ఈత కొలనులో చీర కట్టుకుని ఈదలేం. గుడికి స్విమ్ సూట్ వేసుకుని వెళ్లలేం కదా. సందర్భానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవాలి. స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి స్విమ్ సూట్ వేసుకున్నాం. ఏదైనా సినిమాలో బికినీ ధరించిన హీరోయిన్‌ని ‘స్విమ్ సూట్ ఇబ్బందిగా అనిపించలేదా?’ అని అడిగితే.. ఈ విధంగా సమాధానం చెబుతారు. ఇప్పుడు రెజీనా కూడా అలానే అంటున్నారు. బికినీ సీన్ గురించి దర్శకుడు తిరు చెప్పగానే ఆమె తటపటాయించారట. గౌతమ్ కార్తీక్‌తో కలిసి యాక్ట్ చేసిన తమిళ చిత్రం ‘చంద్రమౌళి’ కోసం రెజీనా బికినీ ధరించారు. సినిమా కోసం ఈ బ్యూటీ బికినీ ధరించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఎక్స్‌పీరియన్స్ గురించి రెజీనా మాట్లాడుతూ – ‘‘బికినీ అనగానే భయపడ్డా. నేను బికినీ వేసుకోనని డైరెక్టర్ తిరుకు చెప్పాను.
కానీ తిరు మాత్రం ‘నువ్వు బికినీ ధరిస్తేనే నేనీ సాంగ్ షూట్ చేస్తాను’ అని పట్టుబట్టి ఒప్పించారు. స్క్రిప్ట్‌లో కూడా బీచ్ సాంగ్ ఉంది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం కోసం ఆ సాంగ్ షూట్ చేశారు డైరెక్టర్. అలాగే బికినీ వేసుకోవాలంటే కరెక్ట్ ఫిజిక్ ఉండాలి. దానికోసం నేను కొంచెం వెయిట్ కూడా తగ్గాల్సివచ్చింది. ముందు చెప్పినట్టుగానే ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు షూట్ చేశారు. ఆడియన్స్ ఇబ్బందిపడేలా ఉండదు’’ అని పేర్కొన్నారు రెజీనా. ఈ సాంగ్ బయటకు వచ్చినప్పటినుంచి ‘చంద్రమౌళి’ సినిమా కంటే ఆ సాంగ్‌లో రెజీనా గురించే ఎక్కువగా మాట్లాడుకోవటం విశేషం.
బికినీ అనగానే భయపడ్డా..
Published Sat, May 5 2018 12:07 AM | Last Updated on Sat, May 5 2018 9:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment