
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది.
(ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్)
అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్‌లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు.
ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్‌పై నిజమేనంటూ కథనాలు హల్‌చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్‌స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్‌తో వీరిద్దరి రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో.
అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్‌లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది.
(ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!)
Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023