పిల్లల్ని పాడు చేయకండి! | By the way, don't take your kids to see Baywatch: Priyanka Chopra | Sakshi
Sakshi News home page

పిల్లల్ని పాడు చేయకండి!

Published Wed, May 17 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

పిల్లల్ని పాడు చేయకండి!

పిల్లల్ని పాడు చేయకండి!

ప్రియాంకా చోప్రా పద్ధతి చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. ఎంత ఇంగ్లీష్‌ సినిమా చేసినా... అక్కడి ప్రేక్షకుల కోసం రెండు పీలికల దుస్తులు (బికినీలు) వేసినా... భారతీయులకు ఓ సందేశం ఇచ్చారు. నా సినిమాకు మీ పిల్లల్ని తీసుకురావద్దని పెద్దలకు భలే పద్ధతిగా చెప్పారామె. ప్రియాంక నటించిన ఫస్ట్‌ హాలీవుడ్‌ మూవీ ‘బేవాచ్‌’ జూన్‌ 2న విడుదలవుతోంది. అమెరికన్‌ ‘బేవాచ్‌’ టీవీ సిరీస్‌ను ఫాలో అయినవాళ్లకు అందులో నటించిన భామలు దాదాపు బికినీల్లో దర్శనిమిచ్చిన విషయం తెలుసు. ఒక్క లైన్‌లో చెప్పాలంటే, ‘బేవాచ్‌’ అంటే బికినీ బ్యూటీలకు ఫేమస్‌.

 ఆ సిరీస్‌కు కొన్ని మార్పులు చేసి, ‘బేవాచ్‌’ సినిమా తీశారు. ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌లో హాట్‌ హాట్‌గా కనిపించిన ప్రియాంక, ఈ సినిమాలోనూ అదే స్థాయిలో నటించారు. అందుకేనేమో... ‘ఈ సినిమాకు మీ పిల్లల్ని తీసుకు వెళ్లకండి’ అనే స్టేట్మెంట్‌ ఇచ్చినట్టున్నారు. ఇందులో ప్రియాంక విలన్‌గా చేశారు.

 హాట్‌ విలన్‌ వేషాలు చూసి, పిల్లలు ఎక్కడ పాడవుతారోనని వాళ్లకు సినిమా చూపించొద్దని భలే పద్ధతిగా చెప్పారు కదా! ప్రస్తుతం ఈ సినిమా ప్రచారం కోసం అమెరికాలో ఉన్న ప్రియాంక విపరీతంగా అందాలను ఒలకబోస్తున్నారు. ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో బికినీల్లో ప్రియాంక చేసిన సందడి, స్టిల్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement