ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను! | will do three films a year, says actor adi | Sakshi
Sakshi News home page

ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను!

Published Tue, Dec 24 2013 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను!

ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను!

 ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరి చేద్దామనుకుంటున్న సమయంలో రవిచావలి ఈ కథ చెప్పారు. సంగీతభరితంగా సాగే ఈ ప్రేమకథలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అని ఆది చెప్పారు. రవిచావలి దర్శకత్వంలో ఆది నటిస్తున చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. శాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది మాట్లాడుతూ- ‘‘నటునిగా ఇది నా నాలుగో చిత్రం. దర్శకుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అనూప్ పాటలు ఈ చిత్రానికి ఆభరణాలు. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది.
 
అందరి సహకారంతో వచ్చే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. రవి చావలి ద్వారానే ఆది, ఆర్.ఆర్.మూవీస్ వెంకట్‌కి పరిచయం అయ్యాడని, ఇప్పుడు రవి దర్శకత్వంలో ఆది నటించడం చాలా ఆనందంగా ఉందని, టైటిల్‌కి, ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోందని సాయికుమార్ అన్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇదని, ఆది డాన్సులు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, ఆయనలోని ఎనర్జీని చూసి, అందుకు తగ్గట్టుగా కథను ఇంకా మెరుగుపరిచామని దర్శకుడు చెప్పారు.
 
ఈ షెడ్యూల్ జనవరి 11 వరకూ జరుగుతుందని, ఫిబ్రవరిలో పోస్ట్‌ప్రొడక్షన్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఆది జరుపుకోవాలని పీజే శర్మ ఆకాంక్షించారు. మళ్లీ ఆదితో నటిస్తుండటం పట్ల శాన్వీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement