
త్రిష బికినీ పార్టీ
జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలన్నది నటి త్రిషను చూసి నేర్చుకోవాలని చాలా మందికి అనిపించకమానదు. అంతదాకా ఎందుకు సహ నటీమణులే అసూయ పడేలా ఆమె లైఫ్ స్టైల్ ఉంటుందనవచ్చు.చాలా మంది హీరోయిన్లు డబ్బు సంపాదనే ధ్యేయంగా అవిరామంగా శ్రమిస్తుంటారు. కొందరికి తెగ సంపాదించినా ఎలా జల్సా చేయాలో తెలియదు. కూడబెట్టిన దాన్ని ఖర్చు చేయడానికి మనసు రాదు మరికొందరికి. అయితే నటి త్రిష ఇలాంటి వారందరికీ భిన్నం.
ఎంత సంపాదిస్తుందో అంతగా జీవితాన్ని జాలీగా గడిపేస్తుంది. ఈ చెన్నై చిన్నదానికి పార్టీలంటే ఎంత ఇష్టమో. అవి స్నేహితురాలితో జరుపుకోవడానికి తెగ ముచ్చట పడుతుంది. వారితో దేశ విదేశాలు తిరిగేస్తూ చుట్టేస్తూ తనకు నచ్చినట్లు గడిపేస్తుంది. ఆ మధ్య ప్రేమించి,పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రత్యేక విమానంలో ఆగ్రా వెళ్లి తాజ్‌మహాల్‌తో పాటు దాని చుట్టు పక్కల సుందర ప్రాంతాలన్నీ చుట్టొచ్చింది. ఆ విహార యాత్రలోనూ తన స్నేహితురాళ్లను దూరంగా పెట్టలేదామె.
వరుణ్‌మణియన్‌తో ప్రేమ,పెళ్లి అన్న కథ కంచెకు చేరినా, అందుకు ఇసుమంత కూడా చింతించని త్రిష పబ్‌లు, పార్టీలు అంటూ ఖుషీ ఖుషీగా జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తోంది. ఈ చెన్నై చిన్నది తన చిన్న నాటి స్నేహితులకు తరచూ పార్టీ ఇస్తుంటుంది. అలా ఇటీవల వారితో బికినీ పార్టీ జరుపుకుంది. ఇందులో విశేషం ఏమిటంటే అందరూ ఒక యూనిఫామ్‌లో దుస్తులు ధరించి రావాలన్నట్టు విప్‌ను జారీ చేసిందట త్రిష. నాయకురాలు ఆర్డర్ జారీ జేస్తే నెచ్చెలిలు పాటించకుండా ఉంటారా.
అందరు బికినీలు ధరించి పార్టీకి చేరుకున్నారు.త్రిష కూడా బికినీ ధరించి దానిపై జర్కీలాంటిది వేసుకుని స్నేహితురాళ్లతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిందట. అందాలతో కూడిన ఫొటోలను త్రిష స్నేహితురాళ్లలో ఏ తుంటరి చిన్నదో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు.అవి ఇప్పుడు సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.