థాంక్యూ ప్రియాంక..! | Thank you Priyanka, tweets Arpita Khan post meeting Dwayne Johnson | Sakshi
Sakshi News home page

థాంక్యూ ప్రియాంక..!

Published Mon, May 23 2016 2:46 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

థాంక్యూ ప్రియాంక..! - Sakshi

థాంక్యూ ప్రియాంక..!

తన భర్త ఎంతగానో ఇష్టపడే హీరోను కలిపిస్తే.. ఏ భార్యకైనా సంతోషమే కదా. సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ కూడా ఇప్పుడు అలాగే ఆనందపడుతోంది. తన భర్త ఆయుష్ శర్మను హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్‌తో కలిపించినందుకు ప్రియాంకాచోప్రాకు బోలెడంత థాంక్స్ చెబుతోంది. డ్వేన్ జాన్సన్ చాలా స్వీట్‌గా ఉన్నారని కూడా చెప్పింది.

క్వాంటికో స్టార్‌ను చూడటం చాలా సంతోషంగా అనిపించిందని, త్వరలోనే ముంబైలో ప్రియాంకను కూడా కలుస్తామని అర్పిత ట్వీట్ చేసింది. అర్పిత దంపతులు ఇద్దరినీ న్యూయార్క్ నగరంలో చూడటం చాలా బాగుందని, ఓ వారం రోజుల్లో ముంబైలో కలుద్దామని ప్రియాంక ఆమెకు సమాధానం ఇచ్చింది. డ్వేన్ జాన్సన్ కూడా సమయం కేటాయించినందుకు థాంక్స్ చెప్పింది. 'బే వాచ్‌'లో జాన్సన్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తోంది. అందులో విక్టోరియా లీడ్స్ అనే నెగెటివ్ పాత్రను ఆమె పోషిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement