిలో చాలా మంది న్యాయ సమస్యలు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది.
దత్తత విధానం..
శిశువు దత్తత తీసుకునే దంపతులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన అవకాశం ఉంటుంది. దంపతులు, శిశువు వివరాలని్నంటిని గోప్యంగా ఉంచుతారు. దంపతుల ఫొటో, పాన్‌కార్డు, జనన ధ్రువపత్రాలు, నివాస, ఆదాయ, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు లేవంటూ వైద్యాధికారి జారీ చేసిన పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ తదితర ఆరు రకాల పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దంపతులకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. వారి సీనియారిటీ ప్రకారం దరఖాస్తులు ప్రస్తుత దశ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే దత్తత ఇస్తారు. శిశువు, లింగం వివరాలు, వయస్సు, ఏ ప్రాంతానికి చెందిన శిశువు అవసరం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు దత్తత ఇచ్చే అధికారాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దాఖలు పర్చారు. నూతన విధానం అమలు చేసిన తర్వాత శిశువుల దత్తత కోసం దంపతులు ముందుకొస్తునట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కావల్సిన ధ్రువపత్రాలు
శిశువును దత్తత తీసుకునే దంపతులు ఇద్దరు కూడా పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువపత్రం, పెళ్లి రిజిస్ట్రేషన్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్, జనన ధ్రువపత్రాలు, జంట ఫొటోలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రాలను ఐసీపీఎస్ కార్యాలయంలో సమర్పించాలి. వీటితో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్, డీడబ్ల్యూఅండ్ సీడీఏ ఆదిలాబాద్ పేరిట రూ.6 వేల డీడీ తీయాల్సి ఉంటుంది. Cara.nic.in వెబ్‌సైట్ పారెంట్ లాగిన్‌లో రెసిడెంట్ ఇండియన్ పారెన్‌్టలో దత్తత కోరే తల్లిదండ్రుల వివరాలన్నీ పొందుపర్చాలి. అనంతరం అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. Praspective Adoptive Pareents(PAPs) పొందిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను భద్రపర్చుకొని సీనియారిటీని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.6 వేలు, దత్తత తీసుకునే సమయంలో రూ.40 వేలు, దత్తత పొందిన ఆరు నెలలకు రూ.8 వేలు ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దత్తత కోసం ఇప్పటివరకు 269 దరఖాస్తులు
జిల్లా కేంద్రంలో 2005లో శిశుగృహను ఏర్పాటు చేశారు. శిశువుల దత్తత కోసం ఇప్పటివరకు 269 మంది దంపతులు దరఖాస్తులు చేసుకున్నారు. 108 మంది శిశువులను దత్తత ఇచ్చారు. 73 మంది బాలికలు, 36 బాలుర శిశువులను అందజేశారు. మరో 183 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఇందులో 96 మంది శిశువులను భారతదేశానికి, 12 మందిని ఇతర దేశాలకు దత్తత ఇచ్చారు.
పారదర్శకంగా ప్రక్రియ
దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. శిశువును దత్తత తీసుకునే వారు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైరవీలకు ఆస్కారం లేకుండా చూస్తున్నాం. సీరియల్ ప్రకారం పక్షపాతం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తాం. దరఖాస్తు పరిశీలన అనంతరం చిన్నారులను దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది.
– రాజేంద్రప్రసాద్, డీసీపీఓ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment