నటి బికినీ వేసుకోవలసిందేనా? | i am do not that type roles ? - tamanna | Sakshi
Sakshi News home page

నటి బికినీ వేసుకోవలసిందేనా?

Apr 24 2017 12:12 AM | Updated on Sep 5 2017 9:31 AM

నటి బికినీ వేసుకోవలసిందేనా?

నటి బికినీ వేసుకోవలసిందేనా?

ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేయాలంటే బికినీ వేసుకోవలసిందేనా? స్కిన్‌ షో తప్పనిసరా?

ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేయాలంటే బికినీ వేసుకోవలసిందేనా? స్కిన్‌ షో తప్పనిసరా? అనడిగితే... ‘‘స్కిన్‌ షోకి ప్రేక్షకులు ఎట్రాక్ట్‌ అవుతారనేది అపోహే. నేను నమ్మను’’ అంటున్నారు తమన్నా. హీరోయిన్‌గా మీకు మీరు ఏవైనా పరిమితులు పెట్టుకున్నారా? అని తమన్నాను ప్రశ్నిస్తే... ‘‘యస్‌. కొన్ని ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మా అమ్మానాన్నలకు కొన్ని ప్రామిస్‌లు చేశా. నాకు కంఫర్ట్‌బుల్‌గా లేని బట్టలను నేను వేసుకోను. అయినా వేసుకునే డ్రెస్సులు మనకు పాపులారిటీ తీసుకురావు. ప్రేక్షకులను ఎట్రాక్ట్‌ చేయడానికి నేను బికినీ వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం.

నేనెప్పుడూ అలా చేయను’’ అని సమాధానం ఇచ్చారు. ఈ శుక్రవారం వస్తోన్న ‘బాహుబలి–2’ మినహా... ప్రస్తుతం తమన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఓ మూడున్నాయి. హిందీలో ప్రభుదేవాతో కలసి చేస్తున్న సినిమాలో చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తున్నారు. ప్రతి వారం రెండు మూడు సినిమాలు తమన్నా తలుపు తడుతున్నాయట. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయట. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement