mini-skirts
-
దుస్తులపై ఆంక్షలు లేవు..కాని..
పానాజీ: గోవాలో ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ స్పష్టం చేశారు. దుస్తుల వ్యవహారంలో మితీమీరిన అశ్లీలత అనిపిస్తే ఎవరైనా కేసు నమోదు చేసుకోవచ్చని పరిక్కర్ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యుడు అలెక్సో లారెన్కో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అశ్లీలత మాటున ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధిస్తు కఠిన చర్యలు తీసుకుంటామని పరిక్కర్ అన్నారు. అభ్యంతరకరమైన దుస్తులు ధరించారని కేసులో ఎవరైనా కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్లవచ్చని ఆయన సూచించారు. గోవాలో బికినీ, మినీ స్కర్టులను నిషేధించాలని గోవా మంత్రి సుదీన్ దావాల్కర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
మినీ స్కర్టులు, బికినీలను నిషేధించలేం
పనాజీ: బీచ్లలో బికినీలు, నైట్ క్లబ్బులలో మినీ స్కర్టులు ధరించకుండా నిషేధం విధించలేమని గోవా టూరిజం మంత్రి దిలీప్ పారులేకర్ స్పష్టం చేశారు. బికినీలు, మినీ స్కర్టులను నిషేధించాలంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సుదిన్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పారులేకర్ పైవిధంగా స్పందించారు. ఇలా నిషేధం విధించడం సాధ్యంకాదని మంత్రి చెప్పారు. కాగా ధావలికర్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఉచిత సలహాలు ఇచ్చే బదులు నీటి సమస్యపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రతినిధి దుర్గాదాస్ కామత్ హితవు పలికారు.