
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో ఛత్రివాలి, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. టాలీవుడ్‌లో దూరమయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన సాహసానికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
(ఇది చదవండి: మాళవిక బోల్డ్ కామెంట్స్.. సిగ్గుపడి మెలికలు తిరిగిపోయిన డైరెక్టర్!)
రకుల్ ప్రీత్ మరీ బోల్ట్ డ్రెస్సులతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. బికినీ ధరించి మైనస్ 15 డిగ్రీల వాటర్‌లో ఉంటూ అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. బికినీ డ్రెస్‌లో.. అది మైనస్ డిగ్రీల చన్నీళ్లలో మునగడం సాహసమేనని మెచ్చుకుంటున్నారు. అయితే ఇదంతా ఆమె ఇటీవలే క్రియో థెరపీ చేయించుకుంది. అందులో భాగంగానే ఇలా గడ్డకట్టే నీటిలో స్నానం చేసిందంటున్నారు. ఏది ఏమైనా ఇలా అందాలు ఆరబోస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: అసలు కీర్తీ సురేశ్‌కు ఏమైంది.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment