కొత్త భామలకు కలిసొచ్చిన 2016 | Successful Tollywood Actresses in 2016 | Sakshi
Sakshi News home page

కొత్త భామలకు కలిసొచ్చిన 2016

Published Thu, Dec 29 2016 3:34 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

కొత్త భామలకు కలిసొచ్చిన 2016 - Sakshi

కొత్త భామలకు కలిసొచ్చిన 2016

హీరోయిన్ లేని సిల్వర్ స్క్రీన్ ను ఊహించలేం. అందాల తారలు ముందర కాళ్లకు బంధాలు వేస్తారు. కలర్ ఫుల్ గా కనిపిస్తూ కలెక్షన్లు పెంచేస్తారు. 2016లో కూడా అదే తీరులో దూసుకుపోయారు. ప్రేక్షకులెప్పుడూ కొత్త దనం కోరుకుంటారు, కథలో మాత్రమేకాదు కలలో కూడా దాన్ని వెతుక్కుంటారు. అందుకే యంగ్ హీరోయిన్లు తమ స్వింగ్ చూపిస్తుంటారు.

2016లో కూడా అదే కంటిన్యూ అయ్యింది. అంతకు ముందే వేసుకున్న బేస్ పై ఇటుకలు పేర్చుకుంటూ వెళ్లారు. విజయానికి కావాల్సిన కిటుకులు నేర్చుకునే ప్రయత్నం చేశారు.  ఆ అందాల యుద్ధం రసవత్తరంగానే సాగింది.  సురభి, పూర్ణ, రెజీనా, రాశీఖన్నా,  లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ ఇలా అందరూ ఆకట్టుకున్నారు. అందం అభినయం కలిపి ప్రేక్షకులకు గాలం వేశారు. కలెక్షన్ల వేటలో తమ రోల్ పర్ఫెక్ట్ గా ప్లే చేశారు.

అయితే ఈ 2016 అందరికీ కలిసొచ్చింది అని మాత్రం చెప్పలేం. ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ చక్రం తిప్పిన కాజల్ అగర్వాల్ కు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఈ అమ్మడి ఖాతాలో పడలేదు. సౌత్ టాప్ హీరోయిన్ గా ఉన్న నయనతారకు కూడా టాలీవుడ్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. చేసింది ఒక్క సినిమానే అయినా అది కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

సీనియర్ హీరోయిన్ల రికార్డ్ ఎలా ఉన్న కొత్త భామలకు మాత్రం 2016 బాగానే కలిసొచ్చింది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాలకు వరకు కొత్త భామలే హవా చూపించారు. ఈ ఏడాది సక్సెస్ ట్రాక్ లోకి అడుగు పెట్టిన ఈ కొత్త తారలు 2017లో స్టార్ లీగ్ లోకి చేరుతారేమో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement