తెలుగింటి అమ్మాయి | Special chit chat with sobhita dhulipala | Sakshi
Sakshi News home page

తెలుగింటి అమ్మాయి

Published Sun, Sep 2 2018 12:08 AM | Last Updated on Sun, Sep 2 2018 8:49 AM

Special chit chat with sobhita dhulipala - Sakshi

‘పక్కింటి అమ్మాయిలా ఉండటం’ అనేది తెలుగు సినిమా హీరోయిన్లు మామూలుగా సంపాదించుకునే ఓ కాంప్లిమెంట్‌. అలాగే ‘గ్లామరస్‌గా కనిపించడం’ ఇంకో రకమైన కాంప్లిమెంట్‌. అయితే ఈ రెండు రకాల కాంప్లిమెంట్స్‌ అందుకునేవాళ్లు తెలుగమ్మాయిలు అయి ఉండరు. ఎప్పుడో గానీ తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించరు. తాజాగా ఈమధ్యే విడుదలై సూపర్‌హిట్‌ కొట్టిన ‘గూఢచారి’లో హీరోయిన్‌గా నటించిన శోభిత ధూళిపాళ మాత్రం పక్కా తెలుగమ్మాయి. లేటెస్ట్‌ సెన్సేషన్‌ శోభిత గురించి కొన్ని విశేషాలు... 


పక్కా తెలుగమ్మాయి... 
శోభిత ధూళిపాళ తెనాలిలో పుట్టింది. ఆ తర్వాత చదువంతా విశాఖపట్నంలో సాగింది. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని కలలు కంటూ ఉండేది. సరిగ్గా అప్పుడే ముంబైలో పై చదువులు చదివే అవకాశం రావడంతో, చదువుకుంటూనే మోడలింగ్‌లోకి వచ్చింది. 2013లో ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ టైటిల్‌ కూడా సంపాదించింది. ఆ టైటిల్‌ ఇచ్చిన ఉత్సాహంతో 2014లో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌లో బికినీతో కనిపించి మోడలింగ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌ అయింది.


బాలీవుడ్‌లో  బోల్డ్‌ ఎంట్రీ! 
కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌లో కనిపించాక శోభిత చాలా మేగజైన్స్‌లో వరుసగా కవర్‌పేజీలపై దర్శనమిచ్చింది. ఆ సమయంలోనే ఇండియాలో పాపులర్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన అనురాగ్‌ కశ్యప్‌ తన ‘రమణ్‌ రాఘవ్‌ 2.0’ సినిమాలో శోభితికు హీరోయిన్‌ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. శోభితకూ సూపర్‌ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాలోనే ఆమె న్యూడ్‌గా కనిపించి ఆశ్చర్యపరిచింది. 


తెలుగు సినిమాతో ఫుల్‌ సర్కిల్‌... 
బాలీవుడ్‌లో ‘రమణ్‌ రాఘవ్‌ 2.0’ తర్వాత శోభితకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అనురాగ్‌ కశ్యప్‌ ప్రొడక్షన్‌లోనే మూడు సినిమాలు ఒప్పుకుంది. మాతృభాష తెలుగులో మాత్రం సినిమా చేయాలన్న ఆశ శోభితకు మొదట్నుంచీ ఉంది. గత నెలలో విడుదలై సూపర్‌హిట్‌ అయిన ‘గూఢచారి’తో ఆ కల నెరవేర్చుకుంది. ఈ సినిమాలో సమీరా రావ్‌ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి కుర్రకారుకు లేటెస్ట్‌ క్రష్‌గా మారిపోయింది. ‘తెలుగులో నటించడంతో నా కల ఇప్పుడు ఫుల్‌ సర్కిల్‌కు వచ్చిందని అనుకుంటున్నా’ అంది ‘గూఢచారి’ సక్సెస్‌ ఇచ్చిన ఆనందాన్ని పంచుకుంటూ. 

మలయాళం ఎంట్రీ!
ఫ్యాషన్‌ ఇండస్ట్రీ, బాలీవుడ్, టాలీవుడ్‌లలో ఇప్పటికే కుర్రకారు హృదయాలను దోచుకున్న శోభిత ఇప్పుడు చిన్న సినిమాలకు పెద్ద స్టార్‌. ఈ ఏడాది చివర్లో మలయాళ సినీ పరిశ్రమకూ పరిచయమవుతోంది. ‘మూథన్‌’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నివిన్‌ పాలీ హీరో. 

పాత్ర కోసం ఎంత దూరమైనా! 
కింగ్‌ఫిషర్‌లో బికినీతో కనిపించిన శోభిత, ‘రమణ్‌ రాఘవ్‌ 2.0’లో ఏకంగా న్యూడ్‌గా కనిపించింది. పాత్ర కోసం ఇలాంటి సాహసాలు చెయ్యడానికి వెనుకాడనని చెప్తోన్న శోభిత, అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించడం ఇష్టమని అంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement