Radhamohan
-
కథ విని ఆశ్చర్యపోయాను
హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నందిగారు చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సవాల్‌గా తీసుకుని చేశాను. నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ క్రైమ్ థ్రిల్లర్. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్ వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమైంది’’ అన్నారు రాధామోహన్. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన సంపత్ నందిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు అశోక్ తేజ్. ‘‘ఈ సినిమా కథ విన్నపుడు థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు వశిష్ఠ సింహ. ‘‘ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాను’’ అన్నారు సాయి రోనక్. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్
‘‘నా సినిమా హిట్ అయితే ఎందుకు ఆడింది?, ఫ్లాప్ అయితే ఎందుకు ఆడలేదు? అని ఎక్కువగా ఆలోచించను. అలా ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం (నవ్వుతూ). నేనెప్పుడు ఒక్కటే ఫాలో అవుతా. నేను చేసే సినిమా నాకు నచ్చాలి. నాకే నచ్చకపోతే మిగతావాళ్లకు నచ్చాలని ఎలా కోరుకోగలను’’ అని కార్తీ అన్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత రాధామోహన్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ పంచుకున్న విశేషాలు... ► ఒక రోజు రాత్రి నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథే ‘ఖైదీ’ సినిమా. పదేళ్ల నుంచి జైల్లో ఉండి విడుదలైన ఖైదీ పాత్రలో కనిపిస్తాను. జైల్లో ఉండటంతో పదేళ్లుగా తన పాపను కూడా చూడలేడు. మొదటిసారి తన కూతుర్ని చూడబోయే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి పాపను చూస్తానా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. పోలీసులు ఉన్నారనే ధీమాతో మనందరం హాయిగా నిద్రపోతున్నాం. పోలీసులు అనేవాళ్లు లేకుంటే పరిస్థితి ఏంటి? అనే విషయాన్ని ఈ సినిమాలో చర్చించాం. ► ‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్ ఉన్నాయి. అందుకే పాటలు, రొమాన్స్ పెట్టలేదు. ఇది ఫుల్ మాస్ సినిమా. నా పాత్ర ఊరమాస్‌గా ఉంటుంది. సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర హీరోలా మారుతుంటుంది. టైటిల్ కూడా సూట్ అవుతుందని ‘ఖైదీ’ పెట్టాం. ► దర్శకుడు లోకేశ్‌కి ఇది రెండవ సినిమా. ఇంతకు ముందు ‘మానగరం’ సినిమా తెరకెక్కించారు. అంతకు ముందు కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించారు. ‘ఖైదీ’ ఇంటర్నేషన్ల్ రేంజ్ ఫిల్మ్. హాలీవుడ్ ‘బ్యాట్‌మ్యాన్, సూపర్‌మేన్’ సినిమా స్టయిల్ ట్రీట్మెంట్ ఇచ్చాం. భవిష్యత్తులో ‘ఖైదీ’ చేశామని కచ్చితంగా గర్వపడతాం. ► ‘విక్రమార్కుడు’ తమిళ రీమేక్ చేస్తున్నప్పుడు నాకు ఒక పాప ఉన్నట్టు ఊహించుకొని ఎమోషన్ని పండించాలి. అప్పుడు నాకు కూతురు లేదు.. ఇప్పుడు ఉంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కూతురు అనగానే తండ్రికి ఒకలాంటి సంరక్షించే బాధ్యత ఉంటుంది. ఈ భావోద్వేగాన్ని ఈ సినిమాలో చూపించాం. ► ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారుతోంది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ వల్ల ప్రపంచ సినిమాను ఫోన్లోనే వీక్షిస్తున్నారు. ‘డిజిటల్లో కేవలం సిటీ వాళ్లే చూస్తారులే అనుకునేవాణ్ణి’. కానీ, షూటింగ్ కోసం ఓ ఊరు వెళితే ‘సార్.. ‘మనీ హెస్ట్’ షో చూశారా? అని అడుగుతున్నారు. పండగకి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏది బావుంటే దాన్ని చూస్తారు. పండగ టైంలో ప్రేక్షకులకు ఆప్షన్స్ ఉండాలి. బావుంటే రెండు సినిమాలూ చూస్తారు. ఈ సంక్రాంతికి తమిళంలో విడుదలైన ‘పేట్టా, విశ్వాసం’ రెండూ హిట్ అయ్యాయి. ► ఏ పాత్ర అయినా నన్ను చాలెంజ్ చేయాలి. ఈ సినిమా కోసం నిజంగానే ఖైదీలను కలిశాం. వాళ్ల నుంచి సమాచారం తీసుకొని నా పాత్రను చేశాను. నా దృష్టిలో అందరూ ప్రేక్షకులే. తెలుగు, తమిళం అని వ్యత్యాసం ఉండదు. రెండు రాష్ట్రాలకు కొన్ని పోలికలు ఉంటాయి. ► జోసెఫ్గారి దర్శకత్వంలో వదిన జ్యోతికగారితో ఓ సినిమా చేశాను. అందులో మేమిద్దరం అక్కా తమ్ముడిగా నటించాం. ప్రస్తుతం ‘సుల్తాన్’ అనే సినిమా చేస్తున్నాను. ► రజనీకాంత్, విజయ్, అజిత్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులందరూ మీతో పని చేసినవాళ్లే. మీరు వాళ్లకు లక్కీ హీరో కదా? అని అడగ్గా – ‘అది నా అదృష్టం. వాళ్లకు ప్రతిభ ఉంది కాబట్టి వరుసగా మంచి సినిమాలు చేస్తున్నారు. ‘ఖైదీ’ టీజర్ రాగానే విజయ్‌గారు మా దర్శకుడికి ఫోన్ చేసి అవకాశం ఇచ్చారు. -
చెప్పిన తేదీకి పక్కా
గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘పంతం’. ‘బలుపు, పవర్, జై లవ కుశ ’ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమా నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు నటించిన 25వ సినిమా ఇది. మా సంస్థలో ఏడో చిత్రం. చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మించాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై 5న సినిమా విడుదల చేస్తామని ఏప్రిల్‌లోనే చెప్పాం. ఆ ప్రకారమే ప్రణాళికగా తెరకెక్కించాం. ఇటీవల యు.కె,లండన్, స్కాట్లాండ్లో కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించాం. ఈ నెల 21న విజయవాడలో ఆడియో, 24న వైజాగ్‌లో ఫంక్షన్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను, మా టీమ్ కలిసి మంచి ప్రయత్నం చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అన్నారు కె.చక్రవర్తి. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ పాల్గొన్నారు. పృథ్వీరాజ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
బికినీకి దూరం
టీ.నగర్: తనకు ఎంత డబ్బు ఇచ్చినా బికినీ దుస్తుల్లో నటించేది లేదని నటి యామిగౌతం ఖరాఖండిగా తెలిపారు. రాధామోహన్ దర్శకత్వంలో గౌరవం చిత్రంలో నటించారు యామి గౌతం. తమిళ్ సెల్వనమ్ తనియా అంజలుమ్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కాబోయే భర్త మనిషిగా కాకుండా రోబోగా ఎంపిక చేసుకుంటే బాగుం టుందని తన స్నేహితులు తనను ఆటపట్టిస్తుంటారని అన్నారు. తనను గౌరవించే మనస్తత్వం, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ప్రేమతో తనను ఆకర్షించాలని కూడా వివరించారు. తన మన స్తత్వం లాగానే అతని మనస్తత్వం ఉండాలని ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. తాను సహకరించే నటిని మాత్రమేనని అయితే తనకు అసౌకర్యం కల్పించే సన్నివేశాల్లో నటించబోనన్నారు. అంతేకాకుండా ఈత దుస్తుల్లో నటించబోనని స్పష్టం చేశారు. పెద్ద బ్యానర్, భారీ పారితోషికం అందచేసినప్పటికీ తన విధానం మార్చుకోనన్నారు. -
ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను!
‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరి చేద్దామనుకుంటున్న సమయంలో రవిచావలి ఈ కథ చెప్పారు. సంగీతభరితంగా సాగే ఈ ప్రేమకథలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అని ఆది చెప్పారు. రవిచావలి దర్శకత్వంలో ఆది నటిస్తున చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. శాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది మాట్లాడుతూ- ‘‘నటునిగా ఇది నా నాలుగో చిత్రం. దర్శకుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అనూప్ పాటలు ఈ చిత్రానికి ఆభరణాలు. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. అందరి సహకారంతో వచ్చే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. రవి చావలి ద్వారానే ఆది, ఆర్.ఆర్.మూవీస్ వెంకట్‌కి పరిచయం అయ్యాడని, ఇప్పుడు రవి దర్శకత్వంలో ఆది నటించడం చాలా ఆనందంగా ఉందని, టైటిల్‌కి, ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోందని సాయికుమార్ అన్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇదని, ఆది డాన్సులు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, ఆయనలోని ఎనర్జీని చూసి, అందుకు తగ్గట్టుగా కథను ఇంకా మెరుగుపరిచామని దర్శకుడు చెప్పారు. ఈ షెడ్యూల్ జనవరి 11 వరకూ జరుగుతుందని, ఫిబ్రవరిలో పోస్ట్‌ప్రొడక్షన్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఆది జరుపుకోవాలని పీజే శర్మ ఆకాంక్షించారు. మళ్లీ ఆదితో నటిస్తుండటం పట్ల శాన్వీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్.