ప్రియాంక సినిమానే నెంబర్ వన్..! | Priyanka Chopra Baywatch tops list of most downloaded movies | Sakshi
Sakshi News home page

ప్రియాంక సినిమానే నెంబర్ వన్..!

Published Mon, Sep 4 2017 12:23 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

ప్రియాంక సినిమానే నెంబర్ వన్..! - Sakshi

ప్రియాంక సినిమానే నెంబర్ వన్..!

హాలీవుడ్ను దున్నేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో రికార్డ్ సృష్టించారు. బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి మూవీతో పాటు క్వాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఎక్కువగా హాలీవుడ్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్న ప్రియాంక ఎక్కవుగా అక్కడే సమయం గడుపుతున్నారు. అయితే  బేవాచ్ సినిమా రిజల్ట్ పరంగా నిరాశపరిచినా.. తాజాగా ఈ సినిమా ఖాతాలో ఓ రికార్డ్ చేరింది.

ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ లు జంటగా తెరకెక్కిన బేవాచ్ ఈ ఏడాది మే లో రిలీజ్ అయ్యింది. అయితే బుల్లితెర మీద ఘనవిజయం సాధించిన ఈ స్టోరి వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా 2017 ఇప్పటి వరకు అతి ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకున్న చిత్రాల్లో గత నెలలో బేవాచ్ తొలి స్థానంలో నిలిచింది. దీంతో వెండితెర మీద ఆకట్టుకోలేకపోయినా.. హోం థియేటర్లలో సత్తాచాటిన సినిమాగా రికార్డ్ సృష్టించింది బేవాచ్. ఈ సినిమా తరువాతి స్థానాల్లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2, మమ్మీ 2017 చిత్రాలు నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement