Dog Roams Around Fearlessly Among Tigers, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: పెద్దపులుల మధ్య ఏమాత్రం జంకులేకుండా దర్జాగా..

Published Tue, Jun 14 2022 3:25 PM | Last Updated on Tue, Jun 14 2022 7:19 PM

Fearless Dog Wandering Tigers Group Video Viral - Sakshi

వైరల్‌: ఇంటర్నెట్‌లో ఒక్కొసారి కొన్ని వీడియోలు.. అనూహ్యాంగా వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలకు ఉనికి(సోర్స్‌, ప్లేస్‌), సమయం తెలియకపోయినా నెటిజన్స్‌ ఆదరణ మాత్రం చురగొంటుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. 

గోల్డెన్‌ రెట్రైవర్‌ బ్రీడ్‌కు చెందిన ఓ శునకం.. పెద్దపులుల మధ్య దర్జాగా తిరుగాడుతోంది. అంతేకాదు.. వాటిని వీడియో తీసేవాళ్లను చూస్తూ ‘భౌ’ మంటూ తెగ బిల్డప్‌ కొట్టింది. పక్కనే ఉన్న పులులు ఏవీ కూడా దానికి హాని తలపెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలుసా?.. 

ఆ పులులు, కూనలుగా ఉన్న సమయంలో తల్లికి దూరం అయ్యాయి. అప్పటి నుంచి ఆ కుక్క వాటికి పాలిచ్చి పెంచింది. అన్నేసి పులి కూనలను సాకడం చిన్న విషయమూ కాదు. అందుకే తమతో పాటు పెరిగిన ఆ కుక్కను అమ్మగానే భావిస్తున్నాయి ఆ పులులు. టిక్‌టాక్‌ ద్వారా బాగా వైరల్‌ అయిన ఆ వీడియోను.. టైగర్‌ బిగ్‌ఫ్యాన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో అప్‌లోడ్‌ చేసింది. ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement