'బికినీ కోసం అలాంటి పనులు చేయలేదు' | my target is fitness not for bikini, says Parineeti Chopra | Sakshi
Sakshi News home page

'బికినీ కోసం అలాంటి పనులు చేయలేదు'

Published Wed, Mar 2 2016 4:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'బికినీ కోసం అలాంటి పనులు చేయలేదు' - Sakshi

'బికినీ కోసం అలాంటి పనులు చేయలేదు'

ముంబై: బాలీవుడ్ ఫ్యాన్స్ ఆమె ప్రస్తుతం చేస్తున్న పనులపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. కొన్నిరోజుల కిందటి వరకు చాలా లావుగా ఉందని, అన్ని పాత్రలకు ఆమె సెట్ అవ్వదని విమర్శలున్నాయి. అయితే కఠిన వ్యాయామాలతో చెమటోడ్చి మరీ శరీర బరువు తగ్గించుకోవడం ద్వారా బాలీవుడ్ చిన్నది పరిణీతి చోప్రా వార్తల్లో ఎక్కిన విషయం తెలిసిందే. ఏంటి సైజ్‌జీరో శరీరాకృతి కోసం కష్టపడుతుందా.. అసలు పరిణీతి ఏం చేయాలనుకుంటుంది అని బాలీవుడ్ చెవులు కొరుక్కుంది. సన్నబడ్డాక పరిణీతి చోప్రా 'బిల్ట్‌ దట్‌ వే' హాట్‌హాట్‌ ఫొటోషూట్‌తో కనువిందు చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. తాను మాత్రం సన్నబడటం కంటే శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికే ప్రాధాన్యమని చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆమె సన్నబడటంపై చాలా విమర్శలొచ్చాయి. దీంతో ఈ అమ్మడు ఆ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాను బికినీ వేయడం కోసం సన్నగా అవ్వలేదని, శారీరకంగా ధృడంగా మారడాలనికి చాలా కష్టపడ్డాడని వివరించింది.

ఆరోగ్యం కోసం తాను స్విమ్మింగ్, జిమ్, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్సింగ్ ఇలా తన చేతనైన అన్ని కళలతోనూ కాస్త కుస్తిపట్టీ మరి అనుకున్నఫలితాన్ని సాధించుకుంది. అయితే, పరిణీతి కేవలం బికినీ లాంటివి ధరించడం కోసమే సన్నబడిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయాన్ని బయటపెట్టింది. తాను స్కిన్ షో చేయడం కోసం ఈ వర్క్ అవుట్స్ చేయలేదని, అవి చాలా వికృత విమర్శలు అని కొట్టిపారేసింది. సన్నబడటం వేరే విషయం.. తాను మాత్రం స్టామినాను పెంచుకొని శరీరం మీద అదుపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను అని ఇటీవల జరిగిన స్టార్‌డస్ట్ అవార్డ్స్‌ వేడుక సందర్భంగా చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement