ముకుంద సినిమాతో మెరిసిన పూజా హెగ్డే.. ‘డీజే’ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. డీజే సినిమా తరువాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ భామ. ప్రస్తుతం టాప్ హీరోలతో నటిస్తూ.. బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
హీరోయిన్ మేకప్ వేసుకోవడం మానేసి, తనే మేకప్ వేసే బాధ్యతను తీసుకున్నట్టుంది. తన మేకప్ ఆర్టిస్ట్ సాహిత్యా శెట్టికి మేకప్ వేస్తున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతో శ్రద్దతో మేకప్ వేస్తున్న పూజ..నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పూజా ప్రస్తుతం మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment