బాహుబలి 2లో తమన్నా సీన్స్ ఏమయ్యాయ్..? | Reason behind Tamanna Short screen space in Baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2లో తమన్నా సీన్స్ ఏమయ్యాయ్..?

May 6 2017 1:58 PM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన తమన్నా, సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని షాట్స్ కే పరిమితమైంది.

బాహుబలి తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన తమన్నా, సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని షాట్స్ కే పరిమితమైంది. బాహబలి 2 రిలీజ్ కు ముందు పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా తన పాత్రో సెకండ్ పార్ట్ లోనూ చాలా సీన్స్ లో కనిపిస్తుందని తెలిపింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే సరికి సీన్ మారిపోయింది. రెండు మూడు షాట్స్ తప్ప తమన్నకు సెకండ్ పార్ట్లో పెద్దగా స్కోప్ లేదు.

అయితే ముందుగా చెప్పినట్టుగా తమన్నాతో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించాడట దర్శకుడు రాజమౌళి, కానీ ఆ సీన్స్లో గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో చివరి నిమిషంలో ఆ సీన్స్ను తొలగించి సినిమా రిలీజ్ చేశారు. ఏ రకంగా సినిమా క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో సెకండ్ పార్ట్లో తమన్నా క్యారెక్టర్ మెరుపుతీగలా అలా కనిపించి ఇలా వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement