ఆయన మీద నమ్మకంతోనే అంత ధైర్యం చేశా : సమంత | Samantha turns bikini babe with 'Anjaan' | Sakshi
Sakshi News home page

ఆయన మీద నమ్మకంతోనే అంత ధైర్యం చేశా : సమంత

Published Sun, Aug 17 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

ఆయన మీద నమ్మకంతోనే అంత ధైర్యం చేశా : సమంత

ఆయన మీద నమ్మకంతోనే అంత ధైర్యం చేశా : సమంత

 మొదట తమిళంలో నటించినా, ఇప్పుడు తెలుగు చిత్రాలతో యమ బిజీగా ఉంటున్న హీరోయిన్ సమంత తాజా తమిళ చిత్రం ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) పుణ్యమా అని ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈ సినిమాలోని ఓ పాటలో సమంత టూ పీస్ బికినీలో కనిపించడం, డెనిమ్ షార్ట్‌లు - ఒళ్ళు కనిపించే తెల్ల చొక్కా - నుదుటన ఎర్ర స్కార్ఫ్‌తో సినిమాలో నర్తించడం ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో చర్చ రేపింది. నిన్న మొన్నటి వరకు పాత్రలతో పాటు దుస్తులూ హుందాగా ఉండేలా జాగ్రత్తపడుతూ వస్తున్న ఈ యువ హీరోయిన్ ఒక్కసారిగా ఇలా సెక్స్ అప్పీల్ ఉండేలా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చడం కెరీర్‌లో కొత్త దశకు సన్నాహం చేసుకోవడానికేనని విమర్శకుల వాదన. ఈ విషయంపై సమంత తాజాగా వివరణనిస్తూ... ‘‘నేను వేసుకున్న దుస్తుల గురించి ఇంత చర్చ జరుగుతుందని అనుకోలేదు’’ అంటూ అసలు సంగతి వివరించారు.
 
 జరిగింది ఏమిటంటే, పాట చిత్రీకరణకు కావాల్సిన దుస్తుల ఎంపికకు కేవలం రెండు రోజులే టైమ్ ఉందట. పాట కొద్దిగా జానపద ఫక్కీలో ఉంది కాబట్టి, దానికి ఆధునిక రంగు తేవడం కోసం షార్ట్‌లు వేసుకుందట సమంత. ఈ సినిమాలో తాను ఆ మాత్రం సెక్సీగా కనిపించడానికి సిద్ధపడ్డానంటే, అందుకు ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ కారణమంటున్నారామె. ‘‘ఆయన ఉన్నారు కాబట్టి, తెరపై నేను చెత్తగా కనిపించనని నాకు నమ్మకం ఉంది. అందుకే, కాస్తంత గ్లామరస్‌గా కనిపించడానికి ఇదే మంచి అవకాశమనుకున్నా. ఇవాళ తెరపై అందంగా కనిపిస్తున్నానంటే, అది ఆయన చలవే’’ అని సమంత అన్నారు.
 
 ఈ సినిమా పుణ్యమా అని సినిమా రంగానికి వచ్చి అయిదేళ్ళయిన తరువాత ఇప్పుడు అందరూ సమంత కూడా సెక్సీగా కనిపించగలదంటూ ఒప్పుకోవడం ఈ అమ్మడికి ఆనందం కలిగిస్తోంది. ‘‘ఇన్నేళ్ళుగా దాదాపు ఒకే రకంగా చూసి చూసి ప్రేక్షకులకే కాదు, నా లుక్ మీద నాకే విసుగెత్తింది. అలాంటప్పుడు ‘అంజాన్’తో ఈ కొత్త గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటోంది సమంత.  మొత్తానికి, గతంలో మహేశ్‌బాబు ‘1 - నేనొక్కడినే’ సినిమా ప్రచార సమయంలో బీచ్‌లో హీరో నడుస్తుంటే, అతని వెనక హీరోయిన్ పాకుతున్న ఫోటో మీద కామెంట్‌తో వివాదాస్పదమైన సమంత ఈసారి మాత్రం కురచ దుస్తుల్లో, బికినీలో కనిపించడం విశేషమే.
 
 ఆ పేరు చెప్పి, చర్చ పెట్టదలుచుకోలేదు!
 అన్నట్లు హీరో సిద్ధార్థ్‌తో తనకున్న అనుబంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నా, ఆ విషయం గురించి సమంత ఇప్పటికీ నోరు విప్పడం లేదు. ‘‘వ్యక్తి పేరెందుకు కానీ, ఒకరితో నా అనుబంధం ఎంతో సంతోషంగా సాగుతోంది. నలుగురితోనూ చెప్పి, దాన్ని పాడుచేసుకోదలుచుకోలేదు’’ అని తాజాగా వ్యాఖ్యానించారామె. ‘‘ఎవరేం రాసినా సరే, నటీమణులకు ఇబ్బం దికరంగా ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నేను అలా అనుకోవడం లేదు. నా వ్యక్తిగత ప్రేమ జీవితం గురించి బహిరంగ చర్చలు జరగడం నాకిష్టం లేదు’’ అని  సమంత కుండబద్దలు కొట్టారు. ఆమె అభిప్రాయం గౌరవించదగినదే కదూ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement