Varunmaniyan
-
త్రిష బికినీ పార్టీ
జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలన్నది నటి త్రిషను చూసి నేర్చుకోవాలని చాలా మందికి అనిపించకమానదు. అంతదాకా ఎందుకు సహ నటీమణులే అసూయ పడేలా ఆమె లైఫ్ స్టైల్ ఉంటుందనవచ్చు.చాలా మంది హీరోయిన్లు డబ్బు సంపాదనే ధ్యేయంగా అవిరామంగా శ్రమిస్తుంటారు. కొందరికి తెగ సంపాదించినా ఎలా జల్సా చేయాలో తెలియదు. కూడబెట్టిన దాన్ని ఖర్చు చేయడానికి మనసు రాదు మరికొందరికి. అయితే నటి త్రిష ఇలాంటి వారందరికీ భిన్నం. ఎంత సంపాదిస్తుందో అంతగా జీవితాన్ని జాలీగా గడిపేస్తుంది. ఈ చెన్నై చిన్నదానికి పార్టీలంటే ఎంత ఇష్టమో. అవి స్నేహితురాలితో జరుపుకోవడానికి తెగ ముచ్చట పడుతుంది. వారితో దేశ విదేశాలు తిరిగేస్తూ చుట్టేస్తూ తనకు నచ్చినట్లు గడిపేస్తుంది. ఆ మధ్య ప్రేమించి,పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రత్యేక విమానంలో ఆగ్రా వెళ్లి తాజ్మహాల్తో పాటు దాని చుట్టు పక్కల సుందర ప్రాంతాలన్నీ చుట్టొచ్చింది. ఆ విహార యాత్రలోనూ తన స్నేహితురాళ్లను దూరంగా పెట్టలేదామె. వరుణ్‌మణియన్‌తో ప్రేమ,పెళ్లి అన్న కథ కంచెకు చేరినా, అందుకు ఇసుమంత కూడా చింతించని త్రిష పబ్‌లు, పార్టీలు అంటూ ఖుషీ ఖుషీగా జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తోంది. ఈ చెన్నై చిన్నది తన చిన్న నాటి స్నేహితులకు తరచూ పార్టీ ఇస్తుంటుంది. అలా ఇటీవల వారితో బికినీ పార్టీ జరుపుకుంది. ఇందులో విశేషం ఏమిటంటే అందరూ ఒక యూనిఫామ్‌లో దుస్తులు ధరించి రావాలన్నట్టు విప్‌ను జారీ చేసిందట త్రిష. నాయకురాలు ఆర్డర్ జారీ జేస్తే నెచ్చెలిలు పాటించకుండా ఉంటారా. అందరు బికినీలు ధరించి పార్టీకి చేరుకున్నారు.త్రిష కూడా బికినీ ధరించి దానిపై జర్కీలాంటిది వేసుకుని స్నేహితురాళ్లతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిందట. అందాలతో కూడిన ఫొటోలను త్రిష స్నేహితురాళ్లలో ఏ తుంటరి చిన్నదో ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.అవి ఇప్పుడు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. -
నేడు తెరపైకి పుగల్
నటుడు జయ్ కోపానికి వెండితెర రూపంగా పుగళ్ చిత్రం ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. ప్రతి నటుడు కోపావేశాలతో కూడిన పాత్రలో నటించాలని ఆశ పడతారు. అలాంటి పాత్రలతో యాక్షన్ హీరోగా ఎదుగుతుంటారు. ఇప్పటి వరకూ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న జయ్యాక్షన్ హీరో అవతారమే పుగళ్ చిత్రం. రేడియన్స్ మీడియా పతాకంపై వరుణ్‌మణియన్ నిర్మించిన ఈ చిత్రంలో జయ్ కోపకార యువకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి సురభి నటించింది. దీనికి ఉదయం ఎన్‌హెచ్4 చిత్రం ఫేమ్ మణిమారన్ దర్శకుడు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం గురించి చర్చించే కథతో తెరకెక్కిన చిత్రం పుగళ్. ఉదయం ఎన్‌హెచ్4 చిత్రంతో అప్పటి వరకూ చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఉన్న నటుడు సిద్ధార్థ్‌ను యాక్షన్ హీరోగా మార్చిన దర్శకుడు మణిమారన్ ఈ చిత్రంలో జయ్‌ను యాక్షన్ అవతారం ఎత్తించారు. పుగళ్ చిత్రం తనను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం అని జయ్ పేర్కొన్నారు. వివేక్శివ-మెర్విన్ సాలమన్ల ద్వయం సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
ఒక్కసారే ప్రేమలో పడ్డా!
జీవితంలో ఒక్కసారే ప్రేమలో పడ్డానంటున్నారు సంచలన నటి త్రిష. ఈమె ఎప్పుడెలా మాట్లాడుతారా? ఎలా స్పందిస్తారో? తెలియదు. అయితే త్రిష ఏం మాట్లాడినా అది సంచలనమే. ఏమి చేసినా కలకలమే. నిజమెంత అన్నది పక్కన పెడితే ఆమెపై ప్రచారం అయిన వదంతులు చాలానే. ఒక్క విషయం మాత్రం జగమెరిగిన నిజం. అదే నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థం, పెళ్లి వరకు వచ్చి నిలిచిపోవడం, ఈ విషయం గురించి ప్రస్తావించవద్దు ...ఎందుకంటే ఆ మేరకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాం అంటున్న త్రిష మాట్లాడుతూ జయంరవి సరసన తాను నటించిన సకలకళా వల్లవన్ చిత్రం శుక్రవారం విడుదలై మంచి ప్రజాదరణతో ప్రదర్శింపబడడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం కమలహాసన్ సరసన తూంగావనం, సుందర్ సి దర్శకత్వంలో అరణ్మణై -2 చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. తూంగావనం చిత్రంలో వైవిధ్యభరిత పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. సినిమా రంగంలో పలువురు స్నేహితురాళ్లు ఉన్నా నటి నయనతార మాత్రమే అత్యంత సన్నిహితురాలు అని అన్నారు. ఆమెతో కలసి ఒక్క చిత్రంలో అయినా నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఇక ప్రేమ, పెళ్లి విషయాలకొస్తే జీవితంలో ఒక్కసారే ప్రేమ పుట్టిందని ఆ తరువాత అది ఎలా మరుగున పడిందో తెలియలేదన్నారు. వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థం పెళ్లి, నిలిచిపోవడం గురించి ఏమి మాట్లాడకూడదని ఇరు కుటుం బాల వారు నిర్ణయించుకున్నామన్నారు. స్త్రీలకు పెళ్లి అవసరమే, నాకు తగిన వ్యక్తి లభిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తా. -
త్రిషపై రాజకీయ కన్ను
నటి త్రిషపై రాజకీయ కన్ను పడిందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన నటీమణుల్లో త్రిష ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె గురించి ప్రచారమయ్యే వదంతులు ఇన్నీఅన్నీ కావు. వ్యక్తిగత జీవితంలోనూ కలకలమే. ఇటీవల నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రేమ, పెళ్లి వరకూ దారితీసి ఆగిపోయిన వైనం ఇటు చిత్రపరిశ్రమలోనూ, అటు త్రిష అభిమానుల్లోనూ వేడి పుట్టించింది. ప్రస్తుతం వరుస చిత్రావకాశాలతో బిజీగా ఉన్న ఈ సంచలన నటిలో మరో కోణం ఉంది. అదే మానవతా దృక్పథం. త్రిషకు మూగ జీవాలంటే ఎనలేని ప్రేమ. ముఖ్యంగా శునక ప్రేమ అధికం. రోడ్డు పక్కన అనాథగా పడున్న కుక్క కంటబడితే వెంటనే దాన్ని అక్కున చేర్చుకుంటారు. ఇంటికి తీసుకెళ్లి సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటారు. అదేవిధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ పలు విషయాలపై అవగాహన కలిగిస్తుంటారు. నటి రోజా, కుష్భూ వంటి నటీమణులు ఇప్పటికే రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. మరో సంచలన నటి నమిత కూడా రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే సాధారణంగా ప్రముఖ నటీమణులను బయటి ప్రపంచంలో చూడడం అరుదయిన విషయం. అలాంటిది త్రిష ఇటీవల మెట్రో రైలులో సందడి చేసి మరోసారి తన సహజ నైజాన్ని ఆవిష్కరించారు. ఇవన్నీ కూడితే త్రిషకు రాజకీయరంగ అరంగేట్ర ఉద్దేశం ఉన్నట్లు భావించే అవకాశం లేకపోలేదు. అయితే ఈమెను రాజకీయాల్లోకి లాగాలనే ప్రయత్నాలు ఇదివరకే జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడులో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ కన్ను త్రిషపై పడినట్లు తెలుస్తోంది. ఆమెను ప్రచారానికి వాడుకోవాలని ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తునట్లు సమాచారం. -
శింబుతో మరోసారి త్రిష
సంచలన తార త్రిష నూతన చిత్రాల ఎంపికను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నటుడు శింబుతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష వరుణ్‌మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం నిలిచిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం కూడా త్రిష కొత్త చిత్రాలను ఒప్పుకుంటూపోవడమే అనే టాక్ వినిపిస్తోంది. త్రిష పెళ్లి నిశ్చితార్థానికి ముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లిపీటలెక్కుతారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అలాంటిది నిశ్చితార్థం తరువాత కూడా నూతన చిత్రాలను అంగీకరించడంతో వరుణ్‌మణియన్‌తో పెళ్లికి చిక్కులు తలెత్తినట్లు కోడంబాక్కం ప్రచారం. ఇప్పటికే త్రిష తన మేనేజర్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంతో పాటు, భోగి అనే చిత్రాన్ని అంగీకరించారు. తాజాగా శింబుతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. శింబుతో కలసి ఇప్పటికే అల, విన్నైతాండి వరువాయా చిత్రాల్లో నటించారు. ముచ్చటగా మూడవసారి సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరోసారి నటించడం చాలా సంతోషకరమైన విషయం అని త్రిష తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈమె ఇంతకుముందు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో నటించారు. తాజా చిత్రం మేలో ప్రారంభం కానుందని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, అరవింద్ కృష్ణ చాయాగ్రహణం అందించనున్నారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు ముఖ్యపాత్ర పోషించనున్నారని తెలిసింది.