స్టయిలిష్ సికిందర్ | Surya-Samantha's Anjaan Set To Release In Telugu As Sikander | Sakshi
Sakshi News home page

స్టయిలిష్ సికిందర్

Published Tue, Jul 22 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

స్టయిలిష్ సికిందర్

స్టయిలిష్ సికిందర్

తండ్రులకు తగ్గ తనయులు భారతీయ సినీరంగంలో చాలామంది ఉన్నారు. కానీ... తండ్రులను మించిన తనయులు మాత్రం సినీరంగంలో అరుదు. దక్షిణాదిన అయితే... అలాంటి కొడుకు సూర్య ఒక్కడే. తమిళ హీరో శివకుమార్ తనయుడిగా తెరకు పరిచయమయ్యారాయన. సుమారు యాభై ఏళ్లుగా హీరోగా, కేరక్టర్ నటునిగా శివకుమార్ సాధించలేని పేరుప్రఖ్యాతుల్ని అయిదారేళ్లలోనే సాధించేసి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు సూర్య. అంతేకాదు, నటునిగా అనతికాలంలోనే ఎన్నో ప్రయోగాలు చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు.
 
  కమల్‌హాసన్ తర్వాత దక్షిణాదిన ప్రయోగాత్మక పాత్రలు పోషించిన అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకరంటే అది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న చిత్రం ‘ఆంజాన్’. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ‘సికిందర్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇందులో కూడా సూర్యది వైవిధ్యమైన పాత్రే. కెరీర్‌లో తొలిసారి స్టయిలిష్ డాన్‌గా నటిస్తున్నారాయన. నటనపరంగా, వాణిజ్యపరంగా సూర్య కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలా ‘ఆంజాన్’ నిలుస్తుందని చిత్ర నిర్మాతలు సిద్దార్థ్‌రాయ్ కపూర్, ఎన్.సుభాష్‌చంద్రబోస్ నమ్మకం వెలిబుచ్చుతున్నారు.
 
 ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సికిందర్’ని తిరుపతి బ్రదర్స్‌తో కలిసి లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మిస్తున్నారు. సమంత కథానాయిక. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ‘సికిందర్’ పాటలను ఈ నెల 31న తెలుగు చిత్ర ప్రముఖుల సమక్షంలో విడు దల చేయనున్నట్లు లగడపాటి శిరీష, శ్రీధర్‌లు చెప్పారు. ఆగస్ట్ 15న ‘సికిందర్’ విడుదల కానుంది. ఈరోజు సూర్య 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement