
నేడు తెరపైకి పుగల్
నటుడు జయ్ కోపానికి వెండితెర రూపంగా పుగళ్ చిత్రం ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. ప్రతి నటుడు కోపావేశాలతో కూడిన పాత్రలో నటించాలని ఆశ పడతారు. అలాంటి పాత్రలతో యాక్షన్ హీరోగా ఎదుగుతుంటారు. ఇప్పటి వరకూ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న జయ్‌యాక్షన్ హీరో అవతారమే పుగళ్ చిత్రం. రేడియన్స్ మీడియా పతాకంపై వరుణ్‌మణియన్ నిర్మించిన ఈ చిత్రంలో జయ్ కోపకార యువకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి సురభి నటించింది.
దీనికి ఉదయం ఎన్‌హెచ్4 చిత్రం ఫేమ్ మణిమారన్ దర్శకుడు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం గురించి చర్చించే కథతో తెరకెక్కిన చిత్రం పుగళ్. ఉదయం ఎన్‌హెచ్4 చిత్రంతో అప్పటి వరకూ చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఉన్న నటుడు సిద్ధార్థ్‌ను యాక్షన్ హీరోగా మార్చిన దర్శకుడు మణిమారన్ ఈ చిత్రంలో జయ్‌ను యాక్షన్ అవతారం ఎత్తించారు. పుగళ్ చిత్రం తనను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం అని జయ్ పేర్కొన్నారు. వివేక్‌శివ-మెర్విన్ సాలమన్‌ల ద్వయం సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.