బికినీకి దూరం | Yami Gautam says no to BIKINI | Sakshi
Sakshi News home page

బికినీకి దూరం

Published Mon, Jun 23 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

బికినీకి దూరం

బికినీకి దూరం

టీ.నగర్: తనకు ఎంత డబ్బు ఇచ్చినా బికినీ దుస్తుల్లో నటించేది లేదని నటి యామిగౌతం ఖరాఖండిగా తెలిపారు. రాధామోహన్ దర్శకత్వంలో గౌరవం చిత్రంలో నటించారు యామి గౌతం. తమిళ్ సెల్వనమ్ తనియా అంజలుమ్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కాబోయే భర్త మనిషిగా కాకుండా రోబోగా ఎంపిక చేసుకుంటే బాగుం టుందని తన స్నేహితులు తనను ఆటపట్టిస్తుంటారని అన్నారు.
 
 తనను గౌరవించే మనస్తత్వం, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ప్రేమతో తనను ఆకర్షించాలని కూడా వివరించారు. తన మన స్తత్వం లాగానే అతని మనస్తత్వం ఉండాలని ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. తాను సహకరించే నటిని మాత్రమేనని అయితే తనకు అసౌకర్యం కల్పించే సన్నివేశాల్లో నటించబోనన్నారు. అంతేకాకుండా ఈత దుస్తుల్లో నటించబోనని స్పష్టం చేశారు. పెద్ద బ్యానర్, భారీ పారితోషికం అందచేసినప్పటికీ తన విధానం మార్చుకోనన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement