నేను బికినీ ధరించను
కథానాయికలు బికినీ దుస్తులు ధరించడం అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. అదేమంటే కథ డిమాండ్ మేరకేనంటున్నారు. లిప్‌లాక్ సన్నివేశాలే విచ్చలవిడి అవుతుంటే బికినీ దుస్తులు గురించి అంతగా ప్రస్తావిస్తున్నారేమిటని అంటారా? నయనతార, అనుష్క లాంటివారే ఈత దుస్తుల్లో తెరపై అందాలు ఆరబోశారు. అలాంటిది నటి తమన్న మాత్రం బికినీ దుస్తులు ధరించనని మొరాయించారట. అదేమిటి తెలుగు చిత్రాల్లో తడి తడి అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన ఈ బ్యూటీ బికినీకి నో అన్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? అయినా ఇది నమ్మాల్సిందే.
తమన్నకు ప్రస్తుతం దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు లేవు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఆర్య సరసన రాజేష్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్‌పైకి రానుంది. వీరం చిత్రం తరువాత తమన్న నటించనున్న తమిళ చిత్రం ఇదే. తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నారు. కాగా హిందీలో హమ్‌షకల్స్ అనే చిత్రంలో సైప్ అలీఖాన్ సరసన నటిస్తున్నారు. షాహిద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బికినీ దుస్తులు ధరించాలని దర్శకుడు చెప్పడంతో సారీ అంటూ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చేశారని సమాచారం.
ఆ తరువాత మళ్లీ తర్జన భర్జన పడి బికినీ దుస్తులు ధరించడానికి తమన్న అంగీకరించారని బాలీవుడ్ రూమర్. అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు తమన్న. తాను చిత్రాన్ని అంగీకరించి ఒప్పందం చేసుకున్నప్పుడే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించేది లేదని, బికినీ దుస్తులను దరిదాపులకు కూడా రానీయనని స్పష్టంగా దర్శక నిర్మాతలకు చెప్పేశానన్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఇలాంటి విషయాల కారణంగా కొన్ని చిత్రాలను వదులుకున్నానని తెలిపారు.