హాట్ వీడియో పోస్ట్‌ చేసిన ఇలియానా | Ileana D'Cruz Celebrates 40 lakhs Followers with Bikini | Sakshi
Sakshi News home page

హాట్ వీడియో పోస్ట్‌ చేసిన ఇలియానా

Published Wed, Nov 23 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

హాట్ వీడియో పోస్ట్‌ చేసిన ఇలియానా

హాట్ వీడియో పోస్ట్‌ చేసిన ఇలియానా

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్లో టైం పాస్ చేస్తున్న హాట్ బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ గోవా సుందరి. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 40 లక్షలకు చేరినందుకు గాను ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది ఇల్లీ బేబి. సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవటంతో గతంలో కూడా ఇలాంటి వీడియోలతో సందడి చేసింది ఈ బ్యూటి.

టూ పీస్ బికినీలో అండర్ వాటర్లో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అభిమానులకు కృతజ్ఞతలు తెలపడం కూడా ఇంత హాట్ గానా అంటూ కొంత మంది పెదవి విరుస్తుంటే, మరి కొంత మంది మాత్రం ఇలియానా అందాలను షేర్ చేస్తూ ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేతిలో ఉన్న ఇలియానా సౌత్ ఇండస్ట్రీ పిలుపు కోసం ఎదురుచూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement