దుస్తులపై ఆంక్షలు లేవు..కాని..
దుస్తులపై ఆంక్షలు లేవు..కాని..
Published Wed, Jul 30 2014 2:45 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM
పానాజీ: గోవాలో ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ స్పష్టం చేశారు. దుస్తుల వ్యవహారంలో మితీమీరిన అశ్లీలత అనిపిస్తే ఎవరైనా కేసు నమోదు చేసుకోవచ్చని పరిక్కర్ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యుడు అలెక్సో లారెన్కో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అశ్లీలత మాటున ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధిస్తు కఠిన చర్యలు తీసుకుంటామని పరిక్కర్ అన్నారు.
అభ్యంతరకరమైన దుస్తులు ధరించారని కేసులో ఎవరైనా కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్లవచ్చని ఆయన సూచించారు. గోవాలో బికినీ, మినీ స్కర్టులను నిషేధించాలని గోవా మంత్రి సుదీన్ దావాల్కర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Advertisement