ఒంటరి తల్లి! | Priyanka Chopra Makes a Splash in LA for 'Baywatch' | Sakshi
Sakshi News home page

ఒంటరి తల్లి!

Published Sun, May 14 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

ఒంటరి తల్లి!

ఒంటరి తల్లి!

లక్‌ బలంగా ప్రియాంకా చోప్రా డోర్‌ తట్టినట్లుంది. ఒకదాని తర్వాత ఒకటి హాలీవుడ్‌ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముందు అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’లో ఛాన్స్‌. అది చేస్తున్నప్పుడు హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’కి ఛాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దాంతో ఇక ప్రియాంక హిందీ సినిమాలపై దృష్టి పెట్టక తప్పదని కొందరు భావించారు.

కానీ, ఆ ఛాన్సే లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ బ్యూటీ మరో హాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం కొట్టేశారు. చిత్రనిర్మాత పాల్‌ బెర్నన్‌ ఈ విషయాన్ని «ధృవీకరించారు. ఇందులో ప్రియాంక ఒంటరి తల్లి పాత్రలో కనిపిస్తారు. పాపులర్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’లో నటించిన జిమ్‌ పార్సన్స్‌ ఇందులో హీరో. అతని సరసనే ప్రియాంక నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement