![Pooja Hegde Talk About Bikini - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/17/Pooja-Hegde.jpg.webp?itok=KCXY1olK)
సాక్షి, సినిమా : నటి పూజాహెగ్డే బికినీ దుస్తుల్లో మిమ్మల్ని మీరు చూసుకుని గర్వపడండి అంటోంది. హీరోయిన్‌లు శృంగారతారల్ని మించిపోతున్నారనడంలో అతిశయోక్తి ఉండదనుకుంటా. గ్లామర్‌గా నటించారని విమర్శిస్తే ఒకప్పుడు హీరోయిన్లు ఆవేదన పడేవారేమో, కానీ ఇప్పుడు గర్వపడుతున్నారు. అవును గర్వపడాలి అంటోంది నటి పూజాహెగ్డే. ముగముడి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఉత్తరాది బ్యూటీ గుర్తుందా? జీవాతో రొమాన్స్ చేసిన ఈ చిత్రం తరువాత ఇక్కడ పత్తాలేదు. అందుకు కారణం ముగముడి చిత్రంలో దర్శకుడు మిష్కిన్ ఈ అమ్మడిని పక్కింటి అమ్మాయిలా చూపించడమే కావచ్చు.
ఇదే పూజాహెగ్డే టాలీవుడ్‌లో అందాలారబోతలో దుమ్మురేపుతోంది. ఇక అక్కడ అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించి అలాంటి పాటలకు తాను సై అని హింట్ ఇచ్చిన పూజాహెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ నటిగా రాణిస్తోంది. ఆ క్రేజ్‌తో మళ్లీ కోలీవుడ్‌కు వచ్చినా ఆశ్చర్య పడనవసరం లేదు. ముఖ్యంగా ఉత్తరాది భామలు ఎక్కువగా గ్లామర్‌నే నమ్ముకుంటున్నారని చెప్పవచ్చు.
నటి పూజాహెగ్డే ఒక చిత్రంలో బికినీ దుస్తులు ధరించిన గ్లామరస్ సన్నివేశాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొందరు అభిమానులు ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఆమెకు మెసేజ్ చేస్తున్నారు. మరి కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లతో దుమ్మురేపుతున్నారు. ఇదంతా చూసిన నటి పూజాహెగ్డే టెన్షన్ అయ్యిందట. అంతటితో ఆగలేదు స్మిమ్మింగ్ పూల్ పక్కన టూ పీస్ దుస్తులు ధరించి దిగిన ఒక ఫొటోను ఇంటర్నెట్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా పూజాహెగ్డే పేర్కొంటూ మహిళలందరూ తమ శరీరాకృతిని చూసి ఆనందపడడానికి అలవాటు పడాలన్నది. ఎందుకంటే కొందరు చిన్నబుద్ధి కలిగిన మగవారు మిమ్మల్ని ఎగతాళి చేసి నమ్మకాన్ని కోల్పోయేలా ప్రవర్తిస్తారని అన్నారు. అందుకే చెబుతున్నా అలాంటి పరిహాసాలను అస్సలు పట్టించుకోకండి అని పేర్కొంది. బికినీ దుస్తుల్లో మీ రూపాన్ని చూసి గర్వపడండి అని పూజాహెగ్డే అంది. ఏంటీ? కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని అనుకుంటున్నారా మీ ఇష్టం. మీరెలా అయినా అనుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment