బికినీకి రెడీ
ప్రస్తుతం యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న చిత్రాలే అధికం అన్నది ఎవరూ కాదనలేని నిజం. అలాంటి వారు కోరుకునే అంశాల్లో కథానాయికల అందచందాలు ఒకటి. అలాంటి అందాలారబోతకు మన హీరోయిన్లెప్పుడూ ముందుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కొందరు గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు విధించుకుంటామంటారు. అయితే బికినీ ధరించడానికి అంగీకరించే భామల సంఖ్య తక్కువనే చెప్పాలి.
ఇంతకుముందు బిల్లా చిత్రంలో నటి నయనతార, నమిత పోటీపడి బికినీలో అందాలను ఆరబోశారు. నటి ప్రియమణి తెలుగు చిత్రం ద్రోణాలో మరింత మితిమీరి సొగసును వెండితెరపై పరిచారు. తాజాగా కాజల్ బికినీలో యువతను మత్తెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సుందరికి చిత్రాల సంఖ్య తగ్గిందనే కంటే ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న జిల్లా మినహా ఒక్క చిత్రం చేతిలో లేదు. తదుపరి కమల్ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారిక సమాచారం లేదు.
దీంతో మళ్లీ అవకాశాలను రాబట్టుకోవడానికి ఈ ముద్దుగుమ్మ గ్లామర్ బాటను ఎంచుకున్నట్లుంది. జిల్లా చిత్రంలో తడితడి అందాలతో కుర్రకారును కిర్రెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. కథకు అవసరం అవడంతో కొన్ని సెకన్లు మాత్రమే ఉండే సన్నివేశాల్లో కాజల్ బికినీ దుస్తుల్లో కాస్త శ్రుతిమించి గ్లామర్‌ను ప్రదర్శించినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. అయితే హీరోయిన్ల మధ్య పోటీ అధికం అవుతోందన్నది నిజం. దాన్ని ఎదుర్కొని నిలబడాలంటే గ్లామర్ విషయంలో పట్టువిడుపులు అవసరమనే భావనతోనే కాజల్ అగర్వాల్ బికినీ సొగసులను ఆరబోయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.