బికినీకి రెడీ...
సోహా అలీఖాన్ తల్లి షర్మిలా టాగోర్ ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. అన్నయ్య సైఫ్ అలీఖాన్... ప్రెజెంట్ స్టార్ హీరో. దానికి తోడు పటౌడీ రాజవంశం నేపథ్యం. ఇవేవీ సోహాకు బాలీవుడ్‌లో ప్రాచుర్యం తీసుకురాలేకపోయాయి. అందుకే తన రూట్ మార్చాలనుకుంటున్నారామె. సంప్రదాయ ధోరణిని వదిలేసి ఫుల్ గ్లామర్‌తో బాలీవుడ్‌ని షేక్ చేయాలనుకుంటున్నారు. అందుకే తెరపై బికినీతో కనిపించేందుకు సోహా ఓకే చెప్పేశారు. గౌరవప్రదమైన వంశం నుంచి వచ్చిన సోహా బికినీతో నటిస్తున్నారనే వార్త బాలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా నిలిచింది.
‘రంగ్‌దే బసంతి’ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహా, ఆతర్వాత తుమ్ మిలే, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో అభిమానులను ఆకర్షించడంలో దారుణంగా విఫలమయ్యారు. తాజాగా ’మిస్టర్ జో బి కార్వాల్హో’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారామె. అయితే పాత్ర డిమాండ్ మేరకు వివిధ అవతారాల్లో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కనిపించనున్నారు. క్యాబరే డాన్సర్‌గా కనిపించడమేకాకుండా.. సాహోసోపేతమైన పోరాటల్లో కూడా నటిస్తున్నారామె.