
మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే, నేను దాన్ని ట్వీట్ చేశాను. దానికి ఎవరో బాధపడితే నాకేం సంబంధం?: సిద్ధార్థ్
నాగ చైతన్య-సమంత విడాకులు ప్రకటించిన రోజు హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న చై-సామ్ విడాకులు తీసుకోబోతున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వెంటనే...‘మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు’అని నెటిజన్లను ప్రశ్నిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఆయన సమంత గురించే అన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది.
(చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ)
One of the first lessons I learnt from a teacher in school...
— Siddharth (@Actor_Siddharth) October 2, 2021
"Cheaters never prosper."
What's yours?
తాజాగా ఆ ట్వీట్‌పై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తనకు ‘మహాసముద్రం’ దర్శకుడు అజయ్ భూపతికి మాటల మధ్యలో వచ్చిన అంశంపై తన చిన్నప్పుడు నేర్చుకున్న లెసన్‌ని జోడిస్తూ ట్వీట్ చేశానని సిద్ధార్థ్ చెప్పాడు. తన జీవితంలో జరిగిందే తాను ఆరోజు ట్వీట్ చేశానని, ఎవరో తన గురించి అనుకుంటే తానేమీ చేయలేనన్నారు. మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే, నేను దాన్ని ట్వీట్ చేశాను. దానికి ఎవరో బాధపడితే నాకేం సంబంధం అని సిద్ధార్థ్ ప్రశ్నించారు. నా లైఫ్ గురించి నేను మాట్లాడుతానని, వేరే వాళ్లతో సంబంధమే లేదని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.