హాలీవుడ్ స్టార్స్ను దాటేసింది..! | priyanka chopra become most popular in social media Star | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ స్టార్స్ను దాటేసింది..!

Published Fri, Jun 16 2017 10:34 AM | Last Updated on Mon, Oct 22 2018 6:23 PM

హాలీవుడ్ స్టార్స్ను దాటేసింది..! - Sakshi

హాలీవుడ్ స్టార్స్ను దాటేసింది..!

హాలీవుడ్ను దున్నేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో రికార్డ్ సృష్టించింది. బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి  బేవాచ్ మూవీతో పాటు క్వాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు  సోషల్ మీడియాలోనూ మోస్ట్ పాపులర్ నటిగా నిలిచింది. ప్రియాంక తన బేవాచ్ కోస్టార్ డ్వేన్ జాన్సన్ తో పాటు వండర్ వుమెన్ స్టార్ గాల్ గాడెట్‌ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

సోషల్ మీడియా ఎనలిటిక్స్ సంస్థ ఎంవీ పిండిక్స్ తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో మోస్ట్ పాపులర్ ర్యాంకింగ్ నటీనటుల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ సెకండ్ ప్లేస్, యాక్టర్, కమెడియన్ కెవిన్ హర్ట్ థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. వండర్ వుమెన్ స్టార్ గాల్ గాఢట్ నాలుగో స్థానంలో, కారా డెలివింగ్నే ఐదో ర్యాంక్ తో సరిపెట్టుకున్నారు. వీరి తరువాత స్థానాల్లో విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement