Priyanka Chopra Gets Injured On Sets Of Citadel - Check Details - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: షూటింగ్‌లో గాయపడ్డ ప్రియాంక! ఆందోళనలో ఫ్యాన్స్‌..

Published Sat, Aug 28 2021 3:10 PM | Last Updated on Sat, Sep 4 2021 5:22 PM

Priyanka Chopra Gets Hurt In Citadel Set And Shares Wound Photos - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా షూటింగ్‌లో గాయపడిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొహం మీద మట్టి, నుదురు, చెంపలపై ఉన్న రక్తపు గాయాలకు సంబంధంచిన ఫొటోను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే షూటింగ్‌లో హీరోలు గాయపడటం సాధారణ విషయమే. ఫైట్స్‌, స్టంట్స్‌ సీన్స్‌ చేసేటప్పుడు వారు తరచూ ప్రమాదాల బారిన పడుతుంటారు.

అయితే హీరోయిన్లు గాయపడటం అనేది చాలా అరుదు. ఒకవేళ ప్రమాదం బారిన పడిన కాలు బెనకడం, చిన్న చిన్న గాయాలు వంటివి అవుతుంటాయి. అయితే ప్రియాంకుకు అయిన ఈ గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. దీంతో ఏమైంది ఇవి నిజంగా జరిగిన ప్రమాదమా లేక షూటింగ్‌ భాగంగా పెట్టిన గాయలా అని ఆరా తీయం మొదలు పెట్టారు.

చదవండి: టాలీవుడ్‌లోకి మరో వారసురాలు.. హీరోయిన్‌గా మేధ శ్రీకాంత్‌!

ఇక ఫ్యాన్స్‌ ఆందోళన చూసి ప్రియాంక వారి సందేహాలకు ఇలా బదులిచ్చింది. ఒక ఫొటోలు మొత్తం ఆమె ముఖం మట్టితో కొట్టుకుపోయి ఉండగా... మరోవైపు నుదుటి నుంచి రక్తం చెంపలపైకి జారుతుంది. అలాగే కనుబొమ్మపై కూడా గాటు ఉంది. అవి చూపిస్తూ చెంపలపై ఉంది నిజమైన గాయం కాదని, కనుబొమ్మపై ఉంది నిజమైన గాయం అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ప్రియాంక వెల్లడించింది.

దీంతో ఆమె ఫ్యాన్స్‌ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రియాంక సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ షూటింగ్‌ కోసం ప్రస్తుతం ఆమె లండన్‌ ఉంది. ఇందులో ప్రియాంక భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయని ఇందులో భాగంగానే ఈ గాయాలు అయినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

చదవండి: 'పుష్ప' విలన్‌ వచ్చేశాడు.. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌.. లుక్‌ ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement