
'Stop Paying For Love And Hate' Is Siddharth Tweet About Samantha? నాగచైతన్యతో విడాకుల తర్వాత ప్రతి రోజు ఏదో ఒకరకంగా సమంత వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే వీరిద్దరి టాపిక్ ఇప్పటి ట్రెండింగ్‌లో ఉంటుంది. వీరి విడిపోయి రెండు నెలలు గడుస్తున్నా.. జనాల్లో మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. సోషల్ మీడియాలో సమంత ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. దానిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేయడం, తను ఏ పోస్ట్ పెట్టినా.. విడాకులతో లింక్ పెడుతూ.. ట్రోల్ చేయడంతో చై-సామ్‌ల టాపిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతుంది.
ఇక ఇటీవల సమంత విడాకులపై స్పందిస్తూ.. తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని తెలిపింది. దీంతో తన భవిష్యత్తుపై తనకు ఆశలు లేవని చెప్పుకొచ్చింది. అలాగే నెటిజన్స్ ట్రోలింగ్‌పై స్పందిస్తూ... ‘ సోషల్ మీడియా అనేది నటీనటులను తమ అభిమానులకు దగ్గరగా చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్స్ నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వారు నా జీవితంలో భాగమయ్యారు. కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వారందరినీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. అని సామ్ అభ్యర్థిచింది. ఇదిలా ఉంటే.. సమంత కామెంట్‌పై సిద్దార్థ్ పరోక్షంగా కౌంటర్ వేసినట్లు తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే అర్థమవుతుంది.
‘నేటి విషపూరిత సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడం కోసం, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ దానంతట అదే జరిగే అవకాశం లేదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవాలి. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయండి' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో సమంత, చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడు కూడా సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.‘మోసం చేసిన వారు ఎప్పటికీ బాగు పడలేరు.. స్కూల్‌లో టీచర్లు నేర్పిన పాఠం అదే’ అంటూ సిద్దార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment