సమంతకేమయ్యింది? | samantha not attend to anjaan audio function | Sakshi
Sakshi News home page

సమంతకేమయ్యింది?

Published Sat, Jul 26 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

సమంతకేమయ్యింది?

సమంతకేమయ్యింది?

నటి సమంత కేమయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్న విషయం ఇదే. టాలీవుడ్ హీరోయిన్‌గా హవా సాగిస్తున్న ఈ చెన్నై చిన్నదానికి కోలీవుడ్‌లో ఇప్పటికీ చెప్పుకోవడానికి మచ్చుకైనా పెద్ద హిట్ లేదు. అయితే ఇప్పుడిక్కడ ఈ బ్యూటీకి యమ క్రేజ్. విజయ్, సూర్య, విక్రమ్ వంటి టాప్ హీరోల సరసన నటిస్తున్నారు. అదే స్థాయిలో విమర్శనలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల సూర్య సరసన నటించిన అంజాన్ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో సమంత పాల్గొనకపోవడంతో ఆమెపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
 
సాధారణంగా తాను నటించని చిత్ర కార్యక్రమాల్లో కూడా ఆహ్వానిస్తే పాల్గొనే ఈ చెన్నై చిన్నది తాను నటించిన తొలి భారీ చిత్రం అంజాన్ ఆడియో కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ జరగనున్న విషయం సమంతకు తెలుసు. ఆమెకూ చిత్ర యూనిట్ నుంచి ఆహ్వానం అందింది. అయినా ఈ అమ్మ డు కావాలనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న ట్లు ప్రచారం జరుగుతోంది.
 
నటుడు సిద్ధార్థ్ ప్రియురాలైన సమంత ఆయన మాదిరేతగుదునమ్మా అంటూ ట్విట్టర్లో అనవసర విషయాలకు పోయి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. గొడవలకు దారి తీసే చర్యలకు పాల్పడుతున్నారు. సహజంగా మాట్లాడుతూనే అనూహ్యంగా మూడీగా మారిపోతున్నారట. సిద్ధార్థ్‌తో లవ్ లో పడ్డ తరువాతే సమంత ఇలా ప్రవర్తిస్తున్నారనే గుసగుసలు కోలీవుడ్‌లో కోడై కూస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement