sudin dhavalikar
-
‘త్వరలోనే రాష్ట్రానికి సీఎం’
పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ జూన్ చివరిలోపు రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సుధీన్ దవలీకర్ తెలిపారు. అనారోగ్య కారణంగా మార్చి 7 నుంచి పారికర్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. జాన్‌తో పారికర్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటారని దవిలీకర్ తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు సీఎం పదవిపై అశాలేదని, పనితీరు బాగుంటే భవిషత్తులో ప్రజలే ఆ పదవి కట్టబెడతారని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించండని ప్రతిపక్ష కాంగ్రెస్ గతకొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
మంత్రుల మధ్య 'బికినీ' వార్
పనాజీ: గోవా మంత్రుల మధ్య బికినీల గొడవ జరుగుతోంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడంపై ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సుదీన్ దావలికర్, టూరిజం మంత్రి దిలీప్ పరులేకర్ మధ్య విబేధాలు తలెత్తాయి. ఇందుకు గోవా అసెంబ్లీ వేదికైంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడానికి టూరిజం మంత్రి అనుమతించడంపై దావలికర్ వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు (విదేశీ టూరిస్టులు) బికినీలతో బీచ్‌ల బయటకు వస్తే తాను వ్యతిరేకిస్తానని దావలికర్ చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. టూ పీస్ బికినీలు ధరించడం మన సంస్కృతి కాదని అన్నారు. కాగా అసెంబ్లీలో టూరిజం మంత్రి పరలేకర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. 'టూరిజం మంత్రిగా బికినీలకు నేను వ్యతిరేకం కాదు. బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌లో బికినీలు ధరించవచ్చు. అయితే సూపర్ మార్కెట్లు, ఆలయాల్లో కాదు. బీచ్ టూరిజానికి గోవా ప్రసిద్ధి. ఇక్కడికి యూరప్ పర్యాటకులు ఎక్కువగా వస్తారు' అని చెప్పారు. కాగా బికినీల నిషేధించాలని గోవా మంత్రులు సుదిన్ దావలికర్, దీపక్ దావలికర్ డిమాండ్ చేశారు. -
దుస్తులపై ఆంక్షలు లేవు..కాని..
పానాజీ: గోవాలో ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ స్పష్టం చేశారు. దుస్తుల వ్యవహారంలో మితీమీరిన అశ్లీలత అనిపిస్తే ఎవరైనా కేసు నమోదు చేసుకోవచ్చని పరిక్కర్ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యుడు అలెక్సో లారెన్కో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అశ్లీలత మాటున ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధిస్తు కఠిన చర్యలు తీసుకుంటామని పరిక్కర్ అన్నారు. అభ్యంతరకరమైన దుస్తులు ధరించారని కేసులో ఎవరైనా కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్లవచ్చని ఆయన సూచించారు. గోవాలో బికినీ, మినీ స్కర్టులను నిషేధించాలని గోవా మంత్రి సుదీన్ దావాల్కర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
బికినీలు వద్దు.. ధోతిలే ముద్దు!
పానాజీ: గోవా బీచ్ ల్లో బికినీలు ధరించడానికి వీల్లేదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన గోవా మంత్రి సుదీన్ ధావల్కర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గోవా ప్రజలు సంప్రదాయ పద్దతిలో ధోతిలు ధరించాలని సుదీన్ పిలుపునిచ్చారు. ధోతి ధరించే భారతీయ సాంప్రదాయం ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి అని అన్నారు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ శాసన సభ్యుడు విష్ణు వా ధోతి ధరించడంపై సుదీన్ స్పందించారు. విష్ణును స్పూర్తి తీసుకుని అందరూ థోతి ధరించాలన్నారు. యువతులు నైట్ క్లబ్ లో స్కర్టులు ధరించడం వల్ల గోవా సంస్కృతికి ముప్పు వాటిల్లుతోందని సుధీన్ ఇటీలవ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. -
మంత్రి బికినీ ఫొటో: నిందితుడు ఎన్నారై
గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో పెట్టిన ఎన్నారై సవియో అల్మిడాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు బుధవారం వెల్లడించారు. గోవాకు చెందిన సవియో అమెరికాలో నివసిస్తున్నాడని తెలిపారు. గోవా బీచ్‌లు, నైట్ క్లబ్‌లలో బికినీలు నిషేధించాలంటూ ఇటీవల మంత్రి సుదీన్ దావలికర్ ఓ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మూడు క్లబ్‌లు, ఆరు బీచ్‌లతో అలరారే గోవా రాష్ట్రంలో బికినీలు నిషేధిస్తే ఎలా అంటూ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దాంతో సదరు మంత్రిగారు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై అమెరికాలో నివసిస్తున్న గోవాకు చెందిన సవియో ఆగ్రహాం కలిగించింది. దాంతో సుదీన్ పోటోలను మార్పింగ్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. మంత్రి సుదీన్ ఫొటోలు ఫేస్బుక్లో హల్చల్ చేశాయి. దీంతో గోవాకు చెందిన ప్రదీప్ బక్లే అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో యూఎస్ లో నివసిస్తున్న సవియో నిందితుడని పోలీసులు గుర్తించారు. -
బికినీ- గోచీ పేచీ
సముద్రతీర అందాలకు నెలవైన గోవాలో బికినీ-గోచీ పేచీ కలకలం రేపింది. బీచుల్లో బికినీలను నిషేధించాలని ఓ మంత్రిగారంటే.. గోచీ పెట్టుకు తిరగడంటూ ఓ ఫ్యాషన్ డిజైనర్ రుసరుసలాడారు. దీంతో బికినీ-గోచీల చర్చ హాట్ టాఫిక్ గా మారింది. గోవా పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేవి అందమైన బీచ్‌లు. అమ్మాయిలు బికినీలతో అరేబియా సముద్రంలో కేరింతలు కొడుతుండడం ఇక్కడ సర్వసాధారణం. అయితే బికినీ సంస్కృతితో తమ రాష్ట్రం భ్రష్టుపట్టిపడుతోందని ఆందోళన చెందిన గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ దీన్ని నిషేధించాలని గళమెత్తారు. ఎక్కడపడితే అక్కడ ఇలా 'టూపీస్' స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని వాపోయారు. తాము దీన్ని అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. బికినీ సంస్కృతిని నిషేధించాలన్న సుదీన్ దావలికర్ డిమాండ్‌పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ ఘాటుగా స్పందించారు. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని ఆయనకు పరోక్షంగా సూచించారు. విదేశాల్లో తయారైన ఫ్యాంటు, చొక్కాలు తొడుక్కోవడం మానేసి, శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా అంటూ బహిరంగ లేఖ రాశారు. ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని దావలికర్ కు కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. టూరిజంపై అధిక ఆదాయం ఆర్జించే గోవా.. సుదీన్ దావలికర్ డిమాండ్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బికినీలను నిషేధించబోమని స్పష్టం చేసింది. బీచుల్లో బికినీ ధరించడాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని గోవా సీఎం మనోహర్ పారికర్ అంటూ ఔదార్యం దాల్చడంతో వివాదం సద్దుమణిగింది. అయితే బికినీ-గోచీ పేచీ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించింది. -
గోచీ పెట్టుకు తిరగండి
గోవా మంత్రికి ప్రముఖ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ లేఖ పణజి: బీచుల్లో మహిళలు కురచ దుస్తులు, బికినీలు ధరించి సంచరించడం వంటివి నిషేధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోవా పీడబ్ల్యుడీ మంత్రి సుదిన్ ధవళికర్పై విమర్శల జడి చుట్టుముట్టింది. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని, మిరపకాయలు, టమోటా, బంగాళ దుంపలు వంటివాటిని వినియోగించరాదని, కుర్చీలు, బల్లలపై కూర్చుని పని చేయడాన్ని నిషేధించాలని దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ ఘాటు లేఖ రాశారు. లేఖలో ఎక్కడా మంత్రి పేరును పేర్కొనపోయినప్పటికీ మంత్రి వ్యాఖ్యలను వెన్‌డెల్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మంత్రి వ్యాఖ్యలు అభివృద్ధి నిరోధకంగాను ఉన్నాయన్నారు. ప్రస్తుతం ధరిస్తున్న చొక్కా యూరోపియన్దని, పాంట్స్, ఫైజమాలు చైనా, మధ్య ఆసియాలవని, సాక్స్, టీ-షర్టు, బినియన్లు, లోదుస్తులు సహా యూరప్‌లో కనిపెట్టారని ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతివి కాబట్టి వీటిని విడిచిపెట్టి భారతీయ సంస్కృతి అయిన శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా? అని లేఖలో ప్రశ్నించారు.