బికినీలో ఆఫీసుకు రమ్మన్నారు! | Emmy Rossum was asked to meet a director in bikini | Sakshi
Sakshi News home page

బికినీలో ఆఫీసుకు రమ్మన్నారు!

Published Sat, Jun 17 2017 4:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

బికినీలో ఆఫీసుకు రమ్మన్నారు!

బికినీలో ఆఫీసుకు రమ్మన్నారు!

లండన్‌: ‘కానీ ఓ కండీషన్‌.. మీరు బికినీలో మాత్రమే ఆఫీసుకు రావాలి. ఆ దర్శకుడికి మీరు బాగా నచ్చారు. డబ్బులు కూడా పెద్ద మెత్తంలోనే ఇస్తారు. కాదనకండి. బికినీలో వస్తేనే మీరు లావు కాలేదన్న విషయం డైరెక్టర్‌గారికి అర్థమవుతుందట..’  అంటూ ఫోన్‌లో ఏజెంట్‌ చెప్పిన ఒక్క మాటలకు షాకయ్యానని చెప్పింది నటి ఎమ్మీ రస్సుమ్స్.

‘ది డే ఆఫ్టర్‌ టుమారో’,, ‘యూ ఆర్‌ నాట్‌ యూ’, ‘బ్యుటిఫుల్‌ క్రియేచర్‌’, లాంటి సూపర్‌హిట్‌ సినిమాలతోనేగాక ఫేమస్‌ టీవీషో ‘షేమ్‌లెస్‌’  ద్వారానూ హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మీ.. కొన్నేళ్ల కిందట తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనను మీడియాకు వివరించింది.

బికినీలో ఆఫీసుకు రమ్మనగానే తాను షాకయ్యానన్న ఎమ్మా.. అది మంచి ఆఫర్‌ కావడంతో ఒక్క నిమిషం ఆలోచించి తన ఏజెంట్‌తో ఇలా చెప్పిందట.. ‘స్క్రిప్ట్‌ పంపమను. అందులో హీరోయిన్‌ బికినీ సీన్లుంటే అలాగే చేద్దాం’ అని! చివరికి ఆ సినిమాలో తాను నటించలేదన్న హీరోయిన్‌.. బికినీ డిమాండ్‌ చేసిన దర్శకుడు ఎవరనేదిమాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement