ఆలియా బికినీ కష్టాలు! | Hot Alia Bhatt in Shandaar Pink Bikini 4 Shaandaar Film | Sakshi
Sakshi News home page

ఆలియా బికినీ కష్టాలు!

Published Sat, Sep 12 2015 8:29 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఆలియా బికినీ కష్టాలు!

ఆలియా బికినీ కష్టాలు!

సాగర తీరాన ఆలియా భట్ ఓ టూపీస్ బికినీ వేసి నడుస్తుంటే, షాహిద్‌కపూర్ చూసి స్టన్ అయిపోవడం... ఇదంతా ‘షాన్‌దార్’ సినిమా ట్రైలర్‌లోని ఓ షాట్. ఆమె అభిమానులు కూడా ఈ బికినీ షాట్ చూసి  స్వీట్ షాక్ తిన్నారు. వెండితెరపై ఆలియా లాంటి అందగత్తెలు బికినీ  వేస్తే కుర్రకారుకు అంతకు మించిన ఆనందం ఉండదు. కానీ ఆలియా మాత్రం ఈ బికినీ షాట్ కోసం నానా క ష్టాలు పడ్డారట! ‘‘బికినిలో కనిపించడం నాకిది  రెండో సారి. మొదటి సారి ఓకే కానీ, ఈ సారి మాత్రం చాలా ఇబ్బంది పడ్డా.

మైనస్ 2 డిగ్రీస్ చలిలో ఆ టూపీస్ బికినీ వేసి నడుస్తుంటే నాకు నరకం కనిపించింది. అసలు నిలబడలేకపోయా. ఆ సన్నివేశం  బాగా వచ్చాక మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా’’ అని ఆలియా చెప్పుకొచ్చారు. షాహిద్ కపూర్ కూడా ఈ విషయం గురించి చెబుతూ- ‘‘ఆ సన్నివేశంలో ఓ బనియన్, షార్ట్ వేసుకున్న నేను... ఆ చలికి గజగజ వణికిపోయాను. ఇక ఆలియా పరిస్థితి ఏంటో ఊహించుకోగలను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement