బికినీలో ముగ్గురు బ్యూటీలు | Three babes to sport bikinis | Sakshi
Sakshi News home page

బికినీలో ముగ్గురు బ్యూటీలు

Published Wed, Apr 30 2014 6:06 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

బికినీలో ముగ్గురు బ్యూటీలు

బికినీలో ముగ్గురు బ్యూటీలు

ముగ్గురు ముద్దుగుమ్మలు... అదీ బికినీలో... మరి కుర్రాళ్లకు కనువిందు ఖాయం. నిద్ర ఖరాబు కావడం అంతకన్నా ఖాయం. దర్శక నిర్మాత సాజిద్ ఖాన్ 'హమ్ షకల్' లో డస్కీ బ్యూటీ బిపాశా బసు,  నటి మోడల్ ఈశా గుప్తా, మిల్కీ బ్యూటీ తమన్నాలు బికినీలో కనిపించనున్నారు. అయితే ఈ అందాల ఆరబోతంతా సినిమాలోని ఒక సీనులో మాత్రమేనట.

ఈ ముగ్గురమ్మలూ తమ శరీరాకృతికి సరిపోయే బికినీలు తామే సెలక్ట్ చేసుకుంటున్నారట. అంతే కాదు సెలెక్ట్ చేసుకున్న బికినీలకు తగిన శరీరాకృతిని సాధించుకునే పనిలో పడ్డారట. తన ప్రతి సినిమాలోనూ ఒక బికినీ సీనును తప్పనిసరిగా ఉంచే సాజిద్ ఈ సినిమాలోనూ అదే ఆచారాన్ని పాటించాడు.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ లు హీరోలు. సినిమాను వాశూ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20 న విడుదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement