బికినీలో మారిషస్ బీచ్‌లో... | Mauritius beach Tamanna in Bikini? | Sakshi
Sakshi News home page

బికినీలో మారిషస్ బీచ్‌లో...

Published Sat, Apr 12 2014 11:16 PM | Last Updated on Tue, Oct 16 2018 2:36 PM

బికినీలో మారిషస్ బీచ్‌లో... - Sakshi

బికినీలో మారిషస్ బీచ్‌లో...

 బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం అనేది కథానాయికలకు ఓ లక్ష్యంగా మారిపోయింది. దానికోసం వాళ్లు భారీ త్యాగాలకు కూడా వెనుకాడటం లేదు. దక్షిణాదిలో పద్ధతిగా కనిపించిన కథానాయికలందరూ బాలీవుడ్ కెమెరా ముందుకు రాగానే... హాట్ హాట్‌గా మారిపోతారు. ఈ విషయంపైనే నిన్నటిదాకా ఇలియానా చర్చనీయాంశమైంది. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. దక్షిణాదిలోని కొన్ని సినిమాల్లో ట్రెండీగా కనిపించినా... తమన్నా ఎక్కడా హద్దులు దాటలేదు. కానీ... ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా కోసం ఏకంగా బికినీ ధరించేసిందట తమన్నా. బికినీ వేయడమే కాదు, ఆ డ్రెస్‌లో మారిషస్ బీచ్‌లో స్టెప్పులు కూడా వేసిందట. 
 
 ఇంతకీ తమన్నా... ఇలా నర్తించిన సినిమా ఏంటా? అనుకుంటున్నారా! ఆ సినిమా పేరు ‘హమ్ షకల్స్’. సైఫ్ అలీఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ ఇందులో హీరోలు కాగా, బిపాసా బసు, ఇషా గుప్త, తమన్నా హీరోయిన్లు. మిగతా నాయికలను ఎలాగైనా డామినేట్ చేయాలనే తమన్నా ఈ సాహసం చేసిందని బాలీవుడ్ టాక్. బికినీలో పాలరాతి శిల్పంలా అనిపించే తమన్నా అందాలు యువతను కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదని ‘హమ్ షకల్స్’ దర్శకుడు సాజిద్ ఖాన్ చెబుతున్నారు. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement