బికినీ కోసం తప్పు చేశాను!
‘‘పట్టుచీర కట్టుకుని ఈత కొలనులో ఈదగలుగుతామా? బికినీ వేసుకుని గుడికి వెళ్లగలుగుతామా?’’ అని కొంతమంది తారలు అంటుంటారు. ‘ఈ చిత్రంలో మీరు బికినీ ధరించడానికి కారణం?’ అనే ప్రశ్నకు ఈ విధంగా స్పందిస్తుంటారు. సీన్ డిమాండ్ చేసింది కాబట్టే, బికినీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెబుతుంటారు. ఇప్పుడు ఆలియా భట్ కూడా అదే అంటున్నారు. వచ్చే నెల విడుదల కానున్న ‘షాన్‌దార్’ చిత్రంలో ఆలియా బికినీలో కనిపించనున్నారు. ఈ కాస్ట్యూమ్ కోసం ఆమె సన్నబడ్డారు.
కానీ, ఇప్పుడు బాధపడుతున్నారు. దాని గురించి ఆలియా చెబుతూ - ‘‘బికినీలో నా శరీరాకృతి బాగుండాలని సన్నబడ్డాను. కానీ, ‘ఏంటి ఇలా అయిపోయావ్? మరీ సన్నబడిపోయావ్’ అని అందరూ అడుగుతుంటే, ఏదో తప్పు చేసినట్టుగా చాలా బాధగా ఉంది. ఏదో రోగిని పరామర్శించినట్లుగా పరామర్శిస్తున్నారు. నాకైతే ఇప్పుడున్న బరువుతో ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా నా ఫిజిక్‌కి సెట్ అవుతోంది. కానీ, అందరూ ‘ఇలా అయిపోయావేంటి?’ అని అడుగుతుంటే, బరువు పెరగాలనిపిస్తోంది’’ అని చెప్పారు.