ఆ పిచ్చిలో పడకూడదనే.. | Kate Winslet bans children from using social media | Sakshi
Sakshi News home page

ఆ పిచ్చిలో పడకూడదనే..

Published Mon, Nov 2 2015 2:28 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

ఆ పిచ్చిలో పడకూడదనే.. - Sakshi

ఆ పిచ్చిలో పడకూడదనే..

లండన్: ప్రముఖ హాలీవుడ్ సుందరి కేట్ విన్స్లెట్ తన పిల్లలకు కొన్ని నిషేధాజ్ఞలు అమలుపరిచింది. వారు ఎట్టి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలోకి తన ఇద్దరు పిల్లలను అనుమతించకుండా కట్టడి చేసింది. వారు అలా చేస్తే తమ అస్తిత్వాన్ని కోల్పోతారని, వారి సహజసిద్ధ లక్షణాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ పరిమితులు విధించినట్లు చెప్పింది.

విన్‌స్లెట్కు మియా అనే టీనేజ్ కూతురు జో అనే 11 ఏళ్ల బాబు ఉన్నాడు. ఈ రోజుల్లో టీనేజి యువతుల్లో సోషల్ మీడియా ప్రభావం అమితంగా ఉందని, దాని పిచ్చిలో పడి వారికి అసలు ఏం కావాలో అనే విషయం మర్చిపోతున్నారని, ఆహారపు అలవాట్లలో కూడా తీవ్ర మార్పులు వస్తాయని అందుకే తన ఇంట్లో సోషల్ మీడియాను నిషేధించి.. తన పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement