bikinis
-
మంత్రుల మధ్య 'బికినీ' వార్
పనాజీ: గోవా మంత్రుల మధ్య బికినీల గొడవ జరుగుతోంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడంపై ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సుదీన్ దావలికర్, టూరిజం మంత్రి దిలీప్ పరులేకర్ మధ్య విబేధాలు తలెత్తాయి. ఇందుకు గోవా అసెంబ్లీ వేదికైంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడానికి టూరిజం మంత్రి అనుమతించడంపై దావలికర్ వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు (విదేశీ టూరిస్టులు) బికినీలతో బీచ్‌ల బయటకు వస్తే తాను వ్యతిరేకిస్తానని దావలికర్ చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. టూ పీస్ బికినీలు ధరించడం మన సంస్కృతి కాదని అన్నారు. కాగా అసెంబ్లీలో టూరిజం మంత్రి పరలేకర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. 'టూరిజం మంత్రిగా బికినీలకు నేను వ్యతిరేకం కాదు. బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌లో బికినీలు ధరించవచ్చు. అయితే సూపర్ మార్కెట్లు, ఆలయాల్లో కాదు. బీచ్ టూరిజానికి గోవా ప్రసిద్ధి. ఇక్కడికి యూరప్ పర్యాటకులు ఎక్కువగా వస్తారు' అని చెప్పారు. కాగా బికినీల నిషేధించాలని గోవా మంత్రులు సుదిన్ దావలికర్, దీపక్ దావలికర్ డిమాండ్ చేశారు. -
దుస్తులపై ఆంక్షలు లేవు..కాని..
పానాజీ: గోవాలో ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ స్పష్టం చేశారు. దుస్తుల వ్యవహారంలో మితీమీరిన అశ్లీలత అనిపిస్తే ఎవరైనా కేసు నమోదు చేసుకోవచ్చని పరిక్కర్ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యుడు అలెక్సో లారెన్కో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అశ్లీలత మాటున ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధిస్తు కఠిన చర్యలు తీసుకుంటామని పరిక్కర్ అన్నారు. అభ్యంతరకరమైన దుస్తులు ధరించారని కేసులో ఎవరైనా కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్లవచ్చని ఆయన సూచించారు. గోవాలో బికినీ, మినీ స్కర్టులను నిషేధించాలని గోవా మంత్రి సుదీన్ దావాల్కర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
మినీ స్కర్టులు, బికినీలను నిషేధించలేం
పనాజీ: బీచ్‌లలో బికినీలు, నైట్ క్లబ్బులలో మినీ స్కర్టులు ధరించకుండా నిషేధం విధించలేమని గోవా టూరిజం మంత్రి దిలీప్ పారులేకర్ స్పష్టం చేశారు. బికినీలు, మినీ స్కర్టులను నిషేధించాలంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సుదిన్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పారులేకర్ పైవిధంగా స్పందించారు. ఇలా నిషేధం విధించడం సాధ్యంకాదని మంత్రి చెప్పారు. కాగా ధావలికర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఉచిత సలహాలు ఇచ్చే బదులు నీటి సమస్యపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రతినిధి దుర్గాదాస్ కామత్ హితవు పలికారు. -
బికినీలను నిషేధించాలి
పనాజీ: గోవా పేరు వినగానే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయి. అమ్మాయిలు బికినీలతో అరేబియా సముద్రంలో కేరింతలు కొడుతుంటారు. బికినీల సంస్కృతిని నిషేధించానే డిమాండ్ వినిపిస్తోంది. బికినీలను వ్యతిరేకిస్తున్నది ఏ ప్రజా సంఘాల వారో కాదు గోవా హోం మంత్రి కావడం విశేషం. అంతకుముందు గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్.. నైట్‌క్లబ్బుల్లో అమ్మాయిలు పొట్టి పొట్టి స్కర్టులు వేసుకురావడాన్ని నిషేధించాలని కోరారు. వాళ్లిలా పొట్టి స్క్రర్టులు వేసుకుని రావడం గోవా సంస్కృతికి ముప్పుగా మారిందని ఆయన పనజిలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో వ్యాఖ్యానించారు. ఎక్కడపడితే అక్కడ ఇలా పొట్టి స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని.. తాము దీన్ని అంగీకరించేది లేదని మంత్రి అన్నారు.