అతడికి భార్యగా.. సోదరిగానూ ఒకే!: నటి | Priyanka Chopra roles in movies with ranveer singh | Sakshi
Sakshi News home page

అతడికి భార్యగా.. సోదరిగానూ ఒకే!: నటి

Published Fri, Jan 13 2017 9:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

అతడికి భార్యగా.. సోదరిగానూ ఒకే!: నటి

అతడికి భార్యగా.. సోదరిగానూ ఒకే!: నటి

ముంబై: బాలీవుడ్ లో విజయాలతో హాలీవుడ్ బాటపట్టిన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. క్వాంటికో అమెరికన్ టీవీ షోలతో అక్కడ కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బేవాచ్ అనే మూవీతో హాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రియాంక. అయితే ప్రేక్షకుల అభిరుచిపై ఇటీవల ప్రియాంక మాట్లాడుతూ.. వారు తెరపై తమ నటనను మాత్రమే చూస్తారు, కానీ ఆన్ స్క్రీన్ వ్యక్తులతో అన్ని మూవీలలో అదే రిలేషన్ ను ఆశించనరని పేర్కొంది. రణవీర్, తాను మూడు మూవీలు చేసినా కేవలం ఆయా పాత్రల్లో మేము మెప్పించామా లేదా అన్నదే ప్రేక్షకులు గుర్తించారు.

’రణవీర్ సింగ్, నేను ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించాం. గూండే మూవీలో నేను రణవీర్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించాను. ఆ తర్వాత ’దిల్ ధడ్ కనే దో’  మూవీలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆ హీరోకు సోదరిగా నటించాను. మేమిద్దం ముచ్చటగా మూడోసారి కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం బాజీరావ్ మస్తానీ. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ మూవీలో రణవీర్, నేను భార్యాభర్తలుగా నటించాం. ప్రేక్షకులు నన్ను, రణవీర్ సోదరిగానూ, భార్యగానూ, గర్ల్ ఫ్రెండ్ పాత్రలోనూ ఆదరించారని అర్ధం చేసుకోవచ్చు’  నని మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ప్రతి మూవీలో అదే పాత్రలు, రిలేషన్స్ చేయడం కుదరదని.. ప్రయోగాలు చేయడమూ ఆరోగ్యానికి మంచిదేనంటూ నవ్వేసింది ఈ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement