
మనోహర్ పారికర్
పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ జూన్ చివరిలోపు రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సుధీన్ దవలీకర్ తెలిపారు. అనారోగ్య కారణంగా మార్చి 7 నుంచి పారికర్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. జాన్‌తో పారికర్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటారని దవిలీకర్ తెలిపారు.
తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు సీఎం పదవిపై అశాలేదని, పనితీరు బాగుంటే భవిషత్తులో ప్రజలే ఆ పదవి కట్టబెడతారని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించండని ప్రతిపక్ష కాంగ్రెస్ గతకొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment